మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం? సైనికుడిలా ఉండాలా? లేదంటే సాహసాలు చేసే వారిని ఇష్టపడతారా ? వంటచేయడంలో నిపుణుడై ఉండాలా? ఇలాంటి ప్రశ్నలను ఈ తరం అమ్మాయిలను గనుక అడిగితే ఎక్కువ మంది తమకు హాట్‌గా కనిపించే అబ్బాయిలే నచ్చుతారని తెలియజేస్తున్నారు. ఇటీవల ప్రధాన నగరాల్లోని యువతుల మనోభావాలను తెలుసుకునేందుకు చేసిన ఓ పరిశోధనలో వారు ఇంకా ఎన్నో అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
టీనేజ్‌లో అడుగుపెట్టిన వారికి నేటి రోజుల్లో ఫ్రెండ్స్ వుండటం అనేది ఓ ఫ్యాషన్. నేటి యువతులు కూడా వారికి నచ్చిన అర్హతలు, లక్షణాలు, స్వభావాలు కలిగిన వారినే తమ బాయ్‌ఫ్రెండ్‌గా ఎన్నుకుంటున్నారు. ఎంపిక చేసుకునేటప్పుడే ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు అందానికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు అందంగా పాడగలిగేవారివైపు మొగ్గుచూపుతున్నారు.
హీరోలా వుండాలి...

సంగీతం అంటే ఇష్టపడాలి..
వీకెండ్‌లో పార్టీలు నేటి వారికి మామూలు విషయం. లేదా స్నేహితుల పుట్టిన రోజు.. ఇతరత్రా పార్టీలు చాలానే వుంటాయి. అందుకే తమకు కాబోయే బాయ్ ఫ్రెండ్ మంచి సంగీత ప్రియులై ఉండాలని నగరాల్లోని అమ్మాయిలు కోరుకుంటున్నారు. ‘ఈ రోజుల్లో పబ్‌లకు వెళ్లడం మామూలు విషయం. అటువంటి సమయంలో మన పక్కన కూడా ఓ మంచి సింగల్ లేదా గిటార్ వాయించే వారు ఎంటో ఎంతో బాగుంటుంది అనిిపిస్తుంది. అందుకే నా ఓటు రాక్ సంగీతాన్ని హోరెత్తించేలా పాడగలిగేవారికే’ అని మనీషా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.
అందంగా.. స్మార్ట్‌గా...
నలుగురిలోకి వెళ్లినప్పుడు మన ఫేస్ వాల్యూనే అందరిలో ప్రత్యేకంగా చూపిస్తుంది. అందువల్ల అందంగా, స్మార్ట్‌గా వున్న అబ్బాయి అయితే బాగుంటుందని కొందరు అమ్మాయిలు అంటున్నారు. ‘స్మార్‌గా...ఎంతో స్టైలిష్‌గా నడిచివెళుతుంటే ఎంతో అందంగా ఉంటారు కొంతమంది అబ్బాయిలు. అలా చూస్తూ వుండాలనిపిస్తుంది. దానితో పాటు కాస్త స్నేహంగా.. హుందాగా వ్యవహరిస్తే నాకు నచ్చుతుంది. అలాంటి అబ్బాయి గనుక పక్కనుంటే ఇతరుల కళ్లన్నీ మనవైపే. నాకు కావలసింది అందమైన బాయ్‌ఫ్రెండ్’ అని మేనేజ్‌మెంట్ విద్యార్థిని సింధూ అంటోంది
ఛాలెంజింగ్‌గా వుండాలి..

చురుకైన చూపులు కలవారు...
చురుకైన చూపులు కలిగిన వారు ఎంతో ధైర్యవంతులు అయి వుంటారన్న విషయాన్ని అమ్మాయిలు ఎక్కువగా నమ్ముతున్నారు. అలా వున్నవారు మంచి బలవంతులై కూడా వుంటారన్నది వారి అభిప్రాయం కూడా. ‘పదునైన చుపుకలవారికి ఎక్కువ స్టామినా ఉంటుంది. ఇది సాధారణంగా కాస్త పొడుగ్గా వున్నవారికే వుంటుంది. అందుకే నేను అలాంటి కళ్లు ఉన్నవారినే ఒప్పుకుంటాను’ అని కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సుమ అన్నారు.
టాలెంటెడ్ అయి వుండాలి....
ప్రేమించడానికైనా.. పెళ్ళి చేసుకోవడానికి లేదా.. ఫ్రెండ్‌గా వుండటానికి ముందుగా అబ్బాయి మంచి టాలెంటెడ్ అయి వుండాలి. ‘టాలెంట్ పర్సన్ అయి ఉండి, మంచి వ్యక్తిత్వం కలవాడైతే చాలు. తెలివితేటలుంటే డబ్బును సంపాదించడం చాలా తేలిక. అందుకే నాకు మంచి వ్యకిత్వం, ఎటువంటి ఇగో లేని అబ్బాయే బాయ్ ఫ్రెండ్‌గా రావాలను కుంటున్నాను. అతను ఎలాంటి పరిస్థితులనుండి వచ్చినా సరే’ అని ఐటీ సంస్థలో టిఎల్‌గా చేస్తున్న మిహత చెబుతున్నారు.
-హైమ సింగతల
సూర్య దినపత్రిక January 22, 2011
No comments:
Post a Comment