Search This Blog

Thursday 5 June 2014

పుస్తకాలే ఆమె చిరునామా...!

బహుముఖ ప్రజ్ఞాశాలి, సమకాలీన రచయిత్రి, యువ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌.. కవయిత్రి చిత్రాలీలె.అరుదైన రికార్డులను సృష్టిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఇప్పటి వరకు తన పుస్తకాలు, కళలు వంటి వాటి ద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న ఆమె ‘ఆర్గనైజేషనల్‌ డెమెక్రసీ :కొలాబరేటివ్‌ టీమ్‌ కల్చర్‌ : కీ టు కార్పొరేట్‌ గ్రోత్‌’ అనే పుస్తకం ద్వారా మరోసారి రికార్డును సృష్టించారు. ప్రపంచంలోని బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాల రచయితలుగా వున్న 100 మందిలో స్థానం దక్కించుకున్నారు. కేవలం 18 నెలల కాలంలో తొమ్మిది పుస్తకాలను రచించి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నారు.

chitra-leelaమేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెంట్‌, రచయిత, కవ యిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్న చిత్రాలీలె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ పట్ట భద్రురాలు. ఆమె వ్యాసాలు, ఉత్పత్తులు, ఉప న్యాసాల ద్వారా ఎంతో మంది జీవితాలను మార్చేశారు.ఎంతో సులువుగా విషయాన్ని చెప్ప గలగడం, ఎదుటి వారిని ఆకట్టుకునేలా విపు లీకరించడం ఆమె రచనల్లోని ప్రత్యేకత. దీని ద్వారానే ఆమె ఎంతో మంది పుస్తకాభిమానులను సంపాదించుకున్నారు. 

మేనేజ్‌మెంట్‌ రంగంలో వున్నవారికి చిత్ర పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్‌గా ఆమె అందించిన అందిస్తు న్న పుస్తకాలు ఎంతోమంది యువ వ్యాపారవేత్తలను తీర్చిదిద్దుతున్నాయి. సరైన మార్గాన్ని నిర్దేశించడంలో ముందుంటున్నాయి. ఇటీ వల ఆమె రచించిన ‘ఆర్గనైజేషనల్‌ డెమెక్రసీ: కొలాబరేటివ్‌ టీమ్‌ కల్చర్‌ : కీటు కార్పొరేట్‌ గ్రోత్‌’ పుస్తకం ఢిల్లీ నుండి దుబాయ్‌ వరకు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తోంది. ప్రపంచంలో ఎక్కువగా పుస్తకాలు అమ్ము డుపోయే వందమంది రచయితల విభాగంలో ఆమెకు స్థానం కల్పిం చింది. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’గా చిత్రకు రికార్డును అందేలా చేసింది. 

అరుదైన పుస్తక రచనలు : 
చిత్రా లీలె సెప్టెంబర్‌ 2008 నుండి ఫిబ్రవరి 2010 వరకు కేవలం 18 నెలల కాలంలో 9 పుస్తకా లను పూర్తి చేశారు. అవి కూడా విభిన్న రంగాలకు చెందినవి.ఆమె రాసిన వాటిలో మేనేజ్‌మెంట్‌, సెల్ఫ్‌హెల్ప్‌, కవితలు, కంప్యూటర్‌ సైన్స్‌, ఫాంటసీ వంటి వాటిలో గొప్ప రచనలుగా పేరు పొందాయి. ఈ పుస్తకాలన్నిటిలో ఆమె మొత్తంగా 3,33,000 పదాలను వుపయోగించారు. 

chitra-leela1ఆమె కొత్తగా రాసిన ఆర్గనైజేషనల్‌ డెమోక్రసీ పుస్తకం సమాజంలో, వ్యక్తులకు సంబంధించి అనుకూల భావాలను రేకెత్తించేలా రచనను చేసింది. ఆమె చేసిన ఈ రచన బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ గురువులైన మార్క్‌ సోబాల్‌, మార్షల్‌ గోల్డ్‌ స్మిత్‌ వంటి పుస్తకాలతో పోటీ పడింది. మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రపంచ ప్రఖ్యాత రచయిత జాక్‌ జి గాన్‌ మాట్లాడుతూ ‘చిత్రాలీలె పుస్తకాలలో చెప్పే విధానం బాగుంటుంది.అంశాన్ని ఒక నవలలా ఎంతో వివరణాత్మ కంగా వివరిస్తారు. ఒక టీమ్‌ ఏర్పాటు నుండి, అందులోని వ్యక్తులు, కలుపుకుపోవాల్సిన విధా నాలు, అన్నిటినీ సమతూకం చేసుకునే విధానం వంటి అంశాలను బాగా ప్రజెంట్‌ చేశారు. ఉపయోగకరమైన ప్రమాణాలను వివరించారు. వాటికి సరైన ఉదాహరణలను కూడా జత చేశారు. వీటన్ని టివల్లే ఆ మె పుస్తకాలు ఆదరణ పొందగలుగుతు న్నాయి’ అని చెబుతున్నారు. 

తనదైన ప్రతిభ : 
chitraleela2ఒక పద్ధతి ప్రకారం అంశాలను వివరించడం అనేది అందరికీ వీలయ్యే విషయం కాదు. అందులోనూ వ్యా పార సంబంధిత అంశాలలో మరింత క్లిష్టం గా వుంటుంది. ఇక మేనేజ్‌మెంట్‌కు సంబం దించి ఎన్ని అంశాలను చెప్పినా ఇంకా అం దులో కొన్ని విభాగాలు మిగిలిపోతూనే వుం టాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుం టూ చిత్ర చేసే రచనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి. ప్రపంచ గొప్ప గొప్ప రచయితల పుస్తకాలతో పాటు చిత్రాలీలే పుస్తకాలు కూడా ఎక్కువగా వినియోగంలో వుంటున్నాయి అని ప్రముఖ రచయితలు చెబుతున్నారు. నేడు ఆమె పుస్త కాలు ప్రపంచం నలుమూలలకూ వ్యాపిస్తున్నాయి.వలం వ్యాపార దృక్పథం, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి మాత్రమే కాదు ఒక సామాన్యుడికి కూడా అన్వయిం చుకునేలా ఆమె అంశాలను తన పుస్తకాలలో వివ రించారు. అభివృద్ధి, పురోగమనం, ఉన్నత ప్రమా ణాలను పాటిచండం వంటి అంశాలను ఆమె ఎం తో వివరణా త్మకంగా తెలియజేస్తున్నారు.

కళారంగ ప్రతిభ : 
కళా రంగంలోనూ చిత్రది అరుదైన ప్రతిభ. సాంస్కృతిక, కళారంగాలు, సాహి త్యం, విద్య వంటి అనేక రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను ‘ప్రత్యేకమైన లీడర్‌షిప్‌ అవార్డ్‌ - 2011’ను కూడా అందుకున్నారు.విద్యా, కళా రంగాల్లో ఆమె చేసిన కృషికి దీన్ని అందుకున్నారు. ఆమె రాసిన పుస్తకం ‘ది 6 స్పేర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ : అన్‌లా కింగ్‌ ది డోర్‌ టు సక్సెస్‌ అండ్‌ హ్యాపీనెస్‌’కు ఆమె లిమ్కాబుక్‌ ఆప్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. 

2011 సంవత్సరానికి గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు - 2011 ఎడిషన్‌ అవార్డును అందుకున్నారు.లీటరసీ, పీస్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, సోషల్‌ విభాగాల్లో ఎన్నో వందల కొద్దీ అవార్డులు ఆమె సొంతం చేసు కున్నారు. పెయింటింగ్స్‌, అరు దైన కళా కండాలను రూపొందించడం వంటి వాటిలోనూ చిత్ర ముందే వుం టారు. ఎన్నో ఎగ్జిబి షన్లను కూడా నిర్వ హించారు.ఆమె సొంతంగా డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు.చిత్రా లీలె.కామ్‌ పేరుతో ఆమె ఓ సైట్‌ను కూ డా నిర్వహిస్తు న్నారు.
-హైమ సింగతల
surya telugu daily, March 22, 2011

Wednesday 4 June 2014

సముద్రంపెై అద్భుత నగరం

జపాన్‌లో భూభాగం పూర్తిగా ఖాళీ అయిపోయిందో.. లేక అక్కడి ప్రజలకు భూమిపెై నివసించడం బోర్‌ కొట్టేసిందో.. ఏమో వాళ్లు ఏకంగా సముద్రంపెై పడ్డారు. సముద్రంపెై అందమైన భవంతులను నెలకొల్పేందు వారు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు. నీటిపెై తేలియాడే ఆకాశహర్మ్యాలకు చకా చకా ప్లాన్లు వేసేస్తున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ ఈ సన్నాహాలు కూడా చేసేసింది.
americascup
పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ’కార్బన్‌-న్యూట్రల్‌’ నగరాలను నిర్మించాలని జపాన్‌లోని షిముజ సంస్థ వారు నిశ్చయించారు. దీనికి ’గ్రీన్‌ ఫ్లోట్‌’ కాన్సెప్ట్‌ అని పేరు కూడా పెట్టేశారు.ఈ విధానంలో ఒక్కోటి చదరపు కిలోమీటరు వెశాల్యం ఉన్న విభాగాలను బోలెడన్నింటి నిర్మించి వాటిని ఒక కేంద్రక టవర్‌కు అనుసంధానిస్తారు. అలా అది ఒక పెద్ద నగరంగా తయారవుతుంది.
ఇక్కడ నిర్మించే ఇళ్లన్నీ నీటిపెై తేలుతూ ఉంటాయి.ఇలా నిర్మించిన విభాగాలలో.. ఒక్కొక్క విభాగానికి గానూ 10,000 నుంచి 50,000 మంది మనుషులు నివసించవచ్చు. అంతే కాదండోయ్‌.. భూమి మీద మాదిరిగానే ఈ విభాగాల్లో చెట్లు, చిన్న చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు. కేంద్రక టవర్‌ చుట్టూ.. ఆ ప్రాంతంలో నివసిం చేవారికి అవసరమెన ఆహారం ఉత్పత్తి చేసేం దుకు పొలాలు, అడవు లు, పశువులు కూడా ఉంటాయి.
సాధ్యమేనా…
వినడానికి బాగానే ఉంది కానీ.. అసలు ఇది సాధ్య మేనా..? ఇలాంటి కట్టడాలను సముద్రంలో తేలియాడేలా నిర్మించాలని షిముజు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ కట్టడాలను నిర్మించేటపుడు అలాగే వాటిని మనుషులు ఉపయోగించే సమయంలోనూ.. ఎక్కడా పర్యావరణానికి హాని కలగని రీతిలో నిపుణులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కట్టడాలకు ఉపయోగించే లోహాలను కూడా సముద్రం నుంచే తయారు చేయడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.
సముద్ర జలాల్లో లభించే మెగ్నీషియంను తీసి దానితోనే నీళ్ల మీద తేలే ఓడల్లాంటి భవనాలను నిర్మిస్తారట. షిముజు సంస్థ నిపుణుల ప్రకారం.. ఇలాంటి ప్రదేశాల్లో నివసిస్తే పర్యావరణానికి హాని కలిగించే కార్బన్‌ వాయువుల విడుదలను 40 శాతం మేరకు తగ్గించొచ్చు. ఏమెనా వ్యర్థాలుంటే వాటితోనూ ద్వీపాలను తయారు చేసి సముద్రాల్లో భవనాలను నిర్మించేస్తామని చెబుతున్నారు.
తుఫాన్లు వస్తే…
future_architecture1అంతా బానే వుంది కానీ.. సముద్రుడు ఎప్పడు ప్రశాంతంగా ఉంటాడో..ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు. ప్రశాంతగా ఉన్నంత సేపు ప్రమాదం లేదు కానీ.. కోపం వచ్చి విజృంభించి ఏ సునామీనో సృష్టించాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి..? అలాంటి భయం ఏం అక్కర్లేదంటున్నారు నిపుణులు.అందుకు జలహర్మ్యాల్లో బయటి వెైపు ఎలాస్టిక్‌ పొరలను ఏర్పాటు చేస్తారట. అవి సముద్ర మట్టానికి 30 అడుగుల ఎత్తులో ఉంటాయి కాబట్టి లోపలి వారిని అలలే మీ చేయలేవని ఎంచక్కా భరోసా ఇచ్చేస్తున్నారు. తుఫాన్‌, వర్షాల సమయంలో పిడుగుపాటు నుంచి కాపాడుకోవడానికి లెట్నింగ్‌ కండక్టర్లు కూడా వీటిలో ఉంటాయట.
జపాన్‌లో జరిగిన యూనివర్సిటీల సమావేశంలో షిముజు సంస్థ తమ ఊహాచిత్రాలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందింది. మరి ఇది వాస్తవ రూపం దాల్చుతుందో.. లేక ఊహాగానాలుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే.. మరి. ఏదేమైనా ఈ ఆలోచన మాత్రం అద్భుతం కదా… పెై పెచ్చు అక్కడ నివసించడానికి కొంచెం గుండె ధెైర్యం కూడా కావాలి సుమా..!!
-హైమ సింగతల
Surya Telugu Daily

Sunday 1 June 2014

బిల్లు తెలివి

b-storyఅనగనగా ఒక అడవిలో మూడు చిన్న పందులు వుండేవి. వాటిపేర్లు రాబీ, హనీ, బిల్లు.. అక్కడ మందలో కలిసి పోయి హాయిగా వుండేవి. కానీ ఒక రోజు అవి వుంటున్న ఫా రం నుండి బయటికి రావాలని నిర్ణయించుకున్నాయి. హాయి గా ఇళ్లు కట్టుకుని ఎంచక్కా గడపాలని వాటికి ఆశ. అలాగే సాహసాలు కూడా చేయాలని వాటికి ఎంతో ఇష్టం. మూడు మంద నుండి విడిపోయి దేని దారిన అవి బయల్దేరాయి. రాబీ తన దారిన తాను వెళ్తూంటే దానికి ఒక మనిషి కన్పిం చాడు. అతని దగ్గరికి వెళ్లి ఇళ్లు కట్టుకోవడానికి ఏమైనా వుంటే ఇవ్వండి అని అడిగింది. అతను దానికి పెద్ద పెద్ద అట్ట ముక్క లను ఇచ్చాడు. చిన్నారి రాబీ వాటిని తీసుకుని వెళ్లి అందమైన ఇల్లు కట్టుకుంది. దాని ఇంటికి దగ్గరలోనే ఒక చెడ్డ నక్క నివసి స్తోంది. నక్క ఒకసారి అటువైపుగా వచ్చినప్పుడు రాబిని చూ సింది. ఎలాగైనా సరే రాబీని తినాలని పథకం వేసింది. దాని ఇంటి దగ్గరికి వచ్చి ‘రాబీ.. నేను మీ ఇంటిని చూస్తాను. నన్ను లోపలికి రానివ్వు’ అని అడిగింది. అప్పుడు రాబీ భయపడి.. ‘నా ఇల్లు చాలా చిన్న ది. నిన్ను లోపలికి రానివ్వలేను. ఇక్కడి నుండి వెళ్లిపో’ అంది. అప్పుడు నక్కకు చాలా కోపం వచ్చింది.

‘సరే అయితే నేను నీ ఇంటిని పడగొట్టేస్తాను చూడు’ అంటూ..
నోటితో గట్టిగా గాలిని వూదడం ప్రారంభించింది. అలా కొద్ది సేపటికే రాబీ ఇళ్లు పడిపోయింది. నక్క లోపలికి వెళ్లి రాబీని తినేసింది.
హనీ కూడా రాబీ వెళ్లిన వైపుగా నడుచుకుంటూ వచ్చింది. ఆ దారిలో దానికి ఒక మనిషి కర్రలను తీసుకెళ్తూ కనిపించాడు. హనీ అతని దగ్గరికి వెళ్ళి తనకు ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేయగలరా? అని అడిగింది.
అందుకు అతను ‘దానిదేముంది. నీకు కావలసినన్ని కర్రలు తీ సుకో’ అని ఒక పెద్ద కర్రల మోపును ఇచ్చాడు. వెంటనే హనీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని తీసుకెళ్లి ఇళ్ల్లు కట్టేసుకుంది.
తరువాతి రోజు సాయంత్రం చెడ్డ నక్క మళ్లీ వచ్చింది.

b-story1‘ఆహా..! ఇక్కడికి హనీ కూడా వచ్చేసిందన్న మాట. దీన్ని కూడా ఎలాగైనా తినేయాలి’ అని పథకం వేసింది. ఇది వరకటిలాగానే ఇంటి ముందుకు వెళ్ళి హనీని బయటికి రమ్మని పిలిచింది. హనీ రాలేదు. ‘నా ఇల్లు చాలా చిన్నది నువ్వు వస్తే పడిపో తుంది. ప్లీజ్‌ వెళ్లిపో అని అంది’ వెంటనే నక్క గట్టిగా అరిచింది. ‘సరే అయితే నీ ఇంటిని ఏం చేస్తానో చూడు’ అంటూ గట్టిగా నోటితో వూదడం ప్రారంభించింది. కొంత సేపటికి ఇళ్లు పడిపోయింది. హనీని కూడా నక్క తినేసింది. ఇక మిగిలింది బిల్లు. అది వెళ్తున్న దారిలో ఒక మనిషి కనిపించాడు. అతని దగ్గర కొన్ని ఇటు కలు వున్నాయి. అతని దగ్గరికి వెళ్లి ‘సర్‌ నాకు కొన్ని ఇటుకలు ఇవ్వండి. నేను ఇల్లు కట్టుకుం టాను’ అని అడిగింది. అందుకు అతను ఒప్పు కున్నాడు. ఇటుకలు ఇచ్చాడు. వాటితో బిల్లు వెంటనే ఇల్లు కట్టేసుకుంది. దానికి సిమెంటు కూడా వేసింది.

ఆ చెడ్డ నక్క బిల్లు ఇంటిని కూడా చూసేసింది. బిల్లు ఇంటి ముందుకు వెళ్ళి ‘నన్ను మీ ఇంట్లోకి రానివ్వు ఒక సారి చూస్తా ను. చాలా అందంగా వుంది మీ ఇళ్లు’ అని అడిగింది. అందుకు బిల్లు ‘నా ఇల్లు చాలా చిన్నది నువ్వు ఇందులో పట్టవు. ముందు వెళ్లిపో’ అంది.

నక్కకు కోపం వచ్చి ‘నేను నీ ఇల్లు పడగొట్టి నిన్ను చంపి తిం టాను చూడు’ అని వూదడం ప్రారంభించింది. ఎంత సేపు అలా చేసినా కూడా ఫలితం లేదు. బిల్లు ఇంటికి ఏం కాలేదు. ఇటు కలతో కట్టడం వల్ల అది గట్టిగా వుంది. విసుగొచ్చిన నక్క ఏం చేయాలో తెలియక వెళ్లిపోయింది. ఒక మంచి ప్లాన్‌ వేసుకుని బిల్లు ఇంటి దగ్గరికి వెళ్లింది. కిటికీ దగ్గర నించోని ‘ఇక్కడికి దగ్గరలో ఒక పొలం వుంది. అక్కడ ఎంతో మంచి రుచిగల దుంపలు దొరుకుతాయి. నువ్వు వస్తానంటే రేపు ఉదయం 6 గంటలకు వెళ్లి తెచ్చుకుందాం’ అంది. బిల్లుకు దుంపలు అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా వాటిని రుచి చూడా లని అనుకుంది. వెంటనే నక్క చెప్పిన సమయం కంటే ముం దుగానే లేచింది. ఆరు గంటలు అంటే ఐదు గంటలకే వెళ్ళి దుంపలన్నీ తెచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంది.

నక్క వచ్చి వెళ్దామా అని అడిగితే ‘నేను తెచ్చేసుకున్నాను. మీరు వెళ్లి తెచ్చుకోండి’ అని ఇంట్లో నుండే సమాధానం చెప్పింది.

నక్కకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా బిల్లును తినాలనే ఆశ తో మరుసటి రోజు మళ్లీ బిల్లు ఇంటి ముందు నుంచోని ‘రేపు ఐదు గంటలకు యాపిల్‌ తోటకు వెళ్దాం. పండ్లు చాలా రుచిగా వుంటాయి’ అని అరిచి వెళ్లిపోయింది.

బిల్లు మూడు గంటలకే లేచి బయల్దేరి వెళ్లింది. యాపిల్‌ చెట్టు ఎక్కి పండ్లు కోయడం ప్రారంభించింది. నక్క ముందుగానే అక్కడికి చేరి బిల్లు కోసం ఎదురు చూస్తోంది. చెట్టు కింద నుంచోని ఇక తెంచింది చాలు కిందికి రా ఇంటికి వెళ్దాం అంది. వెంటనే బిల్లు కొన్ని యాపిల్స్‌ తీసుకుని నక్క మీద వేయడం మొదలు పెట్టింది. నక్క దెబ్బ తగిలి బాధ పడుతుంటే అదను చూసుకుని పరిగెత్తింది. ఒక్క ఉదుటున ఇంటికి వెళ్లి గడియ పెట్టేసుకుంది. నక్క కూడా దాన్ని వెంబ డించుకుంటూ వెళ్లింది. ఇక ఎలాగైనా బిల్లును తినేయాలనే ఆశతో ఇంటిమీదికెక్కి అక్కడ వున్న పొగ గొట్టం ద్వారా ఇం ట్లోకి దూకింది. అప్పటికే బిల్లు ఆ గొట్టం కింది భాగంలో పెద్ద గిన్నెలో వేడినీళ్లు మరగబెట్టింది. నక్క అందులో పడగానే వెం టనే మూత పెట్టేసింది. నక్క పీడ వదిలిపోయింది. బిల్లు ఆ ఇం ట్లో హాయిగా గడిపేసింది.
-ధరణి(హైమ సింగతల)
Surya telugu daily March 20, 2011