Search This Blog

Wednesday 20 August 2014

అరాచకాలపై విరుచుకుపడ్డ గళం...!

కాంగోలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలపై విరుచుకుపడ్డ గళం చౌచౌ నమెగాబె. రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలను వెలికి తీసింది. తన మైక్రోఫోనే సమాచార సాధనంగా అంతర్జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్లింది. కాంగోలో కేవలం ఒక్క రోజులో 36 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వాస్తవాలను తెలియజేసింది. 

దక్షిణ కివు రాష్ట్రంలోని బుకావులో చౌచౌ నమెగాబె పుట్టింది.చిన్నతనం నుండే ఎంతో ధైర్యంగా మా ట్లాడేది. బెరుకు ఏ మాత్రం కనిపించని మాటలు ఆమెవి.ఏదో సాధించాలనే తపన, కసితో వుండేది.ఇందు కు ఆమె మాట తీరే నిదర్శనం. ఆ లక్షణాలే ఆమెను నేడు ప్రపంచ ప్రభావశీల మహిళల సరసన నిలబెట్టాయి. ఏం చెప్పినా ఆధారాలతో సహా నిరూపించగల ధీరత్వం... కాంగోలో పరిస్థితుల్ని, ప్రజల స్థితి గతుల్ని అం చనా వేయగలిగిన చౌచౌ అట్టడుగు ప్రజల్ని చేరుకునేందుకు వున్న ఏకైక మార్గంగా రేడియోను ఎన్నుకుంది. 1997లో రేడియో మండెలియోలో ప్రజెంటర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. 

స్థానికంగా ఎంతో పేరున్న రేడియో స్టేషన్‌. 1990లలో ఎంతో ఉద్రిక్తతలకు గురవుతున్న పశ్చిమ కాంగో వైపు చౌచౌ తన దృష్టి సారించింది. మైక్రోఫోన్‌ను ఒక ఆయుధంగా మలచుకుని రహస్యంగా అక్కడి కార్య కలాపాలను డాక్యుమెంటరీగా రూపొందించింది. అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెలికి తీసేందుకు ఎంతో కష్టాలను ఎదుర్కొంది. మానవ హక్కులు అక్కడి వారి పాదాలకింద నలిగి పోవడం చూసి కన్నీళ్లు కార్చింది. తమ జాతి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించింది. మానవహక్కుల వాది గా, జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడి అధికారుల స్థాయి, పాలనా విధానాల్లో చోటు చేసుకున్న అవినీతిని కూడా వెలికి తీసి చూపింది.

2003లో చౌచౌ దక్షిణ కివు మహిళా మీడియా అసోసి యేషన్‌ను(ఏఎఫ్‌ఇఎం)ను ప్రారంభించింది. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిం చింది. దీనితోపాటే మహిళా జర్నలిస్టులకు కూడా శిక్షణ అందించింది. ఏఎఫ్‌ఇఎం, రేడియో బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా చౌచౌ ఎంతో వెలుగులోకి వచ్చింది. మహిళా సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సమస్యలపై ఆమె పనిచేసింది. ఆమె కాంగో లోని మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.డిసెంబర్‌ 2007న హా గ్యూ కు ప్రయాణం చేసింది. అంతర్జాతీయ న్యాయ స్థానంలో కివు మహిళా న్యాయంపై పోరాడింది. 2009లో ఆమె ఆక్టర్‌, డైరెక్టర్‌ బెన్‌ అఫ్లెక్‌ రూ పొందించిన డాక్యుమెంటరీ ద్వారా ఆమె గ్లోబ ల్‌ లీడర్‌ షిప్‌ అవార్డు, దాని ద్వారా వచ్చిన లా భాలను పొందింది. వాషింగ్‌టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో ఆమె ఈ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల 
సూర్య దినపత్రిక, ధీర

No comments:

Post a Comment