Search This Blog

Wednesday 20 August 2014

సంకుచిత దురాచారాలపై స్వేచ్ఛాస్త్రం రెబెకా

అక్షరాలు నేర్వకపోయినా.. సమాజాన్ని చదివిన రెబెకా.. ఆడవారు సొంత ఆలోచనలు చేయడం కూడా నేరమనే చోట ఓ అధ్యాయానికి తెర తీసింది. మహిళల కోసం ఏకంగా ప్రత్యేక గ్రామాన్ని ఏర్పాటు చేసింది. భూమిని సాధించింది. వ్యాపారం చేసింది. తోటి వారందరికీ జీవనాధారం కల్పించింది. కేవలం అన్నం పెట్టడమే పరిష్కారం అయితే అక్కడితే ఆగిపోయేది ఆమె.. 

కెన్యాలోని సంబురు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దురాచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. అక్కడి మహిళలకు ఎటువంటి హక్కులు వుండవు. వారు మాట్లాడటం కూడా నేరంగా భావించే విచిత్ర ధోరణులు అక్కడ ఎక్కువ. సామాజికంగా ఆర్థికంగా ఎంతో నిరాదరణకు గురవుతూ అక్కడి మహిళలు కేవలం ప్రాణాలతో వున్నాం అని జీవితాలను వెళ్లదీసేవారు. అత్యాచారాలకు గురైన వారిని కాపా డేందుకు అక్కడ ప్రత్యేక చట్టాలు కూడా ఏమీ లేవు.కుటుంబాలు కూడా అటువంటి మహిళలను బయటికి గెంటేసేవి.అటువంటి ప్రాంతంలో పుట్టినా రెబెకా లోలోసోలి విప్లవ భావాలు కలిగిన స్ర్తీగా పెరిగింది.1991లో చోటు చేసుకున్న
సంఘటనలు రెబెకా ను కలచి వేశాయి. 

ఒకే సారి అత్యాచారాలకు బలైన 16 మంది మహిళలను చూసింది. తమ జాతి మహిళలకు సాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఎంతో కష్టపడి అత్యాచారాలకు గురై వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్న మహిళలందరినీ ఒక చోటకి చేర్చే ప్రయత్నం చేసింది. సంబూరులో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించా లని నిర్ణయం తీసుకుంది. కానీ కుటుంబంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.అయినా కూడా బ్రిటీష్‌ సైనికులు చేసిన అత్యాచారాల గురించి మాట్లాడం ప్రారంభించింది. వెంటనే నలుగురు మనుషు లు ఆమె ఇంటికి వచ్చి తీవ్రంగా గాయపరిచారు. వాళ్లు ఆమెపై దాడి చేస్తున్నప్పుడు భర్త పక్కనే వున్నా కూడా ఏమీ మాట్లాడలేదు. వారిని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించ లేదు.ఇదంతా ఆమెకు ఎంతో విచిత్రంగా అనిపించింది. తమ జాతిలోని దురాచారాలు కూడా ఆమెను కలవర పెట్టాయి.


సొంతంగా భూమి లేకపోవడం, ఎటువంటి ఆస్తులు, ఇళ్లు ఏమీ లేకపోవడం, మహిళలకు సొంత జీవితం కూడా వుండకూడదన్న నిబంధనల ను ఎదిరించింది. అత్యాచారాలకు గురైన మహిళలకు కెన్యా ప్రభుత్వం కొం త భూమిని కేటాయించి చేతులు దులుపుకుంది. అది కూడా ఎందుకు ఉప యోగపడనిది. రెబెకా వారందరినీ చేరదీసింది. ఒక గ్రూపుగా వారిని తయా రు చేసింది. జీవనాధారం కల్పించేందుకు కొత్త మార్గాలను అన్వేషించింది. మొత్తం 50 మంది ప్రస్తుతం ఆమె గ్రూపులో వున్నారు. చుట్టు పక్కల మహిళలందరితో మాట్లాడి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే ఆలోచన ను తెలియజేసింది. వాళ్లు తయారుచేసిన పూసలు, అలంకరణ సామ్రాగిని అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంతో జీవనాధారాన్ని కల్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

అలాగే తరువాత వారిని ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించింది. యాత్రికులను ఆకర్షించేందుకు అనేక రకాలుగా ఆ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. గ్రామంలో గృహహింసా బాధితులకు, చిన్న వయసులోనే పెళ్లై బాధలు పడుతున్న వారిని, అత్యాచా రాలకు గురైన వారిని చేరదీసి గ్రామంలో నివాసం ల్పించింది. వాళ్ల కాళ్లపై నిలబడేలా చేసింది. న్యూయార్క్‌కు చెందిన మహిళ డయానె ఫ్రస్టెన్‌బర్గ్‌ 2009లో ఈ గ్రామాన్ని కనుగొని రెబెకాను ప్రపంచానికి పరిచయం చేసింది.చేతివృత్తుల్లో నిపుణులైన మహిళల విషయాలను తెలుసుకునేందు కు ఆమె చేసిన ప్రయత్నంలో ఈ గ్రామం వెలుగు చూసింది. 2010లో డయానె రెబెకాను న్యూయార్క్‌కు ఆహ్వానించింది. 

వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రంగు రంగుల పూసలతో వారు తయారు చేసిన ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు ఎంతగానో ఆదరణ పొందాయి. అప్పటి నుండి ఆ మహిళా గ్రామానికి ఉమోజా అని పేరు వ చ్చింది. దీని అర్థం కలిసికట్టుగా అని. దీనిద్వారా వాళ్లు పొందిన ఆదా యం తో సొంతంగా భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఒక నర్సరీ పాఠశా లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చెప్పుకునేందుకు ఎంతో సులువుగా అనిపించేసినా అంత త్వరగా సాధ్యం కాలేదు.దశాబ్ద కాలం పాటు రెబెకా పోరాడాల్సి వచ్చింది. దీనికి వ్య తిరేకంగా ఆమెపై ఎన్నో దాడులు కూడా జరిగాయి. తెగలోని మగవారు ఆ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఎన్నో కష్టాలకు గురి చేశారు. అలాగే చుట్టు పక్కల గ్రామాల వారు కూడా రెబెకాను అడ్డుకునేందుకు ప్రయత్నించి అడుగడుగునా అడ్డంకులుకల్పించారు. అయినా రెబెకా దేనికీ బయపడలేదు. 

కేవలం వారికి సాధికారత కల్పించి బాధితులకు నీడనివ్వడమే కాదు వారికి రక్షణ కల్పించడం కూడా బాధ్యతని ఆమె తెలుసుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుదే ఏదైనా సాధ్యం అనే ఆలోచనల తో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. క్రమంగా మహిళలపై కొనసాగుతున్న హింస వైపుకు దృష్టి మరల్చింది.దురాచారాలను రూపుమాపేందుకు మహి ళలలో చైతన్యం కల్పించాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా మహిళలను తనవైపుకు మళ్లేలా చేసింది.వారికి వాస్తవాలను వివరిస్తూ.. సొంతంగా బత కడంలోని ఆనందాన్ని, స్వేచ్ఛగా బతకాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.ఇందులో చాలా వరకు ఆమె విజయం సాధించింది కూడా. మహిళల ఆరో గ్యానికి హాని కలిగించే మూడనమ్మకమాలను చాలా వరకు అదుపు చేసింది. 


ఇప్పుడు ఉమెజా గ్రామానికి పూర్తి స్థాయి రక్షణ కూడా కల్పించింది. ఎంతో మంది మహిళలు, బాధితులు ఇప్పుడు ఆ గ్రామానికి చేరుతున్నారు. అలాగే ప్రపంచ నలుమూలల నుండి కూడా గ్రామాన్ని సందర్శిస్తున్నారు. రెబెకా గ్రామాన్ని రూపొందించిన విధానం, అక్కడి మహిళల జీవితాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పాఠశాలలు కూడా వెలుస్తున్నాయి. ఉమెజా గ్రామీణ మహిళలు తయారు చేసిన వస్తువులు, సామాగ్రి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను సంపాదించుకున్నాయి.విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు. సమానత్వం, మహిళా హక్కుల పరిరక్షణను కోరుతూ రెబెకా ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. ప్రదర్శనలు నిర్వహించింది.

రిబెకా స్థానిక స్వచ్ఛంద సంస్థ చాప్టర్‌ ఆఫ్‌ మీన్‌డెలియో యా వానావాకే ఆర్గనైజేషన్‌కు చైర్‌ పర్సన్‌గా కూడా వ్యవహరిస్తోంది. దీనిద్వారా మహిళా సాధికారత కోసం వారికి శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపాధి కల్పనా బాధ్యతలు కూడా సంస్థనే చూసుకుంటుంది. దీని ద్వారా అంతర్జా తీయ స్థాయి కార్యక్రమాలు కూడా రెబెకా నిర్వహించింది. యుఎస్‌, సౌతా ఫ్రికా, యూరోప్‌ వంటి దేశాల్లో పర్యటించింది. సెమినార్లలో పాల్గొంది. ఆఫ్రికా మొత్తం మీద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కుంది. ప్రస్తుతం ఆమె లక్ష్యం కేవలం కెన్యా మహిళలు మాత్రమే కాదు.. సమస్యలతో సతమతమవుతున్న వారందరూ...
-హైమ సింగతల
సూర్య దినపత్రిక, ధీర

No comments:

Post a Comment