Search This Blog

Thursday 17 July 2014

అందమైన అతివలు... ముచ్చటగొలిపే చోకర్లు...

భారతీయ సంస్కృతిలో ఆభరణాలు సిరిసంపదలకు చిహ్నాలు.. వివాహాలు, పండుగలు, పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో వీటికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. భారీ ఆభరణాలు ధరించకపోతే వధువు అలంకరణ పూర్తి అయినట్లుగా అనిపించదు.. అందుకే వధువు అలంకరణలో చోకర్లకు ప్రత్యేకమయిన స్థానం వుంటుంది.

ఆద్‌ లేదా అరియాలు మెలికలు తిరిగి, విశాలంగా లేదా, మేడల్లాంటి పట్టీలతో చోకర్లు చూపరుల కళ్ళను కట్టిపడేస్తాయి. ఇటీవల జరిగిన ప్రముఖుల పెళ్ళిళ్లను గమనిస్తే వధువుల మెడల్లో ఇవి మురిపించిన సం దర్భాలు గుర్తొస్తాయి. అంతేనా.. వీటి ప్రత్యేకత అంటే ఇంకా చాలా వుం ది... జాలర్లు వేలాడుతూ లేదా, వంపులతో ఒంగుతూ వుండే ఆభరణాలు ఇవి. మెడ కింది భాగంలో సరిపోయినట్లుగా... అందుకే తయారయి నట్లుగా కనిపిస్తాయి. 

  • చోకర్లు పొట్టిగా, మెడకు అదిమి పెట్టుకున్నట్లుగా వుండే నెక్లెస్‌లు సాధారణంగా 14 నుంచి 16 అంగుళాల పొడవుతో వుంటాయి. 
  • పొడవాటి మెడగల ఆడవారికి అన్ని రకాల చోకర్లు అద్భుతంగా కనిపిస్తాయి. మెడ పొడువు తక్కువగా ఉన్నా, కొంచెం బొద్దుగా ఉన్నా కూడా సన్నగా వుండే చోకర్లు బాగా నప్పుతాయి. పెండెంట్‌ గల చోకర్లు వీరికి బాగా నప్పుతాయి. 
  • మెడ ఒంపుకు కూడా అందాన్ని ఇస్తాయి. సన్నీతీగకు మెరిసే రాళ్లూ లేదా పూసలు పొదిగి తయారు చేసే సున్నితమైన చోకర్లు స్టయిలిష్‌గా కనిపిస్తాయి. ఎన్నో రకాల మోడల్స్‌తో ప్రయోగాలు చేసి చేస్తే వీటి ఎంపికలో ఎవ్వరైనా నిపుణులు అయిపోవచ్చు. 
  • ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎలాంటి చోకర్లు నప్పుతాయో తెలుసుకుని వాటినే ధరించాలి. ఎందుకంటే ఎప్పటి ఫ్యాషన్‌ను అప్పుడు తెలుసుకుని పట్టిస్తేనే మగువల సొగసు, అందం
    రెట్టింపు అవుతుందని ఈ కాలం అమ్మాయిలు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం చోకర్లతో మెరిపించండి మరి.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

bangelsఆభరణాలలో ‘ఆర్చివ్‌’ జ్యువెలరీ ఎంతో పేరు పొందింది.పురాతన సంప్రదాయాలను, నాగరికతను ప్రతిబింబించేలా ఉండడమే వీటి ప్రత్యేకత. గతంలో ఇలాంటి ఆభరణాలను రాజులు, మహారాణుల అలంకరణలలో వుపయోగించేవారు. అటువంటి పురాతన కళా ఆభరణాలు నేడు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ప్రవేశించి ఆధునికతను సంతరిం చుకుంటున్నాయి. అమ్మాయిలైతే ఇటువంటి డిజైన్ల ఇయర్‌ రింగ్స్‌, ఉంగరా లను విపరీతంగా ఇష్టపడుతున్నారు. వారి ఆభరణాల లిస్టులో ఇలాంటివి ఒకటైనా ఉండి తీరాల్సిందేనంటున్నారు.ఆర్చివ్‌ ఎవర్‌గ్రీన్‌ అని అంటున్నారు. ఇంతలా అతివల మనసులను దోచిన ఈ జ్యువెలరీ ఈ తరం అబ్బాయిలు కూడా ధరించేందుకు వీలుగా బ్రేస్‌లెట్స్‌, చైన్స్‌, ఫింగర్‌ రింగ్స్‌ తయార వుతున్నాయి.మోడ్రన్‌ రోజులలో పాతకాలం జ్యువెలరీని ధరించడమే ఇప్పటి ప్యాషన్‌.ఎంతైనా ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. 
ArchiveJewelry
-హైమ సింగతల 
Surya Telugu Daily March 10, 2011

Thursday 10 July 2014

యానిమేషన్‌ క్వీన్‌ సంధూజ..! 14 ఏళ్లకే ప్రపంచ రికార్డు..!

బెన్‌టెన్‌, డ్రాగన్‌ల్యాండ్‌, పవర్‌పాప్‌ గర్ల్స్‌, కార్టూన్‌లను చూసి ఆనందిస్తూనే తన తండ్రి సాయంతో యానిమేషన్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టింది సింధుజ. అతి తక్కువ సమయంలో యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందించి మహామహులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెద్ద పెద్ద కంపెలు ఉన్నత స్థానాల్లోకి రమ్మంటూ ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించింది. పద్నాలుగేళ్ల వయసులో ఓ కంపెనీని స్థాపించి ప్రపంచంలోనే అతి చిన్న వయసు సిఇఓగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కింది.జాయ్‌అలుకాస్‌ వంటి ప్రముఖ సంస్థల వ్యాపార ప్రకటనల అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

sinduja1షెప్పాన్‌.కామ్‌ సిఇఓగా యానిమేషన్‌ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన 14 ఏళ్ళ చిన్నారి సింధుజ భారతదేశ కీర్తిని ఇనుమడింపజేసింది. ప్రపంచం లోనే అతి చిన్న వయసులో సిఇఓగా మారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికా ర్డులో స్థానం సంపాదించుకుంది. ఆ కంపెనీకి పేరును కూడా ఆమె నిర్ణయించుకుంది. షెప్పాన్‌ అంటే జపనీస్‌ భాషలో వినోదం అని అర్థం. వినోదాన్ని ప్రదానంగా చేసుకుని యానిమేషన్స్‌ రూపొందించే కంపెనీని ఆమె రూపొందించింది. ఆరుగురు సభ్యులు కలిగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకుని రోజులో ఎనిమిది గంటల పాటు ఆఫీసును నిర్వహిస్తోంది. 

మిగిలిన సమయాన్ని తన చదువు కోసం వినియోగించుకుంటోంది.కలల కంపెనీకి సిఇఓ ప్రైవేటు సెక్టర్‌లో పనిచేసే వారి కల ఓ కంపెనీకి సిఇఓ కావడం. దానికి సంబంధించి సరైన విద్యార్హతలు, అనుభవం వుంటేనే సాధ్యం అవు తుంది. అన్నీ వున్నా ఒక్కో సారి అది చేరువవ్వక బాధ పడేవారు అనేక మంది.కానీ సింధుజ పట్టుదల లక్ష్యం వీటన్నిటినీ అధిగమించింది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండానే అతి తక్కువ సమయంలో యానిమేషన్‌ చిత్రా లను రూపొందించింది. 

చదువుతోపాటే లక్ష్య నిర్దేశం.. 
ప్రస్తుతం సింధుజ సిటీ స్కూల్‌లో తొమ్మిదవ త రగతి చదువుతోంది. కేవలం ఇప్పటికిప్పుడు ఆమె యానిమేటర్‌గా తయారవ్వలేదు. ఐదేళ్ల క్రి తం నుండే ఆమె దీనికి సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది.2డి, 3డి యానిమేషన్‌లో నే షనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (ఎన్‌ఎఎస్‌ ఎస్‌సిఓఎం) గేమింగ్‌లో కోర్సును చేయడం ప్రారంభించింది. అనంతరం గత ఏడాది హైదరాబా దులో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలోనూ పాల్గొంది. 

sindujaఅక్కడే ఆమె మూడు నిమిషాల పాటు సాగే యానిమేషన్‌ చిత్రాన్ని కేవలం పది గంటల సమయంలో రూపొందించి రికార్డు సృష్టిం చింది. ఆమె ప్రతిభ ను చూసి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు సింధుజాను తమ కంపెనీ లో స్థానం కల్పించేందుకు ముందుకొచ్చాయి. కానీ ఇంకా పూర్తిగా నేర్చు కోకుండా ఇలా ఉద్యోగంలో పడొ ద్దనే ఉద్దేశంతో తనకంటూ ఒక కెరియర్‌ ప్లాన్‌ని రూపొందించు కుంది. కెనడా లోని వాన్‌ కోవర్‌ ఫిల్మ్‌ స్కూల్‌లో యానిమే షన్‌ కోర్సును చేసింది.అనంతరం సొం తంగా ఒక కంపెనీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో షెప్పాన్‌.కామ్‌ను ఏర్పాటు చేసింది. 

క్యారికేచర్‌ ఆర్టిస్టు...
దీనితోపాటే ప్రపంచంలో అతి చిన్న క్యారి కేచర్‌ ఆర్టిస్టుగా కూడా ఆమెను కోరల్‌ కార్పొరేషన్‌ ఆమెను కొనియాడింది. పట్టుద లతో తనలాంటి వారికి మున్ముందు ఆద ర్శంగా నిలిచేందుకు అడుగు జాడలను సింధుజ ఏర్పాటు చేసింది అని ప్రముఖ యా మిమేటర్లు అంటున్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆ శాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

అండగా నిలిచిన ఎఫ్‌పిటి...
yanimationటీనేజర్స్‌ ఎనార్మస్‌ పొటెన్షియల్‌ (ఎఫ్‌పిటి) సింధుజ ఆలోచనకు ఆచర ణాత్మక రూపాన్ని అందించింది.షెప్పాన్‌ ఒక పూర్తి స్థాయి యానిమినే షన్‌ కంపెనీగా రూపొందించేందుకు ఎంతో సాయం అందించింది. ‘ఉద్యోగాల కోసం యువత వేచి చూడకుండా వారే ఉద్యోగాలను కల్పించే వారిగా మారడం ఎంతో ఆనందంగా వుంది. అందులోనూ ఇంత చిన్న వయసులో సింధుజ సొంతంగా కంపెనీని రూపొందిచడం ఎంతో ఆనం దంగా వుంది’ అని ఎఫ్‌పిటి అధికారి కుమార్‌ చెబుతున్నారు. 

తండ్రి ప్రోత్సాహం...
సింధుజా తండ్రి రాజారామన్‌ రామనాథాపురం జిల్లా వాసి. ఆయన ఒక కార్టునిస్టు. సింధుజలోని ప్రతిభను చిన్న తనంలోనే గుర్తించి ఆమె కు సరైన ప్రోత్సాహాన్ని అందించారు. తప్పకుండా ఉన్నతస్థానానికి ఎదు గుతుందనే ఆశతో అన్ని విధాలుగా ఆమెకు మద్దతునిచ్చారు. చిన్నతనం లోనే యానిమేషన్‌ కోర్సులో చేర్పించారు. 

కొత్త ప్రాజెక్టులు..
ఇప్పుడు సింధుజా 2డి ఫిల్మ్‌ను టేకప్‌ చేసింది ‘విర్చువల్‌ టి నగర్‌’ చెనై్నలోని వ్యాపార ప్రాంతంపై చేస్తున్న యానిమేషన్‌ ఫిల్మ్‌ అది. దీనితోపాటు జాయ్‌ అలుకాస్‌కు సంబంధించి 40 సెకండ్లపాటు సాగే వ్యాపార ప్రటనను కూడా సింధుజా రూపొందిస్తోంది.మరికొన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కూడా ఆమె ప్రకటనలను రూపొందిస్తోంది.
-హైమ సింగతల, సూర్య దినపత్రిక

Friday 4 July 2014

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

మంచు దొంతరలు విడిపోక మునుపే.. ముద్దులొలికే లోగిళ్లలో ముచ్చటైన గొబ్బెమ్మలు ఒదిగేందుకు సిద్ధం.. కన్నె పిల్లలంతా కలిసి తమ కోర్కెలను తీర్చమంటూ చిట్టాను పాటకట్టే సమయం.. తమ కుటుంబాన్ని చల్లగా చూడమంటూ ఇంతులంతా వేడుకునే తరుణం… మురికి వాడలు సైతం అందంగా ముస్తాబయి ఆహ్వానం పలుకుతున్న శుభోదయాలు.. ఈ మాసం మొత్తం అందంగా..ఆనందంగా..శుభాలు ఇవ్వాలని కోరుతూ..
ragoli-muggu
గోవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం మనది. అందుకే ఆవు పేడను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. కేవలం పవిత్రం మాత్రమే కాదు.. ప్రకృతికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఇందులో వున్నాయి. అందుకే ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ముగ్గుల మధ్యలో పెట్టి పూజిస్తారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించే యువతులు సందె గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియాలతో పాటలను పాడి ఆడుతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, త్వరగా పెళ్ళి అవుతుందని వారి నమ్మకం. ఈ ఆట వివాహ వ్యవస్థపై మన యువతులకున్న నమ్మకాన్ని రుజువు చేస్తుందంటారు.
గొబ్బెమ్మలు..
పెద్ద వయసు స్ర్తీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బి ళ్ళను ముగ్గుల మధ్యలో పెడతారు. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ముతె్తైదువులకు సంకేతం.గోపీ+బొమ్మలు=గొబ్బెమ్మలు అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మ డి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా వుంటుంది.
గొబ్బిళ్ళ పాటలు..

sankranti
గొబ్బి పాటలకు జానపద వాజ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు అని ముందుగానే చెప్పుకున్నాం.. ‘కొలని దోసరికి గొబ్బిళ్ళో యదు కుల సామికి గొబ్బిళ్ళో’ అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. ఈ ధనుర్మాసం రోజుల్లో ఊరూరా ఆడవారు తెల్ల వారకముంద లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పేడతో చేసిన ముద్దలను గొబ్బె మ్మ లుగా భావించి ఆ ము గ్గుల మధ్య భాగంలో పెట్టి వాటికి అలంకా రంగా పువ్వులు పెడతా రు. సాయంత్రమ య్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉం చుతారు.
కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు. పాడటం పూర్తయ్యాక మధ్యలో ఉన్న అమ్మాయి గొబ్బెమ్మను పట్టుకుంటే మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చేరి ఒకరి భుజాల మీద ఇంకొకరు చేతులు వేసుకుని గొంతులు కలిపి పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబ్బుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
whoman
గొబ్బెమ్మలకు తెలంగాణా ప్రాంతంలోని బతుకమ్మలకు పోలికలున్నా, కొన్ని విషయాల్లో స్వల్ప బేధాలున్నాయి. బతు కమ్మపాటలు ఒక నిర్ణీత ప్రదేశంలో పాడితే గొబ్బి పాటలు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందూ పాడుతారు. గొబ్బి పాటలు నిటారుగా నిలబడి తిరుగుతూ పాడతారు. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు నడుం దగ్గర వంగి తిరుగుతారు. బతుకమ్మపాటు పాడేవారి కదలికల్లో అందం ఉంటే గొబ్బిపాటలు పాడేవారిలో హుందాతనం ఉంటుంది. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు చప్పట్లు వేగంగా తడితే గొబ్బి పాటలు పాడేవాళ్ళు నిదానంగా తడతారు.
దేవుని నైవేద్యం కోసం..
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
                                                                                          - హైమ సింగతల
                                                                                           Surya Telugu Daily 

Tuesday 1 July 2014

ప్రయాణంతో ప్రేమలో...

మనసుకు ఆహ్లాదంగా వుండేందుకు ప్రయాణాలు, విహార యాత్రలు ఎంతో ఉపయోగపడతాయి. రీఛార్జ్‌ అయ్యేందుకు సాయపడతాయి. కానీ నేడు ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ సాహసాలను ఆస్వాదిస్తున్నారు మహిళలు. తమ అనుభవాలను అందరితోనూ పంచుకోవాలని ఆశపడుతున్నారు. భవిష్యత్తును ఈ ప్రయాణాల్లో వెతుక్కుంటూ ముందుకు సాగడంలోని ఆనందం చెప్పలేనిది అని వారి అభిప్రాయం. ఒంటరిగా ప్రయాణాలు.. సాహసాలు.. అందులోని ఆనందాలు..అన్నీ ఇన్నీ కావు. వారి అనుభవాలను తెలుసుకుంటేనే అందులోని అనుభూతులు తెలుస్తాయి. ఆ ప్రయాణ ప్రేమికురాళ్ళ సాహసాలు...


ప్రయాణమే భవిష్యత్తు...
beechదివ్యా రాణా కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్‌ పరిశ్రమలో కృషిచేస్తూ తన భవిష్య త్తుకు మెరుగులు దిద్దుకుంటోంది. అచ్చం అమెరికన్‌ టెలివిజన్‌ ఏంకర్‌ సమంతా బ్రౌ న్‌లా ప్రయాణం, ఆహారం, సాహసకృత్యాల్లో పేరుగడించాలన్నదే ఆమె జీవిత ధ్యేయం. పగలంతా అన్వేషణలో గడుపుతూ రాత్రి వేడివేడిగా భోజనం ఆరగించి చేతిలో టివి రిమోట్‌, ఓ పుస్తకంతో బిచాణా వేయడం లేదా యాత్రా జీవిత అనుభవాలను రాయాల న్నది ఆమె అభిలాష. 

ఉత్తరాఖండ్‌లో రాజాజీ నేషనల్‌ పార్కులోని వైల్డ్‌ బ్రూక్‌ రిసార్ట్‌లో ఆమె చేసిన పర్యటన గురించి వివరించింది దివ్యా. ''అక్కడ రోడ్డు లేదు. ఫోన్‌ నెట్‌వర్క్‌ కూడా లేకపోవడంతో నది ఒడ్డునానుకునే డ్రైవ్‌ చేస్తూ వెళ్ళాం. మొత్తం రిసార్ట్‌ అంతా కాలినడకన తిరగాలనిపించింది'' అని చెప్పింది. ఇప్పటికే ఆమె ిహిమాలయాలు మొద లుకుని అండమాన్‌ దీవులవరకూ తిరిగివచ్చింది. దివ్య గనుక ప్రయాణం చేయాలనిపి స్తే చాలు ఎవరికోసం ఆగదు. సంచీ భుజానేసుకుని బయల్దేరడమే తరువాయి. ''ప్రయా ణం ఆహ్లాదకరంగా ఉండాలంటే వెంట కొందరుండాలన్నది భ్రాంతి. వెళ్ళే చోట ఏం ఆశిస్తున్నామో ముందుగానే నిర్ణయించుకుని అన్వేషణ ప్రారంభిస్తే అనుకున్నది సాధిం చామన్న తృిప్తి కలుగుతుంది. సాటి మహిళల్లో ఈ గుణమంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది'' అంది. 

ఇంకా ఏం చెబుతుందంటే...
''మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు. మనగురించి మనం ఎక్కు వగా భావించనూ కూడదు. ఎలక్ట్రిక్‌ పరికరాలు వెంటతీసుకెళ్ళొద్దు. పాత బట్టలు చెప్పులు మాత్రమే ఉంటే చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. వెళ్ళిన చోట స్థానిక ప్రజలతో కలిసిపోవాలి. మనం దిగిన హోటల్‌ వివరాలు, టాక్సీ నంబర్లు, ముందు ప్రయాణం వివరాలు ఇంట్లో వాళ్ళకు తెలియజేయాలి. 

రితికా మిట్టల్‌ సాహసాలు...
indian-woman-wearing''నాకు భయం అంటూ లేనేలేదు. పర్వతాల్లో ప్రాణాలు వదలాలని వుంది అని నేను గర్వంగా చెబుతున్నాను'' అంటోంది రితికా మిట్టల్‌. బట్టల డిజైనర్‌ రితికా మిట్టల్‌ అందమైన దుస్తుల షాప్‌ ''మొర్‌''నడుపుతోంది. ఇటీవలే కాలా ఘోడా ఆర్ట్స్‌ ఫెిస్టివల్‌లో తన బట్టల ప్రదర్శన నిర్వహించింది.తన కొత్త దుస్తుల తయారీ డిజైన్‌ కోసం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని ఆమె ఉవ్విళ్ళూరుతోంది.''మూడునెలల వ్యవధిలో నాలుగు భాషలు మాట్లాడే నాలుగు రాష్ట్రాల్లో 22 ప్రాంతాలను సందర్శించాలి. ఈశాన్య ప్రాం తం ప్రకృతి సౌందర్యం, సంస్కృతి, వైవిధ్యం అక్కడి ప్రజలు ఆమెను పలవరింపచేస్తు న్నాయి. ఒక బృందంలో ఉంటూ మరో బృందంతో మైత్రి చేయడం వీలవ్వదు. 

ప్రతి బృందంతో ప్రతి జాతితో మమేకమవ్వాలి. నాగా, మిజో, బొడొ, కచరి, దిమిస జాతు ల, తెగల వారిని అర్థంచేసుకుని వారి వస్తధ్రారణ రీతులు సంస్కృతి ఆచార వ్యవహారా లు ఆకళింపు చేసుకోవాలంటే ప్రతి ఒక్క జాతి జనులలో ఒకరై జీవించాలి. వారి ఇళ్ళ లో ఉన్నాను, వారు తినే ఆహారం తిన్నాను.వారు నాకెంతో ప్రేమతో ఇచ్చిన వారి దుస్తు లు వేసుకున్నాను, వారిలో లీనమైపోయేదానిని వారిలో ఒక సభ్యురాలినైపోయానం'' టోంది రితిక.

రితికా ఆణిముత్యాల్లాంటి తన అనుభవాలను కూడా వివరిస్తోంది. ''ఒక కత్తి, ఒక టార్చిలైటు, పెప్పర్‌ స్ప్రే, వగైరా వెంట తీసుకువెళ్లండి. మీ స్వభావాన్ని బట్టే ముందుకు సాగండి. బాగా రాత్రి అయ్యాక ప్రయాణం చేయవద్దు. స్థానిక మహిళలతో స్నేహం కల్పించుకోండి. విశ్రాంతి తీసుకునేప్పుడు ఒక గుంపుతో కలిసి వుండడం క్షేమదాయకం. వెంటవున్న డబ్బును ఎక్కడైనా దాచివుంచండి'' అని సలహాలిస్తోంది. 

సోనాల్‌ సింగ్‌ విశ్రాంతి ప్రయాణం...
''తల్లిగా, భార్యగా, గృహిణిగా పాటుపడడంలో జీవితం చితికిపోకుండా అప్పుడప్పుడూ జీవన మాధుర్యాన్ని చవిచూడాలనుంది. సాహస కృత్యాలు చేయాలనుంది'' అంటోంది సోనల్‌ సింగ్‌. ఎంతో ఉత్సాహంతో ఉరకలేసే సోనల్‌ సింగ్‌కు నాలుగేళ్ళ పాప వుంది. వుండేందుకు ఒక్కపాపే అయినా గంపె డు సంతానంతో సమానం అంటోందామె. మంచి చదువరి, ఆహారం పై మక్కు వ షాపింగ్‌ పిచ్చి. నిత్యం పనులు, బాధ్యతలు చాలా కాలం విశ్రాంతి అన్న పదానికి పూర్తిగా దూరమైంది. తనలోని తల్లి ఆమెను బానిసగా మార్చేసింది. ఇలా వుంటే తనూ ఓ యంత్రంలా మారిపోతానేమో అన్న ఆలోచేనే ఆమెను కొంచెం మార్చింది. ఇంట్లో అందరినీ ఒప్పించి ఒంటరిగా పర్వతాల వైపు పయనమైంది. సిమ్లా, మస్సూరీ, డె్రహాడూన్‌లలో సంచరించి వచ్చింది. 

''ఒంట రిగా ప్రయాణం చేస్తే ఇబ్బందులే వుండవు. దారిలో స్నేహితులేర్పడతారు. సావకాశంగా కాలం గడపవచ్చు. అందమైన గిరిశిఖరాల్ని, లోయల్ని, పువ్వుల్ని చూస్తూ ఇంటి జీవితం మరిచిపోయేంతగా తన్మయత్వం చెందుతాను. చివరికి నా పాప ఏం చేస్తున్నాడో అన్న చింత సైతం ఈ ప్రయాణాల్లో నా నుండి సెలవు తీసుకుంటుంది'' అంది. ఇంకా ''ఎల్లప్పుడూ మంచి బట్టలువేసుకోండి వెళ్ళిన ప్రదేశంలోని ప్రజల సాంస్కృతిక సూక్ష్మానుభూతుల్ని గుర్తించండి. వాతావర ణం, ప్రజలు, ఆచారా వ్యవహారాలు, అత్యవసర ఫోన్‌ నంబర్ల గురించి సమా చారం సేకరించండి. స్థానిక భాషలోని ముఖ్యమైన పదాలను పట్టుకోండి. మం దులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ వెంటతీసుకెళ్ళండి ఒక వేళ దగ్గరలోనే ఉన్నట్లయితే స్నేహితుడికో పరిచయస్తుడికో ఓ కార్డు ముక్క రాసిపారేయండి'' అని చెబుతోంది. 

శిఖా త్రిపాటి ప్రయాణాలు...
26ఏళ్ల ఈ యువతికి ప్రయాణాలంటే ప్రాణం. చిన్నతనం నుండి సెలవుల్లో తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేయడం వల్లే తనకు ప్రయాణాల మీద ఇష్టం కలిగింది. అప్పటి నుండి ప్రయాణాలు చేయడం నేర్చుకుంది.ఒం టరిగా ఎన్నో దేశాలు చుట్టి వచ్చింది. ఇంకా ఈజిప్ట్‌ వంటివి ఎన్నో తాను చూ డాలనుకుంటున్న ప్రాంతాల జాబితాలో మిగిలేవున్నాయి. ''జీవితం ఓ ప్రయాణం లాంటిది. అందులో ఒకచోటే ఆగిపోవడం అంటే ఎలా చెప్పండి. కాస్త మార్పు కావాలి. ప్రయాణం చేయాలి. సాహసాలు చేయాలి. అప్పుడే జీవితంలో వుండే ఆనందం తెలుస్తుంది'' అంటోంది.
-హైమ సింగతల 
surya telugu daily