వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, కుటుంబ పోషణ కోసం పని చేయడం ఇవన్నీ మహిళల సాధారణ జీవనంలో భాగం.. ఉదోగ్యాలు చేసే వారైనా కుటుంబ అవసరాలను చూడక తప్పదు.. కానీ బంగ్లాదేశ్ గిరిజన మహిళలు ఇందుకు భిన్నం. పనులన్నీ ముగించిన తరువాత వారో రక్షక దళం..ఆకుపచ్చని చీరలు కట్టుకుని.. తలపై టోపీ.. చేతిలో కర్రలు పట్టుకుని అడవిని ధ్వంసం చేసే వారి భరతం పట్టేందుకు బయల్దేరుతారు... అడవికి హాని కలిగించే వారి మెడలు వంచి పోలీసులకు అప్పజెపుతారు.

బంగ్లాదేశ్‌లోని దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతో నిండిపోయి వుంటుంది. అనేక రకాల జంతువులు, పక్షులకు ఇవి ఆవాసాలుగా వున్నాయి. ఈ అడవినే జీవనాధారం చేసుకుని అనేక తెగలు కూడా అక్కడికి దగ్గరిలోని పరిసర ప్రాంతాల్లో నివాసం వుంటున్నాయి. అడ వి ఉత్పత్తులను సేకరించడం, వేట, కర్రల సేకరణ వంటివి ఇక్కడి గిరి జనుల నిత్య జీవనంలో భాగం. వీరితో పాటు అడవిలోని పురాతన చెట్లను నరికి అక్రమంగా రవాణా చేసేవారు ఎక్కువయ్యారు. దీంతో క్ర మంగా అటవీ ప్రాంతం తరిగిపోవడాన్ని గమనించిన ప్రభుత్వాలు వాటి రక్షణకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఏదీ ఫలించ లేదు.

రక్షక దళ అవతరణ...
ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత అక్కడి మహిళలంతా కలి సి ఆకుపచ్చని చీరలు కట్టుకుని..చేతిలో కర్రలు తీసుకుని అడవిలో కలియ తిరుగుతారు. అడవికి నష్టం కలిగించే వారిని ఎదిరించి పోరా డతారు. మూడేళ్లుగా తమతోపాటు అడవిలో నిత్యం తిరుగుతు న్న ఈ మహిళలను అక్క డి చెట్లు కూడా గుర్తిం చినట్లే ప్రవర్తి స్తాయని రక్షక దళంలోని మహి ళలు చెబుతున్నారు. ‘అడవి రక్షకులుగా’ పేరు పొందిన ఈ చీ రల స్వ్కాడ్ అడవిలో రేంజర్లతో పాటు కలిసి మొత్తం అడవిని కాపా డుకుంటున్నారు.

ప్రత్యామ్నాయ జీవనాధారం వైపు...
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే మహిళలకు ప్రభుత్వం ప్రత్యా మ్నాయ సదుపాయాలను కల్పించింది.పాడి, పశువుల పెంపకం, కో ళ్ల ఫారం వంటివి ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అంది స్తోంది. వీరి శ్రమకు 50 డాలర్లను అందిస్తోంది. ఇది నామమాత్రం అయినప్పటికీ అక్కడి మహిళలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా రు. ఏ కాస్త సమయం దొరికినా తోటి వారికి కూడా అడవిలో వేటా డటం వంటివి మానుకొమ్మని చెబుతున్నారు. కలిగే లాభాలను వివరి స్తున్నారు. అలా ముందుకొచ్చిన వారికి ఉపాధి కల్పించాలని ప్రభు త్వానికి విన్నవిస్తున్నారు. రోజ్‌గార్ యోజనా వంటి పథకాల ద్వారా ఇప్పటి వరకు ఇలాంటి వారెందరికో ఉపాధి కల్పించేలా చేశారు.
మేమంటే వారికి భయం...

ఇంకా చేయాల్సింది చాలా వుంది..
ఇక్కడి తెగకు నాయకత్వం వహించే అమిన్ ఖాన్ ఒక ప్పుడు జీవన భృతి కోసం అడవిలో వేటాడేవాడు.దా నిద్వారా వచ్చే దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు మహిళలను చూసి ఆయన కూడా మారి పోయాడు. ప్రభుత్వానికి సాయం చేస్తున్నాడు. అడవి రక్షణలో తన వంతుగా ఇతరులకు వివరిస్తున్నాడు.‘ప్రభుత్వం ఏదై నా ప్రత్యామ్నాయం కల్పించినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది.ఇప్పుడు అదే జరిగింది. దీని కన్నా ముందు చాలా పథకాలు తెచ్చారు కానీ అవేవీ ఫలితాల నివ్వ లేదు. ఏ ప్రాంతం అభివృ ద్ధి చెందాలన్నా అక్కడి స్థాని కులను భాగస్వాములను చేసుకుంటేనే ఫలితం దొరు కుతుంది అనేదిప్పు డు రుజు వయ్యింది. దీని తోపాటే అడ విని తిరిగి పెం చేందుకు కూ డా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అంటున్నారు.
ఇది మా అదృష్టం...

అడవిని విస్తరించే ప్రయత్నం...
ప్రస్తుతం అడవి మొత్తం 77 కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. దీన్ని కాపాడటంతో పాటు కొత్తగా చెట్లను నాటేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. దీనికి కూడా మహిళల భాగస్వామ్యాన్నే కోరింది. 70 శాతం రక్షణకు 30 శాతం తిరిగి ఆడవిని పెంచేందుకు కేటాయి స్తున్నారు. పక్షి జాతులను, జంతుజాలాన్ని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అన్ని పనుల్లోనూ మహిళలదే భాగ స్వామ్యం. వారి రాకతోనే తమ పథకాలన్నీ వాస్తవ రూపం దాల్చుతు న్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. చెట్లను తిరిగి నాటే ప్రయత్నంలో వారు మహిళల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు.
- హైమ సింగతల
March 16, 2011
No comments:
Post a Comment