Search This Blog

Wednesday 27 October 2010

చిన్నారుల దీపావళి కానుక ''చిరాగ్‌''

దీపావళి అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం. ఎక్కడ చూసినా దీపాలు.. చుట్టూ వెలు గులు... బాణా సంచా, కొత్త బట్టలు, మిఠాయిలు.. సంతోషం... సందడి.. మన కు తెలిసిన దీపావళి ఇది. ఓ సేవా సంస్థకు మాత్రం ఈ రోజు చాలా ప్రత్యేకం.. దీపాలతో వెలుగును తేవడం కాదు.. ప్రత్యేకంగా ఈ రోజున పేద చిన్నారుల జీవితాల్లో దివ్వెను వెలిగిస్తోంది. వారి పెదవులపై చిరునవ్వులను పూయిస్తోంది.భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు విద్యను కానుకగా అందిస్తోంది.


diwaliచెనై్నకి చెందిన ఎన్‌జిఓ సంస్థ చిరాగ్‌. చెడు నిర్మూలనకు, మంచి పనుల ప్రారంభానికి మంచి రోజైన దీపావళిని నిజమైన దీపావళిగా జరుపుతోంది. ప్రతి సంవత్సరం దీపావళి కాను కలుగా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆ సంస్థ స్థాపకురాలు శ్రీమతి. ఏటా కొందరు పేద చిన్నారులను దత్తత తీసుకుని వారికి విద్యనందిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులనూ ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దీపా వళి కానుకగా వీలైనంత ఎక్కువ మంది చిన్నారులకు విద్యనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ఏర్పాటు వెనుక గల విషయాలను శ్రీమతిని అడిగితే...

�నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం సంస్థ తరపున క్రిస్టమస్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంస్థ తరపున కొంతమంది పేద చిన్నారులు కోరిన బహుమతులను అందజేస్తా రు.ఇందుకు ఉద్యోగి వంద డార్ల వరకు వెచ్చించొచ్చు. అలా ఆ కార్యక్రమంలో నేను ఓ అమ్మా యిని బయటికి తీసుకెళ్లి తనకు కావలసిన వస్తువులు తీసుకోమని చెప్పాను. ఆ షాపు అంతా తిరిగి ఆ అమ్మాయి తనకు కావలసిన బట్టలు, బొమ్మలు తీసుకుంది. అలా ఆ అమ్మాయి తీసు కుంటుంటే ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేను. తరువాత ఒక జత షూష్‌ తీసుకుంది. కానీ అప్పటికే బడ్జెట్‌ వంద డాలర్లు దాటిపోయింది. దీంతో అది చూసి ఆ అమ్మాయి వాటిని అక్కడే పెట్టేసింది. అది చూసిన నాకు ఎంతో బాధగా అనిపించింది. వెంటనే వాటిని తీసుకోమని చెప్పాను. 

తను చాలా ఆశ్యర్యంగా నా వైపు చూసింది. నేను నిజంగానే చెప్తు న్నాను... తీసుకో అని చెప్పాను.మీరు నిజంగా చెప్తున్నారా...? అని ఆశ్చర్యకరంగా అడిగింది. తీసుకో అన్న వెంటనే వాటిని తీసుకుని హత్తుకుంది. తరువాత ఇందుకు ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పిందో గుర్తే లేదు. కొన్ని రోజుల తరువాత నాకు ఆ చిన్నారి తల్లి నుండి ఓ లేఖ వచ్చింది. అం దులో ఆ తల్లి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలిపింది. తన కూతురి జీవితంలో ఈ క్రిస్టమస్‌ ను మర్చిపోలేని విధంగా చేసినందుకు ఆనందపడింది. అప్పుడే నిర్ణయించుకున్నాను భారత దేశానికి వచ్చిన తరువాత తప్పకుండా పేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలని. అందుకు నాకు చాలా కాలమే పట్టింది� అని శ్రీమతి చెప్పింది. 

ఏర్పాటులో స్నేహితుల తోడ్పాటు...
2005లో తను తీసుకున్న నిర్ణయాన్ని తన స్నేహితులు పుష్ప, జయశ్రీ, స్వర్ణల ముందు వుంచింది శ్రీమతి. ఇందుకు వారు ఎంతో సంతోషించారు. అందులో తమవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ కలిసి ఎంతో ఆలోచించి ఒక నిర్ణ యం తీసుకున్నారు. దీపావళి నాడు �చిరాగ్‌�కు జన్మనిచ్చారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీపావళి కానుకగా స్థానిక పాఠ శాలలకు వాలెంటీర్లను పంపి అక్కడి పేద చిన్నారులకు ఒక విష్‌ కార్డును ఇస్తారు. దానిపై వారి కోరికను రాయమని చెప్తారు.అనం తరం ఆ కార్డులను తీసుకుని వాటిని పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యో గాలు చేసే వారికి అందజేసి విషయాన్ని తెలియజేస్తారు. ఒకవేళ వారు ఆ కార్డులో వున్న దాన్ని అందించేందుకు ముందుకు వస్తే వారి నుండి వాటిని సేకరించి తిరిగి ఆ పాఠశాలల్లోని చిన్నారుల కు దీపావళి రోజున కానుకగా అందిస్తారు. 

విద్యనందించే ఉద్దేశంతో...
సంస్థ కేవలం చిన్నారులకు బహుమతులను ఇవ్వడం ద్వారానే వారి జీవితాల్లో వెలుగు నింపలేమన్న ఉద్దేశంతో వారికి చదువు చెప్పించాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది. 2008లో తొలి సారిగా పది మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి చదువు కావాల్సిన మొత్తాన్ని అందించింది. అదే సంవత్సరం గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. అందులో పైతరగతులకు ఉపాధ్యాయులను కూడా నియమించిం ది. ఈ సంస్థ తన సేవలను మరింతగా పెంచేందుకు కోగ్నిజెంట్‌ ట ెక్నాలజీస్‌, దాని అనుబంధ సేవా సంస్థల ద్వారా కూడా సేవలం దిస్తున్నారు.

పాఠశాలల దత్తత...
ఈ సంస్థ ఇటీవల వెల్లూరుకు దగ్గరలోని ఓ గ్రామ పాఠశాలను కూడా దత్తత తీసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుల నియా మకం, వసతులు వంటివి ఏర్పాటు చేసింది. అలాగే తొమ్మిదవ తరగతి చదువుతున్న 20 మంది చిన్నారులకి ఈ సంస్థ ద్వారా కోచింగ్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఇది వారి ఉన్నత విద్యా భ్యాసం కోసం ఉపయోగపడేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. 

ఈ ఏడాది...
ఈ ఏడాది కూడా ఆ పనిలోనే వున్నారు చిరాగ్‌ నిర్వాహకులంతా. ఇప్పటికే వాలెంటీర్ల ద్వారా గ్రామీణ, పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో కార్డుల ద్వారా వారి కోరికలను సేకరించారు. వాటిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందించేవారికి అందజేస్తున్నారు. వారిచ్చే వాటిని త్వరలోనే రాబోతున్న దీపావళికి వీటన్నిటినీ చిన్నా రులకు కానుకలుగా అందిజేయనున్నారు. 

మీరు కూడా చేయొచ్చు...
సంస్థ ఇప్పుడు కొద్ది మంది సాయంతోనే తన కార్యక్రమాలు నిర్వ హిస్తోంది. భవిష్యత్తులో వాటిని మరింతగా విస్తరించాలని చూ స్తోంది. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి విద్యార్థులకు స్పా న్సరర్‌గా వుండాలని కోరుతోంది. ఒకవేళ వాలెంటీర్‌గా సంస్థ తరపున పనిచేయడానికైనా సరే ముందుకు వెళ్ళొచ్చు. స్పాన్సర ర్‌గా అయితే ప్రతి సంవత్సరం ఓ పేద విద్యార్థికి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు మొత్తం రూ.5000 రూపాయలు అందజేయాల్సి వుంటుంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాల నుకునే వారు... లేదా సాయం చేయాలనుకునే వారు ఠీఠీఠీ.ఛిజిజీట్చజీఛీజ్చీ.ౌటలో వివరాలన్నీ చూడొచ్చని శ్రీమతి, ఆమె స్నేహితురాళ్ళు చెబుతున్నారు.
-హైమ సింగతల
Surya telugu daily

Monday 25 October 2010

''నన్ను రూ.300కి అమ్మేశారు''

వయసు 22.. చదువుకున్నది తొమ్మిదవ తరగతి... కానీ ఆమె చేసే పనులు చాలా గొప్పవి. సమస్యల వలయంలో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న ఎందరో అమ్మారుులను ఆదుకునేందుకు తన వంతుగా ఆమె కృషి చేస్తోంది. ఇందుకు భర్త కూడా ఆమెకు తోడుగా వుంటాడు.ఇది ఇలా సంగ్మా ప్రస్తుతం.. దీనికి ముందు ఆమె ఓ నరకాన్ని దాటి వచ్చింది. ఇప్పుడు ఎలాంటి వారిెకైతే సాయం చేస్తోందో.. అలా సాయం చేసే వారి కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆశను వదులుకోకుండా కష్టపడింది. నేడు పదిమందికి సాయం చేస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న స్థారుు నుండి ఆత్మస్థైర్యాన్ని నింపుకుంది. ఎదురైన సమస్యలు... పర్యవసానాలు అన్నిటినీ భరించింది.తన ప్రమేయం లేకుండా ఆమె జీవితంలో ఏర్పడిన సంఘటనలను ఆమె ఇలా చెబుతోంది.

sarikaఅస్సాం సరిహద్దులో, అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలోగల బా లుంగ్‌పంగ్‌ గారో గ్రామం మాది. నాన్న కార్పెంటరీ పని చేస్తాడు. మేము మొత్తం ఆరుగురు ఆడపిల్లలం. అందరం బడికివెళ్ళేవాళ్ళం. అనారో గ్యంతో నాన్న చనిపోవడం వల్ల నేను చదువుమానేయాల్సి వచ్చింది. ఎలాగైనా సరే పనిచేసి అమ్మనీ, చెల్లెళ్లన్నీ పోషించాలనుకున్నాను. కార్పెంటరీ పనిచేయడం మొదలు పెట్టాను. కానీ దాని ద్వారా వచ్చిన మొత్తం మా కుటుంబానికి సరిపోయేది కాదు. అప్పటికి నా వయసు పద కొండేళ్ళు. ఢిల్లీ నుండి ప్రవీణ్‌ పండిట్‌ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇం ట్లో పనిచేయడానికి అమ్మాయి కావాలని అడిగాడు. అతడి భాష అమ్మ కు అర్థం కాకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. తరువాత తన భార్య ఉద్యోగం చేస్తుందని, ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి మనిషి కావా లని ఎలాగోలా అమ్మకు చెప్పాడు. నెలకు రూ.1500 ఇస్తానని ఆహారం, బట్టలు ఇస్తానని చెప్పాడు. చివరకు రూ.300 ఇచ్చి నన్ను తనతో తీసుకెళ్ళేందుకు అమ్మను ఒప్పించాడు. 

రోజూ కొత్త బట్టలు... 
నా కన్నా ముందే మానుఖి అనే మరో అమ్మాయిని కూడా ప్రవీణ్‌ ఇలాగే చెప్పి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి నాకంటే ముందు రైల్వే స్టేషను లో వుంది. ఆ అమ్మాయికి అస్పామీ తప్ప మరో భాష రాదు.వాళ్ళ పిన్ని నుండి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ప్రవీణ్‌తో వచ్చిందని తెలిసిం ది. మేము రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన వెంటనే ఎవరన్నా మమ్మల్ని ఎవరు అని అడిగితే ప్రవీణ్‌ణి మా అన్నయ్య అని చెప్పమన్నాడు. మేమూ అలా గే చెప్పాం. తరువాత మమ్మల్ని గోకుల్‌పురిలోని వాళ్ళ ఇంటికి తీసుకె ళ్ళాడు. అక్కడ అతని భార్య, కొడుకు మాత్రమే వున్నారు. తొందరలోనే మాకు వేరే ఉద్యోగం దొరుకుతుందని చెప్పాడు. మూడు నెలల పాటు అక్కడే వుంచాడు. మాకు ప్రతి రోజు కొత్త బట్టలు ఇచ్చేవాడు. నాకు చా లా ఆశ్చర్యకరంగా వుండేది. కానీ రోజూ కొత్త బట్టలు ఇస్తుండటం వల్ల నాకు చాలా సంతోషంగా వుండేది. కొన్ని రోజుల తరువాత ఆ ఇంటికి మగవారు వచ్చేవారు. 

అక్కడే చాలా సేపు గడిపేవారు. అలా చేయడం వల్ల నాకు చాలా భయంగా వుండేది. కానీ నేను ఏమీ చేయలేక పోయాను.ఒక రోజు ప్రవీణ్‌ అకస్మాత్తుగా మమ్మల్ని మా లగేజ్‌ సర్దుకోమన్నారు. మా ఉద్యోగాలు ఫైనల్‌ అయ్యాయని అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. మమ్మల్ని పంపిస్తున్న ఇళ్ళ గురించి చాలా చెప్పాడు.కానీ అక్కడికి తీసు కెళ్ళలేదు. ఒక హోటల్‌కి తీసుకెళ్ళాడు. అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.కొంత సేపటికి అక్కడికి కొంత మంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళతో రమ్మని చెప్పారు. కానీ ప్రవీణ్‌ వచ్చే వరకు మేము వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోమని చెప్పాం. 

ఇంతలో హోటల్‌ మేనేజర్‌ మాకు సాయం చేయ డంతో అక్కడి నుండి తప్పించుకుని నేను మానుఖి రైల్వే స్టేషనుకు వె ళ్ళాం. అక్కడ మమ్మల్ని పోలీసులు పట్టుకుని విచారించారు. మా గురిం చి నిజం చెప్పినా వినిపించుకోలేదు. అక్కడికి ఇద్దరు మహిళలు అక్కడికి వచ్చి మా అమ్మ అని చెప్పారు. తరువాత వారి పేర్లు మీరా, శ్యాంసంగ్‌ అని తెలిసింది... ఆమె చెప్పిన మాటలకు నేను గట్టిగా అరిచాను. ఆమెకు నేను కూతురిలా వున్నానా..? అంటూ గొడవ చేశాను. కానీ అక్కడ ఎవరూ మా మాటలు పట్టించుకోలేదు. వాళ్ళ వెంట మమ్మల్ని పంపించేశారు. 

నా కొత్త పేరు సారిక... 
మమ్మల్నిద్దరినీ ఒక స్థలానికి తీసుకెళ ా్ళ రు. ఢిల్లీ జిబి రోడ్డులోని ప్రాంతం అది. ఆ మరుసటి రోజు కొంత మంది పోలీసులు మా స్టేట్‌మెంట్‌ తీసుకోవడానికి వచ్చారు. నేను నిజం చెప్పినా వినలేదు. వారే తిరిగి నాకో కొత్త కథ చెప్పారు. నేను నేపాల్‌ నుండి వచ్చానని, మా అమ్మ అక్కడి వ్యభి చార గృహాల్లో పనిచేస్తుందని చెప్పారు. ఇలా చెప్పాలని అక్కడి మహిళలు మాను ఖిని కొట్టారు. కొన్ని రోజుల తరువాత మానుఖిని వాళ్ళు అమ్మేశారు. తరువాత ఎప్పుడూ మానుఖిని నేను చూడలేదు. ఇక తరువాత మిగిలింది నేనే. నా పొడవాటి జుట్టును కత్తిరించుకోమని బలవంతం చేశారు. కానీ నేను అందుకు ఒప్పుకోకపోవడంతో తిరిగి నన్ను కొట్టేవారు. దాదాపు అక్కడ 25 మంది అమ్మాయిలు వుండేవారు. మేడమ్‌, ఆమె అసిస్టెంట్‌ అంద రినీ జాగ్రత్తగా గమనిస్తుండేది. 

ఎవరినైనా కొట్టాలంటే మిగిలిన అమ్మా యిలను పట్టుకోమనేవారు. వారు కొట్టేవారు. నాకు సారిక అనే పేరు పెట్టారు. చిన్న చిన్న బట్టలు ఇచ్చి వేసుకోమని బలవంతం పెట్టారు. మగ వారి దగ్గరికి పంపేవారు.ఎంత అరిచినా వినిపించుకోకుండా పశువు ల్లాగా ప్రవర్తించేవారు. చివరికి విసిగిపోయి ఓ శవంలా వారు చెప్పింద ల్లా చేయడం మొదలు పెట్టాను. అనంతరం అతి కొద్ది కాలంలోనే మరో వ్యభిచార గృహానికి మీరా నన్ను అమ్మేసింది. అక్కడి నిర్వాహకుడు బాతి క్‌ రామ్‌ పాండే. అతను జైలులో వుండటంతో ఆ గృహాన్ని అతని భార్య బబిత నిర్వహించేది. 

బబిత నన్ను విదేశీయులకు అమ్మాలని ప్రయత్నిం చింది. వారు ఎవరో నాకు తెలియదు. కానీ తలపై వస్త్రాన్ని చుట్టుకుని వున్నారు. వాళ్ళతో వెళ్ళమని బబిత నాకు చెప్పింది. అందుకు అంగీకరిం చకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అయినా నేను వెళ్ళలేదు. కొన్ని రోజులకు బాతిక్‌ రామ్‌ జైలు నుండి బయటికి వచ్చాడు. నన్ను చీర కట్టు కుని బార్‌ షాపులో కూర్చుని అమ్మకాలు కొనసాగించమని చెప్పారు. 

పోలీసును చంపేందుకు ప్రయత్నించి... 
sarika1సంవత్సరం పాటు ఇలాగే కొనసాగింది. ఒక రోజు ఒక మధ్య వయ స్కుడు, మరో వ్యక్తి కలిసి షాపుకు వచ్చారు. ఎందుకో ఆ వ్యక్తుల్ని నమ్మా లని పించింది.వారికి నా కథ మొత్తం చెప్పాను. నాలాంటి ఎంతో మంది అమ్మా యిలు ఇక్కడ వున్నారని కూడా చెప్పాను. దీంతో వారు హర్యానా పోలీసులకు సమా చారం అందించారు. అతి కొద్ది సమయం లోనే అక్కడ పోలీసులు దాడి చేశారు. ఇలా చాలా చోట్ల చేశారు. అక్కడ పట్టుకున్న అమ్మాయిలందరినీ హరినగర్‌ పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చారు. వారిలో నేనూ వున్నాను. అక్కడికి రోమా దేబాబ్రత అనే మహిళ వచ్చింది. ఆమె ఓ ఎన్‌జిఓ సంస్థకు ప్రెసిడెంట్‌గా చేస్తున్న ట్లు చెప్పారు. ఇక్కడ మేమందరం సురక్షితంగా వుంటాం అని చెప్పింది. 

కానీ నాకు నమ్మకం కలగలేదు. ముఖ్యంగా పోలీసుల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అలా నమ్మకం పోవడానికి ఎన్నో గతంలో వారు చేసిన పనులే కారణం. కానీ ఆమె మాటలు విని కొంత వరకు మామూలుగా వుండేందుకు ప్రయత్నించాను. కానీ ఏ మాత్రం మార్పు లేదు. తిరిగి నేను మరోసారి అమానుషానికి గురయ్యాను. ఒక్కొక్కరిగా మమ్మల్ని విచారణ చేసేందుకు పోలీసులు వచ్చారు.ఇంటరాగేషన్‌ చేసేప్పుడు కూడా చాలా అసహ్యంగా ప్రవర్తించారు. 

అందులో ఒక పోలీసు నన్ను పక్కకు తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తిం చడం మొదలు పెట్టాడు. దీంతో నాకు చంపేయాలన్నంత కోపం వచ్చిం ది. అతనిపై ఎదురు తిరిగాను. నన్ను నేను కాపాడుకోవడం కోసం అతన్ని ప్రతిఘటించాను. దీంతో డ్యూటీలో వుండే పోలీసుపై హత్యా యత్నం కేసు నమోదు చేసి మూడేళ్ళ శిక్ష విధించారు. నన్ను తీహర్‌ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ నాకు ఎంతో సంతోషం అనిపించింది. బయటి ప్రపంచంలో జంతువుల లాంటి మనుషులతో బతకడం కన్నా ఇక్కడ ఎంతో హాయిగా అనిపించింది. కానీ ఇక్కడ నేను ఆశగా బతకడం నేర్చుకున్నాను. జీవితం మీద ఎంతో నమ్మకాన్ని పెంచు కున్నాను. అక్కడి వారందరూ ఇందుకు ఎంతో ప్రభావం చూపారు. 

సొంత ఊరే అయినా వుండలేకపోయా..
శిక్ష తరువాత జైలు నుండి బయటికి వచ్చాను. అక్కడి నుండి నన్ను హోమ్‌కు తీసుకెళ్ళారు. అక్కడి వారందరూ ఎంతో మంచి వారనిపిం చింది. కానీ మరుసటి రోజు రోమా నా దగ్గరికి వచ్చి నన్ను హసీనాతో వెళ్ళాలని చెప్పారు. కానీ నన్ను మళ్ళీ అమ్మేందుకు పథకం వేస్తున్నా రేమోనని అనుమానం వచ్చింది.వెళ్ళేందుకు ఒప్పుకోలేదు. కానీ హసీనా నా దగ్గరికి వచ్చి చాలా సేపు మాట్లాడారు. దీంతో వారితో వెళ్ళేందుకు ఒప్పుకున్నాను. పోలీసుల రణతో నన్ను మా సొంత గ్రామం బాలుంగ్‌ పంగ్‌ తీసుకెళ్ళారు.

అక్కడ మా ఇంటికి వెళ్ళినా నాకు ఏ మాత్రం సంతోషంగా అనిపించలేదు. చుట్టుపక్కల వారందరూ నన్ను తప్పు చేసి న అమ్మాయిలా, అంటరాని దానిదానిలాగా చూశారు. అక్కడ వుండలేక పోయాను. తరువాత ఎస్‌టి మేరీస్‌ హోమ్‌కి వెళ్ళాను. అక్కడే చేతి వృత్తు లు నేర్చుకున్నాను. ఇంపల్స్‌ ఎన్‌జిఓ నెట్‌వర్క్‌లో నాలాంటి తోటి అమ్మా యిలకు సాయం చేసే స్థాయికి వచ్చే వరకు అక్కడే వున్నాను.

ప్రస్తుతం సంగ్మా... 
గత సంవత్సరం సంగ్మా త్రిపురకు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వేశ్యా గృహంలో వున్నప్పుడు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసు కోవాలనుకున్న ఆమె అలా చేయనందుకు ఎంతో సంతోషపడుతోంది. ఒక వేళ అలా చేసి వుంటే ఇప్పుడు ఇంత ఆనందాన్ని తాను కోల్పోయి వుండేదాన్నని అంటోంది. సంగ్మా ఇప్పుడు షిల్లాంగ్‌లోని ఇంపల్స్‌ ఎన్‌జిఓ సంస్థలో పనిచేస్తోంది. తన లాంటి అమ్మాయిలను ఎందరినో కాపాడేందుకు, వారిని సమస్యల నుండి బయటికి లాగేందుకు కృషి చేస్తోంది.
           -హైమ సింగతల 
surya telugu daily