Search This Blog

Thursday 17 July 2014

అందమైన అతివలు... ముచ్చటగొలిపే చోకర్లు...

భారతీయ సంస్కృతిలో ఆభరణాలు సిరిసంపదలకు చిహ్నాలు.. వివాహాలు, పండుగలు, పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో వీటికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. భారీ ఆభరణాలు ధరించకపోతే వధువు అలంకరణ పూర్తి అయినట్లుగా అనిపించదు.. అందుకే వధువు అలంకరణలో చోకర్లకు ప్రత్యేకమయిన స్థానం వుంటుంది.

ఆద్‌ లేదా అరియాలు మెలికలు తిరిగి, విశాలంగా లేదా, మేడల్లాంటి పట్టీలతో చోకర్లు చూపరుల కళ్ళను కట్టిపడేస్తాయి. ఇటీవల జరిగిన ప్రముఖుల పెళ్ళిళ్లను గమనిస్తే వధువుల మెడల్లో ఇవి మురిపించిన సం దర్భాలు గుర్తొస్తాయి. అంతేనా.. వీటి ప్రత్యేకత అంటే ఇంకా చాలా వుం ది... జాలర్లు వేలాడుతూ లేదా, వంపులతో ఒంగుతూ వుండే ఆభరణాలు ఇవి. మెడ కింది భాగంలో సరిపోయినట్లుగా... అందుకే తయారయి నట్లుగా కనిపిస్తాయి. 

  • చోకర్లు పొట్టిగా, మెడకు అదిమి పెట్టుకున్నట్లుగా వుండే నెక్లెస్‌లు సాధారణంగా 14 నుంచి 16 అంగుళాల పొడవుతో వుంటాయి. 
  • పొడవాటి మెడగల ఆడవారికి అన్ని రకాల చోకర్లు అద్భుతంగా కనిపిస్తాయి. మెడ పొడువు తక్కువగా ఉన్నా, కొంచెం బొద్దుగా ఉన్నా కూడా సన్నగా వుండే చోకర్లు బాగా నప్పుతాయి. పెండెంట్‌ గల చోకర్లు వీరికి బాగా నప్పుతాయి. 
  • మెడ ఒంపుకు కూడా అందాన్ని ఇస్తాయి. సన్నీతీగకు మెరిసే రాళ్లూ లేదా పూసలు పొదిగి తయారు చేసే సున్నితమైన చోకర్లు స్టయిలిష్‌గా కనిపిస్తాయి. ఎన్నో రకాల మోడల్స్‌తో ప్రయోగాలు చేసి చేస్తే వీటి ఎంపికలో ఎవ్వరైనా నిపుణులు అయిపోవచ్చు. 
  • ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎలాంటి చోకర్లు నప్పుతాయో తెలుసుకుని వాటినే ధరించాలి. ఎందుకంటే ఎప్పటి ఫ్యాషన్‌ను అప్పుడు తెలుసుకుని పట్టిస్తేనే మగువల సొగసు, అందం
    రెట్టింపు అవుతుందని ఈ కాలం అమ్మాయిలు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం చోకర్లతో మెరిపించండి మరి.

No comments:

Post a Comment