Search This Blog

Monday 11 August 2014

వీరి పయనం.. ఓ సంచలనం.. !

భారతీయ మహిళలు కేవలం ఇంటి పనికి, తమ ఉద్యోగానికి, డబ్బు సంపాదనకు మాత్రమే పరిమితం అయిపోతారు అనే మాటలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. విధి నిర్వహణలోనే కాదు.. తమ పాషన్‌కి తగిన విధంగా కెరియర్‌ను మలచుకుని విజయాలు సాధించడంలోనూ వారూ ముందే వుంటారు. అటువంటి ధీరలే ఈ ఇరువురు మహిళలు. ఒకరు డీజేగా వుర్రూతలూగిస్తుంటే మరొకరు రగ్బీలో రఫ్ఫాడిస్తున్నారు. భిన్న రంగాల్లో అడుగిడి సత్తా చాటుకుంటున్నారు.


రగ్బీ క్రీడాకారిణి : unusual_career_avanisabadeమగవారి ఆటగా ముందుకొచ్చిన రబ్బీ ఎక్కువ కాలం ఆ పేరును నిలుపుకోలేకపోయింది. రగ్బీ నేర్చుకోవడం ఆడటం మాత్రమే కాదు.. మొదటి భారతీయ మహిళా రగ్బీ టీమ్‌ కెప్టెన్‌గా మారి చరిత్ర సృష్టించింది అవని సబాడే. పాఠశాల విద్య అనంతరం ఫుట్‌ బాల్‌ నేర్చుకునేందుకు ఖేర్స్‌ అకాడమీకి వెళ్ళిన ఆమె అక్కడ రగ్బీ ఆటకు ఆకర్షితురాలైంది. ఫుట్‌బాల్‌తోపాటే రగ్బీని కూడా చేర్చుకుంది. ప్రస్తుతం ఆమె 13 మంది క్రీడాకారిణుల రగ్బీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు పెద్దగా ప్రచారం లేని ఈ ఆటకు వీరు మరింత పేరు తేవాలని క్రీడాప్రియులు కోరుకుంటున్నారు.

ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ :
unusual_career_djmafaizaఆమె ఓ మామూలు సాధారణ డిస్క్‌ జాకీ కాదు. ఎలక్ట్రానిక్‌ డాన్స్‌ మ్యూజిక్‌ రారాణి, డిజె మా ఫైజా. పూణేలో స్థిరపడిన ఈ అమ్మాయి తన సంగీతంతో అలా అరెస్టు చేసేస్తుంది. ఎక్కడికి అక్కడే నిలిచిపోయేలా మంత్రం వేసేస్తుంది. తన స్టైలిష్‌ మ్యూజిక్‌తో వుర్రూతలూగిస్తుంది. మన నగరాలకు ఇంకా అంతగా వ్యాపించని ఈ ఎలక్ట్రానిక్‌ డాన్స్‌ మ్యూజిక్‌లో ప్రయోగాల స్థాయికి చేరుకుంది. అక్కడికి వచ్చే యువత తప్పనిసరిగా ఆమె ప్లే చేసే మ్యూజిక్‌ గురించి తెలుసుకోవాల్సిందే. వినూత్న బీట్స్‌ని మిక్స్‌ చేసి అందించే సంగీతానికి స్టెప్‌ వేయలేని వారు కూడా ఉత్సాహంగా గెంతులేస్తారు. మిగిలిన డీజేలంతా ఆమె సలహాలు కోరుతుంటారు. డీజేగా ఓ కొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఫైజా మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశిద్దాం.


-హైమ సింగతల
Surya telugu daily, March 12, 2011

No comments:

Post a Comment