Search This Blog

Thursday, 21 August 2014

లక్షల సంపాదన వదిలి... సమాజసేవవై కదిలి

మార్చి 25, 2011.. ఐక్య రాజ్య సమితి వేదికగా.. 11వ ‘ఇన్ఫో-పావర్టీ’ సదస్సు జరుగుతోంది. భారత్‌ నుండి ఓ మహిళా గ్రామ సర్పంచ్‌ ఇప్పుడు ప్రసంగిస్తారు అని సదస్సు చైర్‌పర్సన్‌ ప్రక టించగానే.. అక్కడ ఉన్న వివిధ దేశాల రాయబారులు, మంత్రులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందరో మహామహులు ప్రసంగించాల్సిన ఈ సదస్సులో ఒక సర్పంచ్‌ ఏం మాట్లాడుతుంది అని చెవులు కొరుక్కు న్నారు. 

మహిళా సర్పంచ్‌ అనగానే.. ఓ 40-50 ఏళ్ళ వయస్సులో.. గ్రామీణ వస్తధ్రారణలో.. ఉంటుందని భావించిన వారికి మ్‌ చేతుల మీదుగా.. ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అందం, ఆధునిక వస్తధ్రారణ చూసి.. ఈమె సర్పంచ్‌ కానేకాదు ఐటీ ప్రొఫెషనల్‌, మోడల్‌ అయి వుంటుందని అనుకున్నారంతా.. ఆమె రాజస్థాన్‌లోని సోడా గ్రామ సర్పంచ్‌ 30 ఏళ్ళ ఛవీ రజావత్‌. మేనేజ్‌ మెంట్‌ డిగ్రీని సైతం పక్కనబెట్టి.. ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సహకారం లేకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ‘ధీర’ వనిత. ఆమె సేవలకు గుర్తింపుగా.. ఇటీవల ‘టెక్నాలజీ డే’ సందర్భంగా.. మాజీ రాష్టప్రతి డా అబ్దుల్‌ కలా


ఛవీ రజావత్‌.. రాజస్థాన్‌లోని మారుమూల సోడా గ్రామ సర్పంచి.. మారుతున్న గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక.. 30 ఏళ్ల రజావత్‌ ఎంబీఏ చేసిన ఏకైక గ్రామ సర్పంచి.. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా..! మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య... ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో కాలేజీ విద్య... పుణెలోని బాలాజీ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీఏ పూర్తిచేసన రజావత్‌ తన స్వగ్రామానికి సేవ చేసేందుకు..

భారతీ-టెలీ వెంచర్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాన్ని సైతం వదులుకున్నారు. సిటీ లైఫ్‌ను విడిచిపెట్టి.. సోడాలోని మట్టి రోడ్లపై తిరుగుతూ.. ప్రజల తో మమేకమవుతూ తన గ్రామ ఉజ్వల భవితకు పునాది రాళ్లు వేస్తున్నారు. మార్చి 24-25 తేదీల్లో ఐరాసలో జరిగిన ఈ సద స్సు ప్యానెల్‌ చర్చలో పాల్గొన్న రజావత్‌.. దారిద్య్రానికి వ్యతిరేకం గా పోరాడటంతో.. అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌర సమా జం పాత్రపై ప్రసంగించారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తు త తరుణంలో మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ- సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవా లని చెప్పారు.

సోడాకు కొత్త సొబగులు...
‘‘గత సంవత్సర కాలంలో నేను, గ్రామస్తులు కలిసి మా సొంత కృషితో గ్రామంలో మంచి మార్పు తెచ్చాం. మాకు బయటి మద్ద తు లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకారం లేదు. అయితే, మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాకు కార్పొరేటు ప్రపంచం, బయటి ఏజెన్సీల మద్దతు కావాలి’’ అని రజావత్‌ కోరారు. తమ గ్రామంలో తొలి బ్యాంకు ఏర్పాటుకు సహకరించిన ఐరాస ఆఫీ్‌ ఫర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. ‘‘మూడేళ్లలో నా గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తా. నాకు డబ్బు అక్కర్లేదు. మా గ్రామంలో ప్రాజెక్టులను దత్తత తీసుకునే వ్యక్తులు, సంస్థలు కావాలి. నా గ్రామంలో సత్వర అభివృద్ధి కోసం ఈ సదస్సు సహకారమందించాలి. అప్పుడే మీరు, నేను అనుభవిస్తున్న మంచి జీవితాన్ని ప్రస్తుత తరం అనుభవించడాని కి వీలుంటుంది’’ అని ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. రజావ త్‌ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

జీన్స్‌ ప్యాంట్‌... గుర్రపుస్వారీ...
సంప్రదాయంలో భాగంగా తమ ముఖం ఇతరులకు కనిపించ కుండా ముసుగు ధరించే మహిళలు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌ ధరించి.. గ్రామ సభలకు హాజరవుతారు.గుర్రపు స్వారీ చేస్తారు. సాధారణంగా.. ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన ఎవరైనా కార్పొరేట్‌ రంగంలో లక్షల సంపాదనతో స్థిరపడతారు. కానీ, రజావత్‌ అలా కాదు, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం కాదని. జన్మభూమి సేవలో తరిస్తున్నారు. గత మూడేళ్ళలో గ్రామ సర్పంచ్‌గా సోడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది. దీనికి గుర్తింపుగానే ఐరాస సదస్సు ప్యానల్‌ చర్చల్లో పాల్గొనే అరుదైన ఘనతను సొం తం చేసుకున్నారు రజావత్‌. ఎలాంటి సహాయ సహకారాలను ఆశించకుండా.. 

తీసుకోకుండా తనదైన ఆలోచనలతో తన గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సాధారణ మను షులకు సాధ్యం కాని పనిని చేసి చూపించింది. అందుకే 30 ఏళ్ళ వయస్సులోనే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించింది. భారత్‌ లోనే పిన్నవయస్కురాలైన, ఎంబిఎ చదివిన ఏకైక మహిళా సర్పం చ్‌ రజావత్‌ (30). గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన భారీ టెలీవెంచర్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. గ్రామ సర్పంచ్‌గా తాను అనుకున్నది సాధించిన వైనాన్ని ఐక్యరా జ్యసమితి సదస్సులో వివరించింది. దారిద్య్రంపై పోరు, అభివృద్దిలో పౌరసమాజం పాత్ర, అభివృద్ధి చర్యలను పౌరసమాజం ఎలా అమలు చేయాలి అనే అంశంపై చర్చలో పాల్గొంది.

ఈ-సేవలు అమలు చేయాలి...
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిలీనియం లక్ష్యాలను సాధించాలంటే ఈ-సేవలు వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సహా వివిధ వ్యూహాత్మక చర్యలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులకు సూచించింది. ‘‘స్వాతంత్య్రం సంపాదించినప్పటినుంచీ గత 65 ఏళ్ళు ఒకే రీతిలో పురోగతిని సాధించేందు కు భారత్‌ కృషి చేస్తోంది. కానీ ఇది సరైనరీతిలో లేదు.ప్రజలకు నీరు, విద్యుత్తు, మరుగుదొ డ్లు, పాఠశాలలు, ఉద్యోగాలు అందించడంలో మనం విఫలమయ్యాం. 

వీటిని వేరొకదారిలో సాధించడవచ్చు. వేగంగా చర్యలు చేపట్టవచ్చునని నేను భావిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాది లోనే నేను, సోడా గ్రామస్తులు కలిసి సొంత సామర్థ్యంతో గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.మేము ఎవరి మద్దతును తీసుకోలేదు. ఎన్జీవోలు గానీ, ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎవరి సాయం తీసుకోలేదు’’ అని చెప్పారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధిం చేందుకు బయట ఏజన్సీలు, కార్పొరేట్‌ ప్రపంచం మద్దతును కోరుతున్నానని ఆమె చెప్పారు.

మేనేజ్‌మెంట్‌ డిగ్రీ గ్రామ పాలనకు ఉపయోగపడుతోంది...
‘‘గ్రామస్తులకు సేవ చేయడం ద్వారా నేను నా మూల్లాలోకి వెళుతున్నాను. ఇందుకు ముంద స్తుగా అనుకున్నది కాదు. ఎక్కడైతే నేను ఎదిగానో అదే గ్రామానికి నేను సేవలు అందిస్తున్నా ను’’ అని ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం రజావత్‌ చెప్పారు. నా ఎంబీఏ డిగ్రీ గ్రామ పాలనకు, కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. దీనిని నేను కెరీర్‌గా భావిం చడం లేదు. సామాజిక సేవగా భావిస్తున్నాను అని చెప్పారు. ఎన్జీవోల సాయంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, సురక్షితమైన తాగునీరు తెచ్చేందుకు దృష్టిపెడుతున్నాను రజావత్‌ తెలిపారు.

రిషీ వ్యాలీ టు సోడా...
ఛవీ రజావత్‌ నేతృత్వంలో సోడా గ్రామం ప్రగతిపథాన ముందుకు పోతుంటే, పత్రికా విలేఖ రులు, ప్రచార ప్రసార మాధ్యమాలు, ిసినీ నిర్మాతలు సోడా గ్రామానికి బారులు తీరారు. ఓ మహిళ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుచున్నాయనేదే అందరి ధ్యాస. సోడాలో మంచి నీరు ప్రధాన సమస్య. రజావత్‌ గతంలో జైపూర్‌లో గుర్రాల స్వారీ స్కూలును నడుపుతూ, తల్లికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించేది. రజావత్‌కు పూర్వ సర్పంచ్‌ విధులు సరిగా నిర్వహించని కారణాన గ్రామస్థులు విసిగి వేసారిపోయారు. 

ఆమెను ఈసారి సర్పంచ్‌గా పోటీకి నిలువకపోతే ధర్నాకు సిద్ధమయ్యారు. ఓ వైపు తలంతా కప్పుకున్న గృహిణులు, మరోవైపు జీన్స్‌ ప్యాంట్‌తో ఈమె ఎలా గ్రామానికి పొంతన కుదరుతుందని కొం దరు ప్రశ్నించారు. ఆమె ఏ దుస్తులు ధరించినా సోడా గ్రామవాసి. అదే ఆ గ్రామానికి కోడలై తే రాజస్థానీ దుస్తులు ధరించాలని పట్టుబట్టే వారే. గుర్రమెక్కి గ్రామంలో ఇంటింటి బాగోగు లు వాకబు చేస్తుంది. ఛవీ రజావత్‌ రాజ్‌పుట్‌ కుటుంబీకురాలు. వారికి సోడా, పరిసర గ్రామాలలో వందల ఎకరాలున్నాయి. 

ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తాతగారు ఆ ఊరి సర్పంచ్‌ వారి పాలనలో గ్రామస్థుల కష్టాలు తీరాయి.మళ్లీ సర్పంచ్‌ మారడంతో అభివృద్ధి నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ అమలు జరుగుతుందని సర్పించ్‌ భార్యను సర్పంచ్‌గా నుంచోమన్నాడు. కానీ గ్రామస్థులంతా ఛవీ రజావత్‌నే సర్పంచ్‌గా ఆదరించి గెలిపించారు.రాజస్థాన్‌లోని సర్పంచ్‌ల ఎన్నికల్లో చావీ రజావత్‌కే అత్యధికంగా మెజారిటీ లభించింది.

ఉపాధి హామీ...
టాంక్‌ జిల్లావెనుకబడిన ప్రాంతం. గ్రామస్థులంతా ఆవాలు, గోధుమ, ధనియాలను పండించే వారు.వర్షాభావ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా చెరువులు, వాగులు ఎండిపోయాయి. భూమిలో నీరు ఇంకిపోతుంది.బిసాల్పూర్‌ డామ్‌ నీళ్లు జైపూర్‌కు మళ్లిస్తున్న కారణాన టాంక్‌ జిల్లాలోని గ్రామాలకు నీరు అందటం లేదు. చావిరజావత్‌ సోడా గ్రామానికి నీరు రప్పించేందుకు కంకణం కట్టుకుంది. మరోవెపు జాతీయస్థాయిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలో అవినీతిపై రజావత్‌ యుద్ధం ప్రకటించింది. పంటలకాలం ముగిస్తే, గ్రామంలో పెక్కుమందికి ఉపాధి లభించుట లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకై రజావత్‌ శ్రమించింది. పంటకాలం ముగిస్తే, చేతులు ముడుచుకొని ఎవరినీ కూర్చోవద్దన్నది.

మహిళా కార్మికులు...
పొలం గట్లు వేయటం, మట్టి పనులలో అధికంగా మహిళా కార్మికులే పని చేస్తారు. చదువుకున్న విద్యార్థినులు కూడా మట్టి పనులు చేస్తున్నారు. ఏదైనా పొలాలకు నీరందితేనే కానీ, వారి భవిష్యత్‌ మారదనేది వారి వాదన. రోజూ నీటికై మహిళలు ఎన్నోమైళ్లు నడిచివెళ్లాలి. రోజూ రెండు సార్లు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. కొందరు నగరానికి వలసలు వెళ్లారు. మరి కొందరు సోమరులుగా సోడా గ్రాంలోనే కాలం గడుపుతున్నారు.

మారిన ఆలోచనాధోరణి...
తండ్రి, ఛవీ రజావత్‌కు బాసటగా నిలిచారు. చెరువులను తవ్వించటం, చెట్లు పెంచటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపకల్పన చేయటం వారి నిత్యవిధులు. వర్షపు నీటిని సక్రమంగా విని యోగించమని గ్రామస్థులకు తెలియజేశారు. ఛవీ రజావత్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులలో, ఎవరినీ సోమరిగా కూర్చోవద్దన్నది. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసింది. గ్రామాలలో పలుచోట్ల ప్రభుత్వం పైనే, ప్రతి పనికీ గతంలో ఆధారపడేవారు. ఛవీ రజావత్‌ అలా కాకుండా గ్రామస్థులను వారి కాళ్లపై నిలబడే స్వభావాన్ని పెంచింది. వారి ఆలోచనలను మార్చడం కష్టమే. కానీ కాలగమనంలో ఛవీ రజావత్‌ దీక్ష, పట్టుదల ముందు వారు తలొగ్గారు. ప్రతీ చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడక, గ్రామాభివృద్ధికై వారిని శ్రమయేవ జయతే బాటలో నడిపిస్తుంది.
- హైమ సింగతల
సూర్య దినపత్రిక

Wednesday, 20 August 2014

తొలి ‘ఓటు’ రోలా దస్తి...

కువైట్‌లో మొట్టమొదటి మహిళా ఓటరుగా నమోదుచేసుకున్న రోలా దస్తి. కేవలం ఓటు హక్కే కాదు.. మొదటి ఉద్యోగిని.. అణగదొక్కబడుతున్న స్ర్తీ జాతికి సమానత్వం, సమాజంలో స్థానం కల్పించాలని కోరిన స్త్రీ మూర్తి. మహిళలందరికీ స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహిళ...

2005లో కువైట్‌లో మొట్టమొదటి సారి ఓటు హక్కు పొందిన మహిళ రోలా దస్త్తి. మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలంటూ ఆమె చేసిన సుదీర్ఘ పోరాట ఫలితం అది. కువైట్‌ పార్లమెంటు ఎన్నికలలో మొదటి సారి మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న సంవత్సరం అది. 2006లో పార్లమెంటు ఎన్నికల పోటీలో అభ్యర్థిగా నిలబడిన మొదటి మహిళ కూడా రోలానే. ఆమె చేసిన పోరాటాల ఫలితమే 2009 పార్లమెంటు ఎన్నికలలో ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు సీట్లను సంపాదించుకున్నారు.కువైట్‌ పార్లమెంటులో అడుగుపెట్టిన మొదటి మహిళ కూడా రోలానే. 

రోలా జాన్స్‌ హాకిన్స్‌ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి విద్య పూర్తి చేసింది. దేశంలో ఆర్థిక స్థితిగతులు, సమాజిక పరిస్థితుల అంశాలపై ఆమె పరిశోధనలు చేసింది. మొదట ఆర్‌అండ్‌డి విద్యా సంస్థ కువైట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో మేనేజర్‌గా, నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువౌట్‌కు సీనియర్‌ ఎకనామిస్ట్‌గా, వరల్డ్‌ బ్యాంక్‌కు సంబంధించిన ఓ కన్సల్టెన్సీ బాధ్యతలు కూడా ఆమె నిర్వహించింది.1990, 91లలో ప్రభుత్వ ఎమర్సెనీ సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. కువైట్‌ ఎకనామిక్‌ సొసౌటీకి చైన్‌ పర్సన్‌గా కూడా ఎంపికైంది. 

ఇలా ఎంపికైన మొదటి మహిళ ఆమె. ఆమె గ్రాడ్యుయేషన్‌ విద్యనభ్యసిస్తున్నప్పటి నుండి అనేక స్వచ్చంద సంస్థల్లో వాలెంటరీగా పని చేసింది. రిపబ్లిక్‌ యెమెన్‌లో మహిళలకు సంబంధించి ఆర్థిక స్వేచ్ఛ కోసం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. కువైట్‌లో మహిళా సమానత్వం కోసం పోరాడింది. 2005 మేలో మహిళలు ఓటు వేసేందుకు అనువుగా డిక్రీని తీసు కొచ్చింది. ఇందుకు ఆమె ‘కింగ్‌ హుస్సేన్‌ హ్యుమానిటేరియన్‌’ అవార్డును అందుకుంది. రెడ్‌ క్రాస్‌ సొసైటీలో సభ్యురాలిగా సేవ చేసింది. 

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సంస్కరణల అమలుకు ఆమె ఎంతగానో కృషి చేసింది. వీటికి సంబంధించి కృషి చేస్తున్న ఎన్నో స్వచ్చంద సంస్థలను ప్రోత్సహించింది. అరబ్‌ దేశాల్లో వంద మంది ప్రభావశీల మహిళల్లో స్థానం సంపాదించుకుంది. 1970లో ఏర్పడిన కువైట్‌ ఎకనామిక్‌ సొసైటీలో స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి మహిళగా రోలా చరిత్రలోకెక్కింది. రోలా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీని కూడా నిర్వహించింది. యంగ్‌ అరబ్‌ లీడర్స్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా పనిచేసింది. మహిళా ఆర్గనైజేషన్‌ను స్థాపించింది. 2009లో పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచి తన జిల్లాలో ఏడవ స్థానంలో నిలిచింది. 2010లో ఆమె కౌన్సిల్‌ ఆఫ్‌ యూరోప్‌ నుండి సౌత్‌ నార్త్‌ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల
సూర్య దినపత్రిక, ధీర

చిత్తు కాగితాల నుండి... చరిత్ర పుటల్లోకి...

తోటి వయసులోని పిల్లలంతా తరగతి గదుల్లోని పుస్తకాలతో కుస్తీ పడు తుంటే... సోకా చెత్త కుప్పల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తన కడుపు నింపుకునేందుకు కష్టపడింది. ఆలనా.. పాలనా చూడాల్సిన తల్లిదండ్రులకే అమై్మంది. సోదరులను పోషించే బాద్యత తలకెత్తుకుంది. అదంతా గతం.. ప్రస్తుతం సోహా ఒక అంరత్జాతీయంగా పేరు తెచ్చుకున్న అమ్మాయి...

కంబోడియాలో ఒక వంద ఎకరాల్లో చెత్తకుప్పలు వుంటాయంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా మురికి కూపాలు.. చెత్తకుప్పలు వాటిలో ప్లాస్టిక్‌, ఇనుము వంటి వస్తువులను ఏరుకునే చిన్నారులు... సోకా చెన్‌ కూడా ఆ చెత్త కుప్పల్లో సంచులు పట్టుకుని నడిచే పిల్లల్లో ఒకటి... అక్కడి చిన్న చిన్న ప్లాస్టిక్‌ వస్తువులను ఏరుకుంటూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి వెళ్తుంది.. కుటుంబ పోషణకు కావలసినది సంపాదించేందుకు కష్టపడుతుంది. 

ప్రస్తుతం సోకా వయసు 16. కంబోడియాలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని. క్లాసికల్‌ డాన్సర్‌.. మూడు సంవత్సరాల క్రితం సోకా జీవితం మారిపోయింది. అసలు సాధ్యం కాని ఓ కల ఆ అమ్మాయి విషయంలో నిజమైంది. అది కూడా కొద్ది సంవత్సరాల క్రిత మే. తొమ్మిదేళ్ల వయసులో వున్నప్పుడు సోకా తొమ్మిది సంవత్సరాల వయసులో తన గ్రామం పెనోమ్‌ పెన్‌ను వదిలి వెళ్లింది. కేవ లం సోకానే కాదు.. అక్కడి లక్షలాది చిన్నారు ల పరిస్థితి ఇదే.. వారి కున్న ఏకైక మార్గం చిత్తుకాగితాల సేకరణనను జీవనోపాధిగా ఎంచుకుంది. మూడు సంవత్సరాల క్రితం చికాగోకు చెందిన బిల్‌ స్మిత్‌ కంట పడింది. 


స్మిత్‌ కొన్ని సంవత్సరాల క్రితం కంబోడియా కు వచ్చి స్థిరపడ్డాడు. సోకాను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. కేవలం సోకానే కాదు.. దాదాపు 100 మంది మురికివాడలకు చెందిన పిల్లలను చేరదీశాడు. మంచి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఇచ్చాడు ఆ చిన్నారులకు. పాఠశాలల్లో చేర్చాడు.మిగిలిన అందరి విద్యార్థులకంటే సోకా ఎంతో తెలివైన అమ్మాయిగా పాఠశాలలో పేరు తెచ్చుకుంది.కేవలం పాఠాలే కాదు.. సంప్రదాయ నృత్యంలోనూ మేటి అనిపించుకుంది.ఇప్పుడు ఆమె గతం గురించి ఎవరైనా మాట్లాడితే సోకా ఏమీ పట్టించుకోదు.. కానీ తాను పేద పిల్లల కోసం ప్రారంభించిన పాఠశాల గురించి కూడా చెప్పమంటుంది. ‘నాకు చాలా మంచి భవిష్యత్తు వుంది.

అలాగే కంబో డియాలోనే ప్రతి ఒక్కచిన్నారికి కూడా మంచి జీవితం వుండాలి’ అని కోరుకుంటోంది. ‘నా గురించి ప్రతి ఒక్కరు
తెలుసుకోవాలనుకుంటు న్నాను. నాకు తల్లిదండ్రులు లేరు, పెద్దగా ఆశయాలు కూడా ఏమీ లేవు. ఒక్కటే పెద్ద కల. అది కంబోడియా పిల్లలందరూ చదువుకోవాలి’ అంటోంది. ప్రస్తుతం చెన్‌ 10 డాక్యుమెంటరీలో నటిస్తోంది. ఇందులో అం శం సోకాజీవితమే కావడం తనకు మరింత ఆనందంగా వుందంటోంది.
-హైమ సింగతల
సూర్య దినపత్రిక

సంకుచిత దురాచారాలపై స్వేచ్ఛాస్త్రం రెబెకా

అక్షరాలు నేర్వకపోయినా.. సమాజాన్ని చదివిన రెబెకా.. ఆడవారు సొంత ఆలోచనలు చేయడం కూడా నేరమనే చోట ఓ అధ్యాయానికి తెర తీసింది. మహిళల కోసం ఏకంగా ప్రత్యేక గ్రామాన్ని ఏర్పాటు చేసింది. భూమిని సాధించింది. వ్యాపారం చేసింది. తోటి వారందరికీ జీవనాధారం కల్పించింది. కేవలం అన్నం పెట్టడమే పరిష్కారం అయితే అక్కడితే ఆగిపోయేది ఆమె.. 

కెన్యాలోని సంబురు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దురాచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. అక్కడి మహిళలకు ఎటువంటి హక్కులు వుండవు. వారు మాట్లాడటం కూడా నేరంగా భావించే విచిత్ర ధోరణులు అక్కడ ఎక్కువ. సామాజికంగా ఆర్థికంగా ఎంతో నిరాదరణకు గురవుతూ అక్కడి మహిళలు కేవలం ప్రాణాలతో వున్నాం అని జీవితాలను వెళ్లదీసేవారు. అత్యాచారాలకు గురైన వారిని కాపా డేందుకు అక్కడ ప్రత్యేక చట్టాలు కూడా ఏమీ లేవు.కుటుంబాలు కూడా అటువంటి మహిళలను బయటికి గెంటేసేవి.అటువంటి ప్రాంతంలో పుట్టినా రెబెకా లోలోసోలి విప్లవ భావాలు కలిగిన స్ర్తీగా పెరిగింది.1991లో చోటు చేసుకున్న
సంఘటనలు రెబెకా ను కలచి వేశాయి. 

ఒకే సారి అత్యాచారాలకు బలైన 16 మంది మహిళలను చూసింది. తమ జాతి మహిళలకు సాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఎంతో కష్టపడి అత్యాచారాలకు గురై వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్న మహిళలందరినీ ఒక చోటకి చేర్చే ప్రయత్నం చేసింది. సంబూరులో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించా లని నిర్ణయం తీసుకుంది. కానీ కుటుంబంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.అయినా కూడా బ్రిటీష్‌ సైనికులు చేసిన అత్యాచారాల గురించి మాట్లాడం ప్రారంభించింది. వెంటనే నలుగురు మనుషు లు ఆమె ఇంటికి వచ్చి తీవ్రంగా గాయపరిచారు. వాళ్లు ఆమెపై దాడి చేస్తున్నప్పుడు భర్త పక్కనే వున్నా కూడా ఏమీ మాట్లాడలేదు. వారిని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించ లేదు.ఇదంతా ఆమెకు ఎంతో విచిత్రంగా అనిపించింది. తమ జాతిలోని దురాచారాలు కూడా ఆమెను కలవర పెట్టాయి.


సొంతంగా భూమి లేకపోవడం, ఎటువంటి ఆస్తులు, ఇళ్లు ఏమీ లేకపోవడం, మహిళలకు సొంత జీవితం కూడా వుండకూడదన్న నిబంధనల ను ఎదిరించింది. అత్యాచారాలకు గురైన మహిళలకు కెన్యా ప్రభుత్వం కొం త భూమిని కేటాయించి చేతులు దులుపుకుంది. అది కూడా ఎందుకు ఉప యోగపడనిది. రెబెకా వారందరినీ చేరదీసింది. ఒక గ్రూపుగా వారిని తయా రు చేసింది. జీవనాధారం కల్పించేందుకు కొత్త మార్గాలను అన్వేషించింది. మొత్తం 50 మంది ప్రస్తుతం ఆమె గ్రూపులో వున్నారు. చుట్టు పక్కల మహిళలందరితో మాట్లాడి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే ఆలోచన ను తెలియజేసింది. వాళ్లు తయారుచేసిన పూసలు, అలంకరణ సామ్రాగిని అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంతో జీవనాధారాన్ని కల్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

అలాగే తరువాత వారిని ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించింది. యాత్రికులను ఆకర్షించేందుకు అనేక రకాలుగా ఆ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. గ్రామంలో గృహహింసా బాధితులకు, చిన్న వయసులోనే పెళ్లై బాధలు పడుతున్న వారిని, అత్యాచా రాలకు గురైన వారిని చేరదీసి గ్రామంలో నివాసం ల్పించింది. వాళ్ల కాళ్లపై నిలబడేలా చేసింది. న్యూయార్క్‌కు చెందిన మహిళ డయానె ఫ్రస్టెన్‌బర్గ్‌ 2009లో ఈ గ్రామాన్ని కనుగొని రెబెకాను ప్రపంచానికి పరిచయం చేసింది.చేతివృత్తుల్లో నిపుణులైన మహిళల విషయాలను తెలుసుకునేందు కు ఆమె చేసిన ప్రయత్నంలో ఈ గ్రామం వెలుగు చూసింది. 2010లో డయానె రెబెకాను న్యూయార్క్‌కు ఆహ్వానించింది. 

వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రంగు రంగుల పూసలతో వారు తయారు చేసిన ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు ఎంతగానో ఆదరణ పొందాయి. అప్పటి నుండి ఆ మహిళా గ్రామానికి ఉమోజా అని పేరు వ చ్చింది. దీని అర్థం కలిసికట్టుగా అని. దీనిద్వారా వాళ్లు పొందిన ఆదా యం తో సొంతంగా భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఒక నర్సరీ పాఠశా లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చెప్పుకునేందుకు ఎంతో సులువుగా అనిపించేసినా అంత త్వరగా సాధ్యం కాలేదు.దశాబ్ద కాలం పాటు రెబెకా పోరాడాల్సి వచ్చింది. దీనికి వ్య తిరేకంగా ఆమెపై ఎన్నో దాడులు కూడా జరిగాయి. తెగలోని మగవారు ఆ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఎన్నో కష్టాలకు గురి చేశారు. అలాగే చుట్టు పక్కల గ్రామాల వారు కూడా రెబెకాను అడ్డుకునేందుకు ప్రయత్నించి అడుగడుగునా అడ్డంకులుకల్పించారు. అయినా రెబెకా దేనికీ బయపడలేదు. 

కేవలం వారికి సాధికారత కల్పించి బాధితులకు నీడనివ్వడమే కాదు వారికి రక్షణ కల్పించడం కూడా బాధ్యతని ఆమె తెలుసుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుదే ఏదైనా సాధ్యం అనే ఆలోచనల తో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. క్రమంగా మహిళలపై కొనసాగుతున్న హింస వైపుకు దృష్టి మరల్చింది.దురాచారాలను రూపుమాపేందుకు మహి ళలలో చైతన్యం కల్పించాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా మహిళలను తనవైపుకు మళ్లేలా చేసింది.వారికి వాస్తవాలను వివరిస్తూ.. సొంతంగా బత కడంలోని ఆనందాన్ని, స్వేచ్ఛగా బతకాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.ఇందులో చాలా వరకు ఆమె విజయం సాధించింది కూడా. మహిళల ఆరో గ్యానికి హాని కలిగించే మూడనమ్మకమాలను చాలా వరకు అదుపు చేసింది. 


ఇప్పుడు ఉమెజా గ్రామానికి పూర్తి స్థాయి రక్షణ కూడా కల్పించింది. ఎంతో మంది మహిళలు, బాధితులు ఇప్పుడు ఆ గ్రామానికి చేరుతున్నారు. అలాగే ప్రపంచ నలుమూలల నుండి కూడా గ్రామాన్ని సందర్శిస్తున్నారు. రెబెకా గ్రామాన్ని రూపొందించిన విధానం, అక్కడి మహిళల జీవితాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పాఠశాలలు కూడా వెలుస్తున్నాయి. ఉమెజా గ్రామీణ మహిళలు తయారు చేసిన వస్తువులు, సామాగ్రి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను సంపాదించుకున్నాయి.విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు. సమానత్వం, మహిళా హక్కుల పరిరక్షణను కోరుతూ రెబెకా ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. ప్రదర్శనలు నిర్వహించింది.

రిబెకా స్థానిక స్వచ్ఛంద సంస్థ చాప్టర్‌ ఆఫ్‌ మీన్‌డెలియో యా వానావాకే ఆర్గనైజేషన్‌కు చైర్‌ పర్సన్‌గా కూడా వ్యవహరిస్తోంది. దీనిద్వారా మహిళా సాధికారత కోసం వారికి శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపాధి కల్పనా బాధ్యతలు కూడా సంస్థనే చూసుకుంటుంది. దీని ద్వారా అంతర్జా తీయ స్థాయి కార్యక్రమాలు కూడా రెబెకా నిర్వహించింది. యుఎస్‌, సౌతా ఫ్రికా, యూరోప్‌ వంటి దేశాల్లో పర్యటించింది. సెమినార్లలో పాల్గొంది. ఆఫ్రికా మొత్తం మీద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కుంది. ప్రస్తుతం ఆమె లక్ష్యం కేవలం కెన్యా మహిళలు మాత్రమే కాదు.. సమస్యలతో సతమతమవుతున్న వారందరూ...
-హైమ సింగతల
సూర్య దినపత్రిక, ధీర

అరాచకాలపై విరుచుకుపడ్డ గళం...!

కాంగోలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలపై విరుచుకుపడ్డ గళం చౌచౌ నమెగాబె. రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలను వెలికి తీసింది. తన మైక్రోఫోనే సమాచార సాధనంగా అంతర్జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్లింది. కాంగోలో కేవలం ఒక్క రోజులో 36 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వాస్తవాలను తెలియజేసింది. 

దక్షిణ కివు రాష్ట్రంలోని బుకావులో చౌచౌ నమెగాబె పుట్టింది.చిన్నతనం నుండే ఎంతో ధైర్యంగా మా ట్లాడేది. బెరుకు ఏ మాత్రం కనిపించని మాటలు ఆమెవి.ఏదో సాధించాలనే తపన, కసితో వుండేది.ఇందు కు ఆమె మాట తీరే నిదర్శనం. ఆ లక్షణాలే ఆమెను నేడు ప్రపంచ ప్రభావశీల మహిళల సరసన నిలబెట్టాయి. ఏం చెప్పినా ఆధారాలతో సహా నిరూపించగల ధీరత్వం... కాంగోలో పరిస్థితుల్ని, ప్రజల స్థితి గతుల్ని అం చనా వేయగలిగిన చౌచౌ అట్టడుగు ప్రజల్ని చేరుకునేందుకు వున్న ఏకైక మార్గంగా రేడియోను ఎన్నుకుంది. 1997లో రేడియో మండెలియోలో ప్రజెంటర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. 

స్థానికంగా ఎంతో పేరున్న రేడియో స్టేషన్‌. 1990లలో ఎంతో ఉద్రిక్తతలకు గురవుతున్న పశ్చిమ కాంగో వైపు చౌచౌ తన దృష్టి సారించింది. మైక్రోఫోన్‌ను ఒక ఆయుధంగా మలచుకుని రహస్యంగా అక్కడి కార్య కలాపాలను డాక్యుమెంటరీగా రూపొందించింది. అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెలికి తీసేందుకు ఎంతో కష్టాలను ఎదుర్కొంది. మానవ హక్కులు అక్కడి వారి పాదాలకింద నలిగి పోవడం చూసి కన్నీళ్లు కార్చింది. తమ జాతి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించింది. మానవహక్కుల వాది గా, జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడి అధికారుల స్థాయి, పాలనా విధానాల్లో చోటు చేసుకున్న అవినీతిని కూడా వెలికి తీసి చూపింది.

2003లో చౌచౌ దక్షిణ కివు మహిళా మీడియా అసోసి యేషన్‌ను(ఏఎఫ్‌ఇఎం)ను ప్రారంభించింది. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిం చింది. దీనితోపాటే మహిళా జర్నలిస్టులకు కూడా శిక్షణ అందించింది. ఏఎఫ్‌ఇఎం, రేడియో బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా చౌచౌ ఎంతో వెలుగులోకి వచ్చింది. మహిళా సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సమస్యలపై ఆమె పనిచేసింది. ఆమె కాంగో లోని మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.డిసెంబర్‌ 2007న హా గ్యూ కు ప్రయాణం చేసింది. అంతర్జాతీయ న్యాయ స్థానంలో కివు మహిళా న్యాయంపై పోరాడింది. 2009లో ఆమె ఆక్టర్‌, డైరెక్టర్‌ బెన్‌ అఫ్లెక్‌ రూ పొందించిన డాక్యుమెంటరీ ద్వారా ఆమె గ్లోబ ల్‌ లీడర్‌ షిప్‌ అవార్డు, దాని ద్వారా వచ్చిన లా భాలను పొందింది. వాషింగ్‌టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో ఆమె ఈ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల 
సూర్య దినపత్రిక, ధీర

Thursday, 14 August 2014

అడవిని కాపాడే ఆకుపచ్చని మహిళా దళం...

వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, కుటుంబ పోషణ కోసం పని చేయడం ఇవన్నీ మహిళల సాధారణ జీవనంలో భాగం.. ఉదోగ్యాలు చేసే వారైనా కుటుంబ అవసరాలను చూడక తప్పదు.. కానీ బంగ్లాదేశ్‌ గిరిజన మహిళలు ఇందుకు భిన్నం. పనులన్నీ ముగించిన తరువాత వారో రక్షక దళం..ఆకుపచ్చని చీరలు కట్టుకుని.. తలపై టోపీ.. చేతిలో కర్రలు పట్టుకుని అడవిని ధ్వంసం చేసే వారి భరతం పట్టేందుకు బయల్దేరుతారు... అడవికి హాని కలిగించే వారి మెడలు వంచి పోలీసులకు అప్పజెపుతారు. 

dilwara1ఒక చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అని వ్యాపార ప్రకటన వీరి విషయంలో నిజం అనిపిస్తుంది.ఒకప్పుడు అడవిలో కట్టె లు సేకరించి, అక్కడి జంతువులను వేటాడి తమ జీవనాన్ని సాగించే వీరంతా నేడు దాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తు న్నారు. వేటను విడిచి పెట్టి పశువుల పెంపకం, పాల వ్యాపారం వం టివి చేస్తూ అటవీ ప్రాంతాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యత వహిస్తున్నారు. ఇంకా ఏ కాస్త సమయం దొరికినా తమ తోటి వారికి అడవి వలన కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఇంత చేస్తున్న వీరంతా నిరక్షరాస్యులు..ఆధునిక నాగరికతకు దూరంగా బతుకుతున్న గిరిజన మహిళలు. 

బంగ్లాదేశ్‌లోని దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతో నిండిపోయి వుంటుంది. అనేక రకాల జంతువులు, పక్షులకు ఇవి ఆవాసాలుగా వున్నాయి. ఈ అడవినే జీవనాధారం చేసుకుని అనేక తెగలు కూడా అక్కడికి దగ్గరిలోని పరిసర ప్రాంతాల్లో నివాసం వుంటున్నాయి. అడ వి ఉత్పత్తులను సేకరించడం, వేట, కర్రల సేకరణ వంటివి ఇక్కడి గిరి జనుల నిత్య జీవనంలో భాగం. వీరితో పాటు అడవిలోని పురాతన చెట్లను నరికి అక్రమంగా రవాణా చేసేవారు ఎక్కువయ్యారు. దీంతో క్ర మంగా అటవీ ప్రాంతం తరిగిపోవడాన్ని గమనించిన ప్రభుత్వాలు వాటి రక్షణకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఏదీ ఫలించ లేదు. 

dilwaraచివరికి 2008లో స్థానిక ప్రభుత్వం జర్మనీకి చెందిన జిటిజెడ్‌ (పర్యావరణాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసిన జర్మనీ సంస్థ), అమె రికాకు చెందిన యుఏఎస్‌ఏడి ద్వారా కొత్త పథాకాన్ని ప్రవేశ పెట్టింది. 13 మిలియన్లతో దీనికి శ్రీకారం చుట్టింది. స్థానికుల సూచనల మేరకు గిరిజన మహిళలను ఇందులో భాగస్వాములను చేసింది. అ డవికి రక్షణ కల్పించేందుకు వారే సరైన వారిగా ఎంపిక చేసింది. ఈ ఆలోచన అక్కడి అడవి తీరునే మార్చేసింది. దీనితోపాటే మహిళల అభివృద్ధికి కూడా చేయూత నిచ్చింది. 

రక్షక దళ అవతరణ...
ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత అక్కడి మహిళలంతా కలి సి ఆకుపచ్చని చీరలు కట్టుకుని..చేతిలో కర్రలు తీసుకుని అడవిలో కలియ తిరుగుతారు. అడవికి నష్టం కలిగించే వారిని ఎదిరించి పోరా డతారు. మూడేళ్లుగా తమతోపాటు అడవిలో నిత్యం తిరుగుతు న్న ఈ మహిళలను అక్క డి చెట్లు కూడా గుర్తిం చినట్లే ప్రవర్తి స్తాయని రక్షక దళంలోని మహి ళలు చెబుతున్నారు. ‘అడవి రక్షకులుగా’ పేరు పొందిన ఈ చీ రల స్వ్కాడ్‌ అడవిలో రేంజర్లతో పాటు కలిసి మొత్తం అడవిని కాపా డుకుంటున్నారు.

jungleసదన్‌ అడవుల్లోని కొండల్లో చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్లు తమ అడవికి ఎటువంటి హానీ కలిగించ కండి అంటూ విన్న విస్తున్నారు. ఈ దళం అడవికి కాపలా కాయడం మొదలు పెట్టిన తరువాత అక్కడ చెట్లు నరకడం చాలా వరకు తగ్గి పో యింది. అనేక వణ్యప్రాణులు కొత్తగా అడవికి చేరుతున్నాయి. ఇప్పు డు అంతా పచ్చగా కళకలలాడుతోంది.ఏనుగులు, కోతులు, జింకల రక్షణకు ప్రత్యేక స్థావరాలు కూడా ఏర్పాటు చేశారు.దీనితో పాటే త మ ప్రాంతాలను వన్య మృగాల నుండి కాపాడుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు తమ ప్రాంతాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేయకుండా వాటిని ఓ ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసి వా టికి ఆహార వసతులను కల్పిస్తున్నారు. దీనికి ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఇది విజయవంతం కావడంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

ప్రత్యామ్నాయ జీవనాధారం వైపు...
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే మహిళలకు ప్రభుత్వం ప్రత్యా మ్నాయ సదుపాయాలను కల్పించింది.పాడి, పశువుల పెంపకం, కో ళ్ల ఫారం వంటివి ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అంది స్తోంది. వీరి శ్రమకు 50 డాలర్లను అందిస్తోంది. ఇది నామమాత్రం అయినప్పటికీ అక్కడి మహిళలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా రు. ఏ కాస్త సమయం దొరికినా తోటి వారికి కూడా అడవిలో వేటా డటం వంటివి మానుకొమ్మని చెబుతున్నారు. కలిగే లాభాలను వివరి స్తున్నారు. అలా ముందుకొచ్చిన వారికి ఉపాధి కల్పించాలని ప్రభు త్వానికి విన్నవిస్తున్నారు. రోజ్‌గార్‌ యోజనా వంటి పథకాల ద్వారా ఇప్పటి వరకు ఇలాంటి వారెందరికో ఉపాధి కల్పించేలా చేశారు. 

మేమంటే వారికి భయం... 
jungle1‘మేము ఆకుపచ్చని చీరలు కట్టుకుని అడవిలో తిరుగు తుంటే చాలా మంది మమ్మ ల్ని చూసి భయపడుతున్నా రు. దాక్కుంటున్నారు. కాని అక్కడి ఆనుపానులన్నీ తెలి సిన మాకు వాళ్లని పట్టుకో వడం చిటికెలో పని. అందు కే ఎక్కువగా ఇప్పుడు చెట్ల ను నరికేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని రక్షకదళం సభ్యురాలు దిల్వారా చెబుతోంది. 

ఇంకా చేయాల్సింది చాలా వుంది..
ఇక్కడి తెగకు నాయకత్వం వహించే అమిన్‌ ఖాన్‌ ఒక ప్పుడు జీవన భృతి కోసం అడవిలో వేటాడేవాడు.దా నిద్వారా వచ్చే దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు మహిళలను చూసి ఆయన కూడా మారి పోయాడు. ప్రభుత్వానికి సాయం చేస్తున్నాడు. అడవి రక్షణలో తన వంతుగా ఇతరులకు వివరిస్తున్నాడు.‘ప్రభుత్వం ఏదై నా ప్రత్యామ్నాయం కల్పించినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది.ఇప్పుడు అదే జరిగింది. దీని కన్నా ముందు చాలా పథకాలు తెచ్చారు కానీ అవేవీ ఫలితాల నివ్వ లేదు. ఏ ప్రాంతం అభివృ ద్ధి చెందాలన్నా అక్కడి స్థాని కులను భాగస్వాములను చేసుకుంటేనే ఫలితం దొరు కుతుంది అనేదిప్పు డు రుజు వయ్యింది. దీని తోపాటే అడ విని తిరిగి పెం చేందుకు కూ డా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అంటున్నారు.

ఇది మా అదృష్టం...
dilwara2‘ప్రభుత్వం మమ్మల్ని భాగస్మాలను చేసుకోవడం మా అదృష్టం. అడ విని కాపాడుకుంటేనే మా జాతిని కూడా కాపాడుకోగలం. లేదంటే అడవితో పాటే మా తెగ కూడా అంతరించి పోయేది. మా పిల్లల కోసం కూడా మేము ఇప్పుడు ఈ పని చేస్తున్నాం. ఇది వరకు ఇక్కడ పాఠశాలలు ఏవీ లేవు. కానీ మా పిల్లలు వెళ్తున్నారు’ అని మహిళా దళ సభ్యురాలు హోసనేరా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

అడవిని విస్తరించే ప్రయత్నం...
ప్రస్తుతం అడవి మొత్తం 77 కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. దీన్ని కాపాడటంతో పాటు కొత్తగా చెట్లను నాటేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. దీనికి కూడా మహిళల భాగస్వామ్యాన్నే కోరింది. 70 శాతం రక్షణకు 30 శాతం తిరిగి ఆడవిని పెంచేందుకు కేటాయి స్తున్నారు. పక్షి జాతులను, జంతుజాలాన్ని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అన్ని పనుల్లోనూ మహిళలదే భాగ స్వామ్యం. వారి రాకతోనే తమ పథకాలన్నీ వాస్తవ రూపం దాల్చుతు న్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. చెట్లను తిరిగి నాటే ప్రయత్నంలో వారు మహిళల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు. 


- హైమ సింగతల
March 16, 2011

స్థాయికి తగు ఎంపిక..!

ఇప్పటి కాలానికి తగిన విధంగా కనిపించాలంటే మహిళలు కొన్ని నియమాలను పాటించాల్సి వుంటుంది. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు తమ స్థాయికి తగిన విధంగా హుందాగా కనిపించేందుకు కూడా చిన్న పాటి జాగ్రత్తలు తప్పనిసరి. ఆభరణాలు, వస్త్రాలు.. చెప్పులు వంటివన్నీ తగినవి ఎంపిక చేసుకోవాలి.

bagప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకమైన స్టైల్‌ లేదా అలవాటు వుండనే వుంటుంది. వస్త్రాల ఎంపికలో, లేదా మ్యాచింగ్‌ యాక్ససరీ్‌ స్‌ను సెలక్ట్‌ చేసుకోవడంలో, అందంగా రెడీ అవ్వడంలో ఇలా ఎవరి ప్రత్యేకత వారిదే. అలా అని ఎప్పుడూ ఒకే విధంగా తయారవుతుంటే కొంతకాలానికి చూసే వారికి.. ఫాలో అయ్యే వారికీ బోర్‌ కొడుతుంది. కాబట్టి సందర్భానికి తగిన విధంగా తయారవ్వాలి.ఏదైనా ప్రత్యేక సమయం, సందర్భం లేదా సా యంత్రం పార్టీ అయితే కాస్త డిఫరెంట్‌గా రెడీ అయితే అందరి దృష్టిలోనూ ప్రత్యేకంగా వుం డొచ్చు. దీనికోసం కొంచెం హోం వర్క్‌ చేయా ల్సి వుంటుంది. అలాగే దీనితో పాటుప్రస్తుతం ఎండాకాలం.. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకో వాలి. తగిన రంగులు, షేడ్స్‌, వాటిలోనూ సరైన వస్తువుల ఎంపిక వుండాలి. కనిపించేలా ఆభరణాలు.. రోజూ చిన్న చిన్న నగలను, వస్తువులను వేసుకునే అలవాటు వుంటే ఆ స్టైల్‌ కాస్త మార్చి కొంచెం పెద్దగా వుండే నగలు వేసుకోవాలి. అలా అని మరీ బో ల్డ్‌ లుక్‌ వుండేలాంటివి ఎంచుకోరాదు. వీటికి జతగా సన్నటి గాజులు మ్యాచింగ్‌వి ఎంచు కోవాలి. ‘ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువ నగలను వేసుకునేందుకు ఇష్టపడరు. అది బాగుండదు కూడా. అలాంటి వారు ఎంతో ఆలోచించి మరీ ఎంపిక చేసుకోవాలి. ఆఫీసు లో అందరికన్నా కాస్త ఉన్నత స్థాయిలో వున్న వారు వారికి తగిన విధంగా కాస్త పెద్ద ఆభర ణాలను ఎంపిక చేసుకోవాలి. అవి కూడా రో జూ వేసుకునేవాటికి అనువుగా వుండాలి. చెవి దిద్దులు కూడా భిన్నమైన డిజైన్‌ వుంటే కాస్త గ్రాండ్‌ లుక్‌ వస్తుంది. హుందాగా వుంటుంది.

jewel1అలా అని మరీ వేలాడే జూకాలు వంటివి బాగో వు’ అని ఆభరణాల డిజైనర్‌ మీరా చెబుతు న్నారు. టీమ్‌ లీడర్‌ వంటి హోదాల్లో వున్నవారి కి కాస్త బోల్డ్‌ నగల ఎంపిక సరైన నిర్ణయం అవుతుంది. రంగుల మాయా జాలం... రంగులలో ఎన్నో విశేషాలు దాగి వుంటాయి. అవి చెప్పకనే ఎన్నో విషయాలను ఎదుటి వారికి తెలియజేస్తాయి. ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ముదురు రంగుల్లో మెరిసే క్లచ్‌ చేతిలో వుంటే ఇక అందరి దృష్టి అటువైపుకే వెళ్లిపోతుంది. ఇదే విషయం పని చేసే చోట కూడా వర్తింప చేసుకోవచ్చు. ప్రసు ్తతం ఈ సీజన్‌కు తగిన విధంగా కాస్త ముదురు రంగులను ఎంపిక చేసుకుంటే చాలా బాగుం టుంది. హ్యాండ్‌ బ్యాగ్స్‌, క్లచ్‌లు కూడా ఇలా వుండేలా చూడాలి. వీటికి యా నిమల్‌ టెక్సర్స్‌ వుంటే ఎంతో బాగుంటుంది. ఎరుపు, ఆకుప చ్చ రంగులలో అయితే బ్యాగు లు మరింత ఆకర్షణీయంగా వుంటాయి. బ్యాగులపై ఇప్పుడు మంచి మంచి మెసేజ్‌ కూడా వుండేవి వస్తున్నా యి. ఎవరి తత్వానికి తగిన విధంగా స్లో గన్స్‌ వున్నవి ఎంచుకుంటే ట్రెండీ లుక్‌ సోంతం చే సుకోవచ్చు. ఎండాకాలానికి తగిన విధంగా సా ఫ్ట్‌ రంగులను ఎంపిక చేసుకోవాలి. అలాగే ప్లె యిన్‌షేడ్స్‌ వున్నవి కూడా బాగా హైలెట్‌ అవు తాయి. 

SMHEELSసమయాన్ని బంధిస్తూ... ఇప్పటి ట్రెండ్‌ అంతా పెద్ద పెద్ద వాచ్‌లదే. అందుకే కాలానికి తగిన విధంగా అందమైన పెద్ద వాచీని పెట్టు కుంటే బాగుంటుంది. ‘ధరించే వాచ్‌ డయల్‌, రంగు, వాటి ఆకారాన్ని బట్టి మైండ్‌ సెట్‌ను కూ డా అంచనా వేసే రోజులివి. ఎవరైతే సరైన నిర్ణ యాలు తీసుకోగలరో వారు సాధారణంగా సా దాసీదాగా వుండే డిజైన్లను ఇష్టపడరు. వీరు ఎక్కువగా క్లాసిక్‌ రౌండ్‌ షేప్‌ని ఇష్టపడతారు. కానీ సాయంత్రం వేళ, లేదా ఏదైనా పార్టీకి వెళ్లేప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం బాగోదు. ఈ సమయాల్లో మాత్రం కాస్త కలర్‌ఫుల్‌గా వుండేవి బాగుంటాయి. వాటిలోనూ డెలికేట్‌గా వున్నా ఖరీదైన వాటిలా వుంటాయి’ అని టైమె క్స్‌ గ్రూప్‌ వాచ్‌ కంపెనీకి చెందిన తరుణ్‌ తిల్లాని చెబుతున్నారు. 

పేద్ద... హీల్‌.... హైహీల్స్‌ వల్ల నష్టాలు ఎన్ను న్నా.. నేటి అమ్మాయిలు వీటికే తమ ఓటు వేస్తున్నారు. తమ అందానికి మరికొంచెం అద నంగా చేర్చుకోవడం అంటే వారికి ఎంతో ఇష్టం కాబట్టే ఈ హై హీల్స్‌ను ఇష్టపడుతున్నా రని ఫ్యాషన్‌ ప్రియులు అంటున్నారు. అలా అ ని వేటిని పడితే వాటిని ఎంపిక చేసుకుంటే అదనపు అందానికి బదులు వికారంగా కనిపిం చే అవకాశం వుంది. ఇక సీజనల్‌గా అయితే వ ెడ్జ్‌, పాయింటెడ్‌, బ్లాక్‌, బెల్లీస్‌ డిజైన్లు ఇప్పుడు బాగుంటాయి. వీటిలోనూ సహజసిద్ధంగా వుం డే షేడ్స్‌, రంగులు బాగా నప్పుతాయి. పైగా హైహీల్స్‌ వేసుకునే మహిళల్లో కాస్త ఆత్మవి శ్వాసం కూడా ఎక్కువే అని ఇటీవల కొన్ని సర్వేల్లోనూ తేలింది. 
- హైమ సింగతల
surya telugu daily, March 15, 2011