Search This Blog

Thursday 17 January 2013

సైన్సు జీనియస్!




ఏడేళ్ల సైన్స్ జీనియస్ పృథ్విక్. జంతు శాస్త్రానికి సంబంధించి రెండు పుస్తకాలను రాసేశాడు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం 'వెన్ డైనోసార్స్ రోమ్డ్ ది ఎర్త్'తో సైన్స్ ప్రపంచంలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాడు. 


నాలుగో తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీనియర్స్‌కు సైన్స్ పాఠాలు చెప్తున్నాడు. 'డైనోసార్లు మిలియన్ సంవత్సరాల కిత్రం భూమి మీద జీవించాయి. అందులో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా కనుక్కోవాల్సినవి చాలానే వున్నాయి' అని చెబుతూ తన తరువాతి పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమవుతున్నాడు ఏడేళ్ల పృధ్విక్. 165 ఐక్యూతో మేధావులను కూడా వెనక వరుసకి నెట్టేశాడు దుబాయ్‌లో బ్రిటీష్ సైన్స్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ భారతీయ చిన్నారి. అతని గది నిండా డైనోసార్ల బొమ్మలే. జంతువులపై పుస్తకాలు, సీడీలు, సినిమాలకు కొదవే వుండదు. ఎక్కడ చూసినా అవే. అలా అని వాటితో ఆడుకునేందుకు కాదు. పరిశోధనల కోసమే వాటిని సేకరించాడు. అందులో ఏ రకమైన డైనోసార్ బొమ్మ చూపించినా వాటి లక్షణాలు, పేరు, వివరాలు ఇలా అన్నీ ఠక్కున చెప్తేస్తాడు. భూమి పుట్టుకకు సంబంధించిన అంశాలు, జీవం ఏర్పడటానికి ముందు ప్రపంచం, డైనోసార్లు, సైన్స్, మ్యాథ్స్ ఇలా దేని గురించి అడిగినా చక్కగా వివరించేస్తాడు. ఇందుకు వాళ్ల అమ్మ ఇందిర, నాన్న అశోకే కారణం అని చెప్తున్నాడు. 
ఆరు నెలల వయసులోనే మాటలు నేర్చిన ఈ చిన్నోడు అప్పటి నుంచే భూమి గురించి వాళ్ల తాతను ప్రశ్నలు అడిగే వాడట. జంతువులు, వాటి పుట్టుక, మనిషి పుట్టుక ఇలా ప్రతి దాని గురించి ప్రశ్నించేవాడట. తెలిసినంత వరకు చెప్పేవారట. ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చేసరికి పృథ్విక్ సందేహాలు తీర్చేందుకు వాళ్ల తాతయ్య పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వచ్చేదట! అలా మొదలైన ఆసక్తి భూమి పుట్టుక, శిలాజ శాస్త్రం, ఫిజిక్స్, జీవం ఆవిర్భావం వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాల అధ్యయనానికి చేరుకుంది. తెలుసుకోవడమే కాదు సందేహాల నివృత్తి కోసం పరిశోధన, ప్రయోగాలు కూడా మొదలు పెట్టాడు. ఫలితంగానే 2010 బ్రిటీష్ సైన్స్ అసోసియేషన్ అందించే మెగాస్టార్ సైన్స్ క్రెస్ట్ అవార్డును అందుకున్నాడు. బ్రిటీష్ కౌన్సిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారాడు. అన్నిటికన్నా పృథ్విక్‌కి అమితాసక్తి కలిగించేది డైనోసార్లు. వాటిపై పరిశోధనలు మొదలు పెట్టాడు. 
మూడవ తరగతిలో వుండగా పాఠశాలలో ఓ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయిన వాళ్ల టీచర్ వీటన్నిటినీ ఓ పుస్తకంగా రాయమని ప్రోత్సహించింది. సంవత్సర కాలం పాటు అనేక పుస్తకాలను అధ్యయనం చేసి, సందేహాలను తొలగించుకుని ఇటీవలే వాటిపై పుస్తకాన్ని విడుదల చేశాడు. రెండవ పుస్తకం కూడా పూర్తి చేశాడు. కేవలం డైనోసార్ల గురించే కాదు లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో కూడా జీనియస్ అయిన ఈ అబ్బాయి పెద్దగైన తరువాత ఓ పెద్ద శిలాజ అధ్యయన శాస్త్రవేత్త కావాలని కలలుగంటున్నాడు. మరి తన కల నెరవేరాలని లిటిల్స్ తరపున పృిథ్విక్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం...

Tuesday 15 January 2013

ఐస్ పండగ









పండుగ పేరు చెప్తే ఎంత హాయిగా అనిపిస్తుందో.. కానీ చైనాలో జరుపుకునే ఓ పండుగ పేరు చెప్తే చలేస్తుంది.. కాదు కాదు వణికిస్తుంది.. ఆ చిత్రమైన పండుగ కబుర్లేంటో తెలుసుకుందాం పదండి..!
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చైనాలోని హార్బిన్ అద్భుతంగా ముస్తాబయ్యింది. వేలాది మందికి స్వాగతం పలుకుతోంది. అక్కడి వెళ్లిన వారంతా అబ్బో ఎన్ని వింతలో అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారట. పగలు ధవళ వర్ణంలో, రాత్రికి రంగుల్లో కనిపించే ఈ వింతల కోసం ఎన్నో దేశాల నుండి కూడా అతిధులు వస్తున్నారని వినికిడి. ఇంతకీ అక్కడ జరుగుతోంది ఏంటంటే ఐస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అంటే చైనాలోని పిల్లలకు చాలా ఇష్టమట.
ఏముంటాయంటే..
పెద్ద పెద్ద కోటలు, రాజభవనాలు, ప్రముఖ పట్టణాలు ఇవన్నీ నమూనాలే లెండి. పైగా ఇవన్నీ చేసింది దేనితో అనుకుంటున్నారు.. మంచుతో. ఇంకా పెద్ద పెద్ద కళాకృతులు కూడా ప్రతి ఏడాదిలాగానే కొలువుతీరాయి. ఈ సారి మరో ప్రత్యేకత ఇందులోకి వచ్చి చేరింది. అదే ప్రపంచాన్ని ఊపేసిన స్టెప్స్ గ్యాంగనమ్. దీనికి కూడా ఈ సారి ఐస్ ఫెస్టివల్‌లో చోటు దక్కింది. 
పెద్ద వింత..
ప్రపంచంలో జరిగే ఐదు అతి పెద్ద ఐస్ ఫెస్టివల్‌లో ఈ హార్బిన్ ఫెస్టివల్ కూడా ఒకటి. కేవలం శిల్పాలు తయారు చేసి పండుగ చేసుకోవడం కాదు.. ప్రతి సారి గతేడాది కన్నా ఎక్కువ ఎత్తు లేదా పెద్దగా ఇక్కడ శిల్పాలను పోటీ పడి మరీ తయారు చేస్తారు. ఇతర దేశాల్లో నమోదైన మంచు శిల్పాల గిన్నీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు దీన్ని వేదికగా చేసుకుంటారు.
ఐస్ కరిగిపోదా...
ఎందుకు కరిగిపోదు.. కానీ అక్కడ మనకున్నంత ఉష్ణోగ్రత వుండదు. జనవరి మాసంలో వారికి -17 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వుంటుంది. ఈ ఉష్ణోగ్రతకు మంచు కరగడం పక్కన పెట్టండి.. నదులు, సముద్రాలు కూడా గడ్డకట్టుకుని వుంటాయి. చైనా వాళ్లు అక్కడ కూడా ఐస్ స్కేటింగ్, డాగ్ రేసింగ్ వంటి క్రీడలు కొనసాగిస్తారు. కాబట్టి వాతావరణం మారే వరకు ఈ పండుగకు ఏ సమస్యా లేదు. ఉష్ణోగ్రతలు మారే కొద్దీ శిల్పాలు వాటంతట అవే కరిగిపోతాయి. అప్పటి వరకు ఎంచక్కా ఎంజాయ్ చేసేయోచ్చు.

భా... రీ... బాగర్..!






ఎత్తు 311 అడుగులు, 705 అడుగుల వెడల్పు, 45,500 టన్నులు బరువు.. ఇవన్నీ దేనికి సంబంధించనవి అనుకుంటున్నారు... భూమి మీదున్న అతి పెద్ద వాహనం బాగర్-288 గురించి. 
ట్రాన్స్‌ఫార్మర్ సిరీస్ సినిమాలో రోబోట్ ఎన్ని విన్యాసాలు చేస్తుందో కదా..! అవసరం వున్నప్పుడు రోబోట్‌లాగా, తరువాత కార్‌లాగా, రేసింగ్ బైక్‌లా ఇలా ఎన్ని రకాలు కావాలి అంటే అన్ని రకాలుగా మారుతుంది. కానీ అది సినిమాలో కాబట్టి ఒకే. కానీ నిజంగా కూడా అటువంటి వాహనం ఒకటుంది. రోబోట్‌లాగా, డిగ్గర్‌లాగా, వాహనంలాగా ఇలా దాని రూపాన్ని ఎలా అయినా మార్చుకోగలదు. అంతేనా అది ప్రపంచంలోనే అతి పెద్ద వాహనం కూడా. దాని పేరే బాగర్-288.

జర్మనీ దేశం తయారు చేసిన వాహనం ఇది. వాహనం అంటే వాహనం కాదు మల్టీ టాస్కర్. దీని పుట్టిళ్లు జర్మనీ. మైనింగ్ రంగానికి చెందిన క్రుప్ అనే కంపెనీ దీన్ని 1978లో తయారు చేసింది. బాగర్ ప్రత్యేకతలను చూసి మొదట నాసా వాళ్లు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే అప్పటి వరకు స్పేష్ షటిల్స్‌ని తీసుకెళ్లేందుకు వాళ్లు ఉపయోగించిన ఛ్రవ్లెర్-ట్రన్స్పోర్తెర్ ప్రపంచంలో అతి పెద్దదిగా వుండేది. ఇక బాగర్ రాకతో రాకతో అది రెండో స్థానానికి చేరుకుంది. దాని స్థానంలో అంతరీక్ష నౌకలను మోస్తోంది. ఇక ఆ పని లేనప్పుడు ఖాళీగా ఏమీ వుండదు లెండి. ప్రస్తుతం బాగర్ గనుల తవ్వకాలలో బిజీగా వుంది. వంద మంది ఒక రోజంతా చేసే పనిని కేవలం ఒక గంటలోనే చేసి పారేస్తోంది. ఇంతకీ రోజుకు ఇది ఎంత బొగ్గును వెలికి తీస్తుందో తెలుసా 2,40,000 టన్నులు. దీన్ని వెలికి తీసి 24,000 లారీలను నింపుతుంది. ఇక దీని నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు కేవలం ఐదుగురు వుంటే చాలు. బాగర్ రెచ్చిపోతుంది. రోజంతా పని చేస్తూనే వుంటుంది. కొసమెరుపు ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద వాహనంగా గొప్పలు పోయే బాగర్ నిమిషానికి కేవలం రెండు మీటర్లు అంతకన్నా తక్కువ దూరం మాత్రమే నడవగలుగుతుంది.

Friday 11 January 2013

అరాచకాలపై విరుచుకుపడ్డ గళం...!

కాంగోలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలపై విరుచుకుపడ్డ గళం చౌచౌ నమెగాబె. రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలను వెలికి తీసింది.తన మైక్రోఫోనునే ఆయుధంగా మలచుకుని అంతర్జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్లింది.కాంగోలో రోజుకి 36 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వాస్తవాలను తెలియజేసింది. ప్రపంచ ప్రభావశీల మహిళలో స్థానం సంపాదించుకుంది.

girlదక్షిణ కివు రాష్ట్రంలోని బుకావులో చౌచౌ నమెగాబె పుట్టింది. చిన్నతనం నుండే ఎంతో ధైర్యంగా మాట్లాడేది. బెరుకు ఏ మాత్రం కనిపించని మాటలు ఆమెవి.ఏదో సాధించాలనే తపన, కసితో వుండేది. ఇందుకు ఆమె మాట తీరే నిదర్శనం. ఆ లక్షణాలే ఆమెను నేడు ప్రపంచ ప్రభావశీల మహిళల సరసన నిలబెట్టాయి. ఏం చెప్పినా ఆధారాలతో సహా నిరూపించగల ధీరత్వం... కాంగోలో పరిస్థితుల్ని, ప్రజల స్థితి గతుల్ని అం చనా వేయగలిగిన చౌచౌ అట్టడుగు ప్రజల్ని చేరుకునేందుకు వున్న ఏకైక మార్గంగా రేడియోను ఎన్నుకుంది. 1997లో రేడియో మండెలియోలో ప్రజెంటర్‌గా ఆమె తన ెరీర్‌ను ప్రారంభించింది. 

స్థానికంగా ఎంతో పేరున్న రేడియో స్టేషన్‌. 1990లలో ఎంతో ఉద్రిక్తతలకు గురవుతున్న పశ్చిమ కాంగో వైపు చౌచౌ తన దృష్టి సారించింది. మైక్రోఫోన్‌ను ఒక ఆయుధంగా మలచుకుని రహస్యంగా అక్కడి కార్య కలాపాలను డాక్యుమెంటరీగా రూపొందించింది. అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెలికి తీసేందుకు ఎంతో కష్టాలను ఎదుర్కొంది. మానవ హక్కులు అక్కడి వారి పాదాలకింద నలిగి పోవడం చూసి కన్నీళ్లు కార్చింది. తమ జాతి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించింది. మానవహక్కుల వాది గా, జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడి అధికారుల స్థాయి, పాలనా విధానాల్లో చోటు చేసుకున్న అవినీతిని కూడా వెలికి తీసి చూపింది.

woman12003లో చౌచౌ దక్షిణ కివు మహిళా మీడియా అసోసి యేషన్‌ను(ఏఎఫ్‌ఇఎం)ను ప్రారంభించింది. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిం చింది. దీనితోపాటే మహిళా జర్నలిస్టులకు కూడా శిక్షణ అందించింది. ఏఎఫ్‌ఇఎం, రేడియో బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా చౌచౌ ఎంతో వెలుగులోకి వచ్చింది. మహిళా సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సమస్యలపై ఆమె పనిచేసింది. ఆమె కాంగో లోని మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.డిసెంబర్‌ 2007న హా గ్యూ కు ప్రయాణం చేసింది. అంతర్జాతీయ న్యాయ స్థానంలో కివు మహిళా న్యాయంపై పోరాడింది. 2009లో ఆమె ఆక్టర్‌, డైరెక్టర్‌ బెన్‌ అఫ్లెక్‌ రూ పొందించిన డాక్యుమెంటరీ ద్వారా ఆమె గ్లోబ ల్‌ లీడర్‌ షిప్‌ అవార్డు, దాని ద్వారా వచ్చిన లా భాలను పొందింది. వాషింగ్‌టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో ఆమె ఈ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల
surya telugu daily May 1, 2011