ఫ్యాషన్ అంటే అమ్మాయిలు.. తల నుండి కాలి వరకు వుపయోగించే ప్రతీదీ ఫ్యాషనబుల్‌గా వుండాల్సిందే వారికి... ఇక నగరాల్లోని కాలేజీలలో చదివే అమ్మాయిల ఫ్యాషన్స్ చూస్తే మతులు పోవడం ఖాయం..కొత్తగా మార్కెట్‌లోకి ఏది వచ్చినా వారి వార్డ్ రోబ్‌లో చేరాల్సిందే. అలా అని వారు డబ్బంతా ఫ్యాషన్ పేరుతో తగలబెడుతున్నారు అనుకుంటే పొరపాటే. వారు వుపయోగించేవి ఖరీదైనవిలా కనిపించేవే కానీ నిజానికి అంత ఖరీదైనవేం కావు. కాకపోతే వారు చేసే ఎంపికలోనే వుంటుంది అంతా.. నగరంలో పెద్దపెద్ద షాపుల పక్కసందుల్లో, వీధి పక్కన కుప్పపోసి అమ్ముతున్న వస్తువులే అవి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.. హైటెక్ నగరాల్లో తోటి వారితో సమానంగా ఫ్యాషనబుల్‌గా ఉండాలంటే ఇదొక మార్గం వారికి.. పాకెట్ మనీ కాస్త తగ్గినా పర్వాలేదు.. ఫ్యాషన్ మాత్రం ఫాలో అయిపోతాం అంటున్నారు... వారు చెబుతున్న ఆఫ్యాషన్ కబుర్లు...
ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌లు...

స్టైల్ విషయంలో నో రాజీ..
అట్టహాసంగా ఉండే మాల్స్‌ను వదిలేసి ఊరి వీధుల్లో కొనుగోళ్ళు చేస్తున్నారంటే అమ్మాయిలు స్టయిల్ విషయంలో రాజీపడుతున్నా రని భావించడానికి లేదు. అన్నిటినీ ఆలోచించే వారు ప్రతీదీ ఎం పిక చేసుకుంటున్నారు. ‘నాక్కావలసిన బట్టలు ఎన్నుకునేప్పుడు నే ను చాలా జాగ్రత్త తీసుకుంటాను. నాకు కావలసిన ఫ్యాషనబుల్ బ ట్టలు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. ఈ కాలపు ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకునే కొంటాను. పైగా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారుతోంది. వాటితోపాటు మనం మారాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే.. అందుకే ఈ మార్గం.. హెయిర్ పిన్ నుండి చెప్పుల వరకూ అన్నీ ఇక్కడ సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి. బడ్జెట్ కూడా లోటు వుండదు.’ అంటోంది అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన కాల్‌సెంటర్ ఉద్యోగి రాధిక.
అన్నీ అతి తక్కువకే...
‘అత్యాధునిక డిజైన్ల వస్త్రాలు, కాస్మొటిక్స్. టాప్స్ గానీ, టి- షర్ట్స్‌గానీ, జీన్స్ మా దగ్గర అన్నీ వున్నాయి’ అంటున్నారు హ్యాకర్స్. బండ్ల మీద, ఫుట్‌పాత్‌లపైన, లేదా బ్యాగులు చేతిలో వేసుకుని వీధుల్లో తిరిగి అమ్మేవారి దగ్గర నిజంగానే ఎన్నో కొత్త వెరైటీలు దొరుకుతున్నాయి అంటున్నారు అమ్మాయిలు కూడా. ‘నిజానికి, నేటి అత్యుత్తమ ఫ్యాషన్ దుస్తులు చౌకగా దొరుకుతా. కనుకనే మా దగ్గరికి బట్టలుకొనడానికి ఎక్కువగా యువతులు వస్తారు’ అంటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఓ బండిపై అమ్మాయిల వస్త్రాలను విక్రయించే రాజేష్. అతని దగ్గర అన్ని రకాల టాప్స్, పటియాలా..లెగ్గిన్స్ తక్కువ ధరలకు దొరుకు తాయని కూడా చెబుతున్నాడు.
డబ్బు తక్కువగా ఉందా...

‘నాకు నచ్చిన బట్టలు అలంకరణ సామగ్రి కొనడానికి కొద్దిపాటి డ బె్బైనా ఆదా చేయాలి. వాటిని మిగిలిన వాటికి వుపయోగించాలి. పై గా ఎక్కువ ఖర్చు పెట్టి కొన్నా మాటి మాటికీ వేసుకోలేం. అందుకే తక్కువ ఖర్చుతో కొన్నవి అయితే వాటి గురించి పెద్దగా బాధపడా ల్సిన అవసరం కూడా లేదు. కనుక చౌకగా దొరికే నగర వీధుల్లో బట్టలు కొంటున్నా’నంటోంది మరో కాలేజీ విద్యార్థిని నందిత.
ఆలోచనతో అవసరాలు...

ఫ్యాషన్ డిజైనర్లు...

-హైమ సింగతల
Surya teludu daily, March 14, 2011
No comments:
Post a Comment