సుమతీ శతకాలు, చందమామ కథల పుస్తకాలు అటకెక్కేశాయి. కథల పుస్తకాలు స్టోర్ రూములకు చేరాయి. వాటి స్థానాన్ని హారీపాటర్ డీవీడీలు.. కార్టూన్ ఛానల్స్, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఆక్రమించేశాయి. ఏది కావాలన్నా కంప్యూటరు.. నోట్ బుక్కులు.. పాఠశాలలో చెప్పే పాఠాలు చదివేందుకే కుస్తీలు పడుతున్నారు. బుక్స్ కొని వాటిని చదివే తీరిక ఎక్కడిది వారికి.. అంటూ ఇటీవల హైదరబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుస్తక ప్రేమికులు తమ బాధను వెలిబుచ్చారు. ఇది వారి బాధే కాదు.. గ్రంథాలయాలలో మగ్గిపోతున్న గ్రంథాల ఘోష కూడా.

రోజురోజుకు క్షీణించిపోతున్న గ్రంధ పఠనంతో స నాతన సాంప్రదాయ వ్యవహారాలు తెలుసుకునే వీలును నేటి వర్తమాన యువత కోల్పోతోంది. అం తా యాంత్రికమయిన ఈ రోజుల్లో రీడింగ్ ఓ ఎండమావిలా తయారయింది. ‘మంచి పుస్తకాలను చద వాలనే కోరిక మాకూ వుంటుంది కానీ రోజు మా సబ్జెక్ట్ అప్‌డేట్ కావడానికే టైం చాలడం లేదు’ ఇక ఇతర సాహిత్యాలు ఎక్కడ చదివేది’ అంటోంది సిఏ స్టూడెంట్ వందన.
ఇక సాహిత్యమంటే ఒక బోర్ సబ్జెక్ట్‌గా ఫీలవుతు న్నారు. అందునా తెలుగు అంటే మరీ చిన్న చూపు. ఇది మాతృభాషగా చెప్పుకోడానికి పనికొచ్చే విష యం మాత్రమే. అన్ని విషయాలనూ అతి తక్కువ ప రిజ్ఞానంతో తెలుసుకునే అవకాశం వున్నప్పుడు ఇక చాటభారతాలు చదివే అవసరం ఏముంది అని ప్ర శ్నించే వారూ వున్నారు.
‘మా ఎగ్జామ్స్ అన్నీ వన్ మార్క్ బిట్సే... కరెక్ట్ ఆన్స ర్ చేస్తేచాలు కావలసిన మార్కులు వస్తాయి. అం దుకు మార్కెట్‌లో బిట్ బ్యాంక్స్ దొరుకుతున్నాయి. వాటిని చదువుకుంటాం. మొత్తం అంశాలను చద వాలంటే స మయం సరిపోదు’ అంటోంది డిగ్రీ చేస్తున్న రజని.
మీడియా ప్రభావం...

ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమాలు, పా టలు, సీరియళ్ళు.. నానారకాలుగా ప్రేక్షకులను తనవైపు మరల్చుకుంది బుల్లితెర. ఇక ఎలాగు సినిమా ఉండనే ఉంది. వెండితెరకు ఎప్పుడూ ప్రేక్షక నదీ ప్ర వాహం ప్రవహిస్తూనే ఉంటుంది. టీవీ, వెండితెర ఎప్పుడైతే రంగప్రవేశం చేశాయో... పుస్తకాలు మూ లన పడ్డాయి. ‘నేను 95 సంవత్సరం వరకు యండమూరి, మల్లాది, యద్దనపూడి వంటి ప్రముఖ రచయితల పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్య గ్రంధాలను చదివేదాన్ని. ఇప్పుడా సమయం లేదు. కాలక్షే పానికి టీవీ వుంది. ఇంట్లో ఇప్పుడు అమ్మాయి కో సం కంప్యూటర్ కూడా కొన్నాం. ఇక పుస్తకాల అవ సరం కనిపించలేదు’ అని వనజ చెబుతోంది.
కావాల్సిన వాటికే ఓటు..

విజ్ఞానం వైపే గురి...
ఒకవేళ పుస్తకాలు చదివేవారు వున్నారు అంటే ‘ఇది చదివితే ఎటువంటి విజ్ఞానం వస్తుంది’ అనే ప్రామాణికతో ఆలోచించి మరీ కొంటున్నారు. ‘రోజు రోజు కు అప్‌డేట్ కావాలనుకునే వారు... ఇంటర్నెట్‌ను కోరుకుంటున్నారు కా ని పుస్తకాల మీద ఎవ రూ డిపెండ్ అవరు’ అంటూ చెప్పుకొచ్చారు కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ సుమతి. ‘పుస్తకా లు చదవడం మంచిదే కానీ అది స్వతహాగా రావాలి చదువు.. అంటే చదివే కాలమా ఇది?’ అని ఉపాధ్యాయిని మహిమ అంటు న్నారు.

పిల్లలూ... మరిచిపోయారు...!
చందమామ.. బాలమిత్ర... బాలజ్యోతి కొనడమే మరిచా రు. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. పిల్లలు మోయలేని ఇంగ్లీషు డిక్షనరీలు వారి బ్యా గు ల్లో ఉండాల్సిందే! ఇంటికొచ్చారంటే నవ్వించే యానిమేషన్ బొమ్మలు సిద్ధం. డిస్నీలాండ్‌లు... కార్టూన్ నెట్‌వర్క్... పోగో... జెటిక్స్... ఇవే నేస్తాలు. ధోని ఎలా ఆడాడో కావాలి... షారుక్ కరోడ్‌పతి... మాయాబజార్ లాంటి ఆటా పాటలు కా వాలి...నాచోరే, జలక్ దిఖ్‌లా జా, లిటిల్ ఛాంప్స్ వంటి కార్య క్రమాలు చూడాలి. ఇంకా పుస్తకాలు మాకెందుకు అనే నేటి బు డతలు అంటున్నారు.
వీటి పరిస్థితి కాస్త మెరుగు..
>అప్పుడప్పుడూ వచ్చే వ్యక్తిత్వ వికాస గ్రంథాలు మాత్రం ఇప్ప టితరం వారిని ఆకర్షిస్తున్నా యి. పరభాషా జ్ఞానాన్ని ప్రసాదించే 30 రోజుల్లో ... భాషా పుస్తకాలు చదివించే గుణాన్ని జ్ఞప్తికి తెస్తున్నాయి. ‘మా స్టాల్ కొచ్చే వాళ్ల లో ఎక్కువగా పర్సనాలిటి డెవలప్‌మెంట్ బుక్స్ అడుగుతారు. లేవంటే ఎప్పుడొస్తాయి అని అడుగు తారు’ అని గాంధీ బుక్ స్టోర్ యజమాని రవీంధర్ చెబుతున్నాడు. కోఠీలో బుక్ స్టాల్స్ నిర్వహించే వారిలో చాలామంది ఇదే మాట చెబుతున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, హనుమాన్ ఛాలీసా వంటివి మాత్రమే కాస్త అమ్ముడు పోతున్నాయనివారంటున్నారు. అకడమిక్ పుస్తకాల కున్న క్రేజ్ మాత్రం ఎన్నటికీ మారదు అని అంటు న్నారు.
వారోత్సవాలకే పరిమితం...
గ్రంథాల పఠానాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాల కృషి మాత్రం ఎనలేనిది. సెంట్రల్ లైబ్రరీలో కనీసం పది రోజులకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో యువతను ఆకర్షించేందుకు వ్యక్తిత్వ వికాస తరగతులను కూ డా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కొంత మొ త్తాన్ని ప్రవేశ రుసుముగా తీసుకుని పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదే బాటలో నగరంలోని అనేక గ్రంథాలయాలు ముందుకు వెళుతున్నాయి.
-హైమ సింగతల
(surya telugu daily March 6, 2011)
No comments:
Post a Comment