టెక్నాలజీని వుపయోగించుకోవడంలో అందరికన్నా యువతులు ముందు వరుసలో వుంటున్నారు. తల్లిదండ్రులమీద ఆధారపడకుండా తమ తెలివి తేటలతో పదుగురిలో భేష్ అనిపించుకుంటున్నారు. పట్టాలు చేతికొచ్చే సమయానికి అనుభవాన్ని కూడా మూటగట్టుకుని వినూత్న రంగాల్లో అడుగిడి విజయాలు మూటగట్టుకుంటున్నారు. అతి చిన్న వయసులో అందలాలు అందుకుంటున్నారు. చదువుతో పాటు ఇతర వ్యాపకాలకూ జీవం పోస్తున్నారు.

చిన్నారి కోకిలా రవీనా...
రవీనా మెహతా 12 సంవత్సరాల చిన్నారి. కానీ ఆమెలో ఉన్న టాలెంట్ మా త్రం తన వయస్సుకుంటే చాలా గొప్పది. ఐదు సంవత్సరాల వయస్సులోనే మ్యూజిక్‌లో తనకున్న టాలెంట్‌ను నిరూపించుకుంది.సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించింది. చిన్నతనం నుండే సంగీతం పట్ల మక్కువ పెం చుకున్న ఈ చిన్నారి వయసు పెరుగుతున్న కొద్ది మెలకువలు నేర్చుకోవడం తోపాటు, మ్యూజిక్ పరికారాలను గుర్తించడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఐదు సంవత్సరాల వయస్సులోనే తను చదువుతున్న స్కూల్‌లో ఒక క్రమ పద్ధతిలో సంగీతాన్ని ఆలపించింది కూడా.
కస్టమర్ కేర్ టీమ్ లీడర్...
డిగ్రీ చదువుకుంటూ ఓ ప్రముఖ కస్టమర్ కేర్ సెంటర్‌లో టీమ్ లీడర్‌గా వుం టున్న పద్మను చదువుకునే వయసులో ఈ ఉద్యోగాలు ఎందుకు అని అడి గితే.. ‘ఇంటర్ పరీక్షలయిపోయాక ఖాళీగా వుండటం ఎందుకని స్పోకన్ ఇం గ్లీష్ క్లాసుల్లో చేరాను. అక్కడ మా సీనియర్ ఒకరు చెబితే ఇక్కడికి ఇంట ర్య్వూకి వచ్చాను. నా స్కిల్స్ చూసి వారు జాబ్ ఇచ్చేశారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు అని ఇక్కడ జాయిన్ అయ్యాను. నా చదువుకు కావాల్సిన మొత్తాన్ని నా జీతం నుండే తీసుకంటు న్నాను. మా అమ్మా వాళ్లకు కూడా కొంత ఇస్తాను. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను’ అని ఎంతో గర్వంగా చెబుతోంది.
ఫ్రెంచ్ ఫ్యాకల్టీగా...

ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని వుంది. ఇందుకు మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇష్టమైన మార్గంలో వెళ్తాను’ అని భావన అంటోంది.18 ఏళ్ళ మధు మాట్లాడుతూ ‘అన్నీ మాకే తెలుసు అని మేము అనడం లేదు. కానీ ఏమీ తెలియదు అంటే మాత్రం ఒప్పుకోం. మా న్నా సీనియర్స్ మా దగ్గరికి వచ్చి సందేహాలను తీర్చుకుంటున్నారు. నెట్‌వర్క్‌కి సంబంధించి చా లా వరకు అప్‌డేట్‌లో మేము వుంటున్నాం. మా అక్కకు కూడా దీనికి సంబం ధించి నేను హెల్ప్ చేస్తుంటాను’ అంటోంది.
సమస్యలపై అవగాహన..
అనుభవ లేమి కారణంగా చిన్నతనంలోనే ఉద్యోగాలు వంటి వాటిల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటారని పెద్ద లు భయపడుతుంటారు. కానీ అటువంటి సమస్య ఏ మీ తమకు లేదని చెబుతున్నారు నేటి అమ్మాయిలు. ‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను మేము తెలుసు కోగలం. ఒక్కోసారి ఎంతో అనుభవం వున్నవారు కూ డా సమస్యలు వస్తే దిగాలు పడిపోతారు. కానీ మేము అలా కాదు. వారికన్నా ఎక్కువగా ఎంతో ఆలోచించి స మస్యలను ఎదుర్కొంటాం. తగిన విధంగా స్పందిస్తాం అని’ అని ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రియ చెబుతోంది. ఆమె రేడియో జాకీగా పనిచేస్తోంది. ‘మాకు అన్నీ తెలు సు అని పెద్దవాళ్లు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. కా నీ ఆలోచనలను మాత్రం అడ్డుకోకూడదు. మంచిగా చేసేవాటిని ఒప్పుకోవాలి. కెరియర్‌కి సంబంధించి నంత వరకు మాకంటూ ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటోంది.
తొందరపాటు నిర్ణయాలు..

నిపుణుల మాట...
తరాల వారీగా తెలివి తేటల్లో, టెక్నాలజీని వినియోగించుకోవ డంలో వ్యత్యాసాలు చాలా ఎక్కువగావు న్నాయి. పిల్లల తెలివి తేటలు అమోఘం. వారికి సరైన దిశాని ర్దేశం చేస్తే చాలు. అన్నిరంగాలలోనూ ముందుకు దూసుకెళ్తారు. తల్లి దండ్రులు చేయాల్సిందల్లా వారికి సరైన గైడెన్స్ కల్పించడం. వారి మార్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలి. పిల్లల ఎదుట నచ్చినట్లు ప్రవర్తించకుం డా హుందాగా వ్యవహరించాలి.వారికి రోల్‌మోడల్‌గా వుండాలి. ఏదైనా కొత్త మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు ప్రోత్సహించాలి అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
-హైమ సింగతల
surya telugu daily, March 7, 2011
No comments:
Post a Comment