Search This Blog

Thursday 21 August 2014

లక్షల సంపాదన వదిలి... సమాజసేవవై కదిలి

మార్చి 25, 2011.. ఐక్య రాజ్య సమితి వేదికగా.. 11వ ‘ఇన్ఫో-పావర్టీ’ సదస్సు జరుగుతోంది. భారత్‌ నుండి ఓ మహిళా గ్రామ సర్పంచ్‌ ఇప్పుడు ప్రసంగిస్తారు అని సదస్సు చైర్‌పర్సన్‌ ప్రక టించగానే.. అక్కడ ఉన్న వివిధ దేశాల రాయబారులు, మంత్రులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందరో మహామహులు ప్రసంగించాల్సిన ఈ సదస్సులో ఒక సర్పంచ్‌ ఏం మాట్లాడుతుంది అని చెవులు కొరుక్కు న్నారు. 

మహిళా సర్పంచ్‌ అనగానే.. ఓ 40-50 ఏళ్ళ వయస్సులో.. గ్రామీణ వస్తధ్రారణలో.. ఉంటుందని భావించిన వారికి మ్‌ చేతుల మీదుగా.. ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అందం, ఆధునిక వస్తధ్రారణ చూసి.. ఈమె సర్పంచ్‌ కానేకాదు ఐటీ ప్రొఫెషనల్‌, మోడల్‌ అయి వుంటుందని అనుకున్నారంతా.. ఆమె రాజస్థాన్‌లోని సోడా గ్రామ సర్పంచ్‌ 30 ఏళ్ళ ఛవీ రజావత్‌. మేనేజ్‌ మెంట్‌ డిగ్రీని సైతం పక్కనబెట్టి.. ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సహకారం లేకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ‘ధీర’ వనిత. ఆమె సేవలకు గుర్తింపుగా.. ఇటీవల ‘టెక్నాలజీ డే’ సందర్భంగా.. మాజీ రాష్టప్రతి డా అబ్దుల్‌ కలా


ఛవీ రజావత్‌.. రాజస్థాన్‌లోని మారుమూల సోడా గ్రామ సర్పంచి.. మారుతున్న గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక.. 30 ఏళ్ల రజావత్‌ ఎంబీఏ చేసిన ఏకైక గ్రామ సర్పంచి.. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా..! మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య... ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో కాలేజీ విద్య... పుణెలోని బాలాజీ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీఏ పూర్తిచేసన రజావత్‌ తన స్వగ్రామానికి సేవ చేసేందుకు..

భారతీ-టెలీ వెంచర్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాన్ని సైతం వదులుకున్నారు. సిటీ లైఫ్‌ను విడిచిపెట్టి.. సోడాలోని మట్టి రోడ్లపై తిరుగుతూ.. ప్రజల తో మమేకమవుతూ తన గ్రామ ఉజ్వల భవితకు పునాది రాళ్లు వేస్తున్నారు. మార్చి 24-25 తేదీల్లో ఐరాసలో జరిగిన ఈ సద స్సు ప్యానెల్‌ చర్చలో పాల్గొన్న రజావత్‌.. దారిద్య్రానికి వ్యతిరేకం గా పోరాడటంతో.. అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌర సమా జం పాత్రపై ప్రసంగించారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తు త తరుణంలో మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ- సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవా లని చెప్పారు.

సోడాకు కొత్త సొబగులు...
‘‘గత సంవత్సర కాలంలో నేను, గ్రామస్తులు కలిసి మా సొంత కృషితో గ్రామంలో మంచి మార్పు తెచ్చాం. మాకు బయటి మద్ద తు లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకారం లేదు. అయితే, మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాకు కార్పొరేటు ప్రపంచం, బయటి ఏజెన్సీల మద్దతు కావాలి’’ అని రజావత్‌ కోరారు. తమ గ్రామంలో తొలి బ్యాంకు ఏర్పాటుకు సహకరించిన ఐరాస ఆఫీ్‌ ఫర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. ‘‘మూడేళ్లలో నా గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తా. నాకు డబ్బు అక్కర్లేదు. మా గ్రామంలో ప్రాజెక్టులను దత్తత తీసుకునే వ్యక్తులు, సంస్థలు కావాలి. నా గ్రామంలో సత్వర అభివృద్ధి కోసం ఈ సదస్సు సహకారమందించాలి. అప్పుడే మీరు, నేను అనుభవిస్తున్న మంచి జీవితాన్ని ప్రస్తుత తరం అనుభవించడాని కి వీలుంటుంది’’ అని ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. రజావ త్‌ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

జీన్స్‌ ప్యాంట్‌... గుర్రపుస్వారీ...
సంప్రదాయంలో భాగంగా తమ ముఖం ఇతరులకు కనిపించ కుండా ముసుగు ధరించే మహిళలు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌ ధరించి.. గ్రామ సభలకు హాజరవుతారు.గుర్రపు స్వారీ చేస్తారు. సాధారణంగా.. ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన ఎవరైనా కార్పొరేట్‌ రంగంలో లక్షల సంపాదనతో స్థిరపడతారు. కానీ, రజావత్‌ అలా కాదు, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం కాదని. జన్మభూమి సేవలో తరిస్తున్నారు. గత మూడేళ్ళలో గ్రామ సర్పంచ్‌గా సోడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది. దీనికి గుర్తింపుగానే ఐరాస సదస్సు ప్యానల్‌ చర్చల్లో పాల్గొనే అరుదైన ఘనతను సొం తం చేసుకున్నారు రజావత్‌. ఎలాంటి సహాయ సహకారాలను ఆశించకుండా.. 

తీసుకోకుండా తనదైన ఆలోచనలతో తన గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సాధారణ మను షులకు సాధ్యం కాని పనిని చేసి చూపించింది. అందుకే 30 ఏళ్ళ వయస్సులోనే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించింది. భారత్‌ లోనే పిన్నవయస్కురాలైన, ఎంబిఎ చదివిన ఏకైక మహిళా సర్పం చ్‌ రజావత్‌ (30). గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన భారీ టెలీవెంచర్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. గ్రామ సర్పంచ్‌గా తాను అనుకున్నది సాధించిన వైనాన్ని ఐక్యరా జ్యసమితి సదస్సులో వివరించింది. దారిద్య్రంపై పోరు, అభివృద్దిలో పౌరసమాజం పాత్ర, అభివృద్ధి చర్యలను పౌరసమాజం ఎలా అమలు చేయాలి అనే అంశంపై చర్చలో పాల్గొంది.

ఈ-సేవలు అమలు చేయాలి...
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిలీనియం లక్ష్యాలను సాధించాలంటే ఈ-సేవలు వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సహా వివిధ వ్యూహాత్మక చర్యలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులకు సూచించింది. ‘‘స్వాతంత్య్రం సంపాదించినప్పటినుంచీ గత 65 ఏళ్ళు ఒకే రీతిలో పురోగతిని సాధించేందు కు భారత్‌ కృషి చేస్తోంది. కానీ ఇది సరైనరీతిలో లేదు.ప్రజలకు నీరు, విద్యుత్తు, మరుగుదొ డ్లు, పాఠశాలలు, ఉద్యోగాలు అందించడంలో మనం విఫలమయ్యాం. 

వీటిని వేరొకదారిలో సాధించడవచ్చు. వేగంగా చర్యలు చేపట్టవచ్చునని నేను భావిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాది లోనే నేను, సోడా గ్రామస్తులు కలిసి సొంత సామర్థ్యంతో గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.మేము ఎవరి మద్దతును తీసుకోలేదు. ఎన్జీవోలు గానీ, ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎవరి సాయం తీసుకోలేదు’’ అని చెప్పారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధిం చేందుకు బయట ఏజన్సీలు, కార్పొరేట్‌ ప్రపంచం మద్దతును కోరుతున్నానని ఆమె చెప్పారు.

మేనేజ్‌మెంట్‌ డిగ్రీ గ్రామ పాలనకు ఉపయోగపడుతోంది...
‘‘గ్రామస్తులకు సేవ చేయడం ద్వారా నేను నా మూల్లాలోకి వెళుతున్నాను. ఇందుకు ముంద స్తుగా అనుకున్నది కాదు. ఎక్కడైతే నేను ఎదిగానో అదే గ్రామానికి నేను సేవలు అందిస్తున్నా ను’’ అని ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం రజావత్‌ చెప్పారు. నా ఎంబీఏ డిగ్రీ గ్రామ పాలనకు, కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. దీనిని నేను కెరీర్‌గా భావిం చడం లేదు. సామాజిక సేవగా భావిస్తున్నాను అని చెప్పారు. ఎన్జీవోల సాయంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, సురక్షితమైన తాగునీరు తెచ్చేందుకు దృష్టిపెడుతున్నాను రజావత్‌ తెలిపారు.

రిషీ వ్యాలీ టు సోడా...
ఛవీ రజావత్‌ నేతృత్వంలో సోడా గ్రామం ప్రగతిపథాన ముందుకు పోతుంటే, పత్రికా విలేఖ రులు, ప్రచార ప్రసార మాధ్యమాలు, ిసినీ నిర్మాతలు సోడా గ్రామానికి బారులు తీరారు. ఓ మహిళ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుచున్నాయనేదే అందరి ధ్యాస. సోడాలో మంచి నీరు ప్రధాన సమస్య. రజావత్‌ గతంలో జైపూర్‌లో గుర్రాల స్వారీ స్కూలును నడుపుతూ, తల్లికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించేది. రజావత్‌కు పూర్వ సర్పంచ్‌ విధులు సరిగా నిర్వహించని కారణాన గ్రామస్థులు విసిగి వేసారిపోయారు. 

ఆమెను ఈసారి సర్పంచ్‌గా పోటీకి నిలువకపోతే ధర్నాకు సిద్ధమయ్యారు. ఓ వైపు తలంతా కప్పుకున్న గృహిణులు, మరోవైపు జీన్స్‌ ప్యాంట్‌తో ఈమె ఎలా గ్రామానికి పొంతన కుదరుతుందని కొం దరు ప్రశ్నించారు. ఆమె ఏ దుస్తులు ధరించినా సోడా గ్రామవాసి. అదే ఆ గ్రామానికి కోడలై తే రాజస్థానీ దుస్తులు ధరించాలని పట్టుబట్టే వారే. గుర్రమెక్కి గ్రామంలో ఇంటింటి బాగోగు లు వాకబు చేస్తుంది. ఛవీ రజావత్‌ రాజ్‌పుట్‌ కుటుంబీకురాలు. వారికి సోడా, పరిసర గ్రామాలలో వందల ఎకరాలున్నాయి. 

ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తాతగారు ఆ ఊరి సర్పంచ్‌ వారి పాలనలో గ్రామస్థుల కష్టాలు తీరాయి.మళ్లీ సర్పంచ్‌ మారడంతో అభివృద్ధి నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ అమలు జరుగుతుందని సర్పించ్‌ భార్యను సర్పంచ్‌గా నుంచోమన్నాడు. కానీ గ్రామస్థులంతా ఛవీ రజావత్‌నే సర్పంచ్‌గా ఆదరించి గెలిపించారు.రాజస్థాన్‌లోని సర్పంచ్‌ల ఎన్నికల్లో చావీ రజావత్‌కే అత్యధికంగా మెజారిటీ లభించింది.

ఉపాధి హామీ...
టాంక్‌ జిల్లావెనుకబడిన ప్రాంతం. గ్రామస్థులంతా ఆవాలు, గోధుమ, ధనియాలను పండించే వారు.వర్షాభావ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా చెరువులు, వాగులు ఎండిపోయాయి. భూమిలో నీరు ఇంకిపోతుంది.బిసాల్పూర్‌ డామ్‌ నీళ్లు జైపూర్‌కు మళ్లిస్తున్న కారణాన టాంక్‌ జిల్లాలోని గ్రామాలకు నీరు అందటం లేదు. చావిరజావత్‌ సోడా గ్రామానికి నీరు రప్పించేందుకు కంకణం కట్టుకుంది. మరోవెపు జాతీయస్థాయిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలో అవినీతిపై రజావత్‌ యుద్ధం ప్రకటించింది. పంటలకాలం ముగిస్తే, గ్రామంలో పెక్కుమందికి ఉపాధి లభించుట లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకై రజావత్‌ శ్రమించింది. పంటకాలం ముగిస్తే, చేతులు ముడుచుకొని ఎవరినీ కూర్చోవద్దన్నది.

మహిళా కార్మికులు...
పొలం గట్లు వేయటం, మట్టి పనులలో అధికంగా మహిళా కార్మికులే పని చేస్తారు. చదువుకున్న విద్యార్థినులు కూడా మట్టి పనులు చేస్తున్నారు. ఏదైనా పొలాలకు నీరందితేనే కానీ, వారి భవిష్యత్‌ మారదనేది వారి వాదన. రోజూ నీటికై మహిళలు ఎన్నోమైళ్లు నడిచివెళ్లాలి. రోజూ రెండు సార్లు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. కొందరు నగరానికి వలసలు వెళ్లారు. మరి కొందరు సోమరులుగా సోడా గ్రాంలోనే కాలం గడుపుతున్నారు.

మారిన ఆలోచనాధోరణి...
తండ్రి, ఛవీ రజావత్‌కు బాసటగా నిలిచారు. చెరువులను తవ్వించటం, చెట్లు పెంచటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపకల్పన చేయటం వారి నిత్యవిధులు. వర్షపు నీటిని సక్రమంగా విని యోగించమని గ్రామస్థులకు తెలియజేశారు. ఛవీ రజావత్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులలో, ఎవరినీ సోమరిగా కూర్చోవద్దన్నది. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసింది. గ్రామాలలో పలుచోట్ల ప్రభుత్వం పైనే, ప్రతి పనికీ గతంలో ఆధారపడేవారు. ఛవీ రజావత్‌ అలా కాకుండా గ్రామస్థులను వారి కాళ్లపై నిలబడే స్వభావాన్ని పెంచింది. వారి ఆలోచనలను మార్చడం కష్టమే. కానీ కాలగమనంలో ఛవీ రజావత్‌ దీక్ష, పట్టుదల ముందు వారు తలొగ్గారు. ప్రతీ చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడక, గ్రామాభివృద్ధికై వారిని శ్రమయేవ జయతే బాటలో నడిపిస్తుంది.
- హైమ సింగతల
సూర్య దినపత్రిక

No comments:

Post a Comment