Search This Blog

Tuesday 1 July 2014

ప్రయాణంతో ప్రేమలో...

మనసుకు ఆహ్లాదంగా వుండేందుకు ప్రయాణాలు, విహార యాత్రలు ఎంతో ఉపయోగపడతాయి. రీఛార్జ్‌ అయ్యేందుకు సాయపడతాయి. కానీ నేడు ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ సాహసాలను ఆస్వాదిస్తున్నారు మహిళలు. తమ అనుభవాలను అందరితోనూ పంచుకోవాలని ఆశపడుతున్నారు. భవిష్యత్తును ఈ ప్రయాణాల్లో వెతుక్కుంటూ ముందుకు సాగడంలోని ఆనందం చెప్పలేనిది అని వారి అభిప్రాయం. ఒంటరిగా ప్రయాణాలు.. సాహసాలు.. అందులోని ఆనందాలు..అన్నీ ఇన్నీ కావు. వారి అనుభవాలను తెలుసుకుంటేనే అందులోని అనుభూతులు తెలుస్తాయి. ఆ ప్రయాణ ప్రేమికురాళ్ళ సాహసాలు...


ప్రయాణమే భవిష్యత్తు...
beechదివ్యా రాణా కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్‌ పరిశ్రమలో కృషిచేస్తూ తన భవిష్య త్తుకు మెరుగులు దిద్దుకుంటోంది. అచ్చం అమెరికన్‌ టెలివిజన్‌ ఏంకర్‌ సమంతా బ్రౌ న్‌లా ప్రయాణం, ఆహారం, సాహసకృత్యాల్లో పేరుగడించాలన్నదే ఆమె జీవిత ధ్యేయం. పగలంతా అన్వేషణలో గడుపుతూ రాత్రి వేడివేడిగా భోజనం ఆరగించి చేతిలో టివి రిమోట్‌, ఓ పుస్తకంతో బిచాణా వేయడం లేదా యాత్రా జీవిత అనుభవాలను రాయాల న్నది ఆమె అభిలాష. 

ఉత్తరాఖండ్‌లో రాజాజీ నేషనల్‌ పార్కులోని వైల్డ్‌ బ్రూక్‌ రిసార్ట్‌లో ఆమె చేసిన పర్యటన గురించి వివరించింది దివ్యా. ''అక్కడ రోడ్డు లేదు. ఫోన్‌ నెట్‌వర్క్‌ కూడా లేకపోవడంతో నది ఒడ్డునానుకునే డ్రైవ్‌ చేస్తూ వెళ్ళాం. మొత్తం రిసార్ట్‌ అంతా కాలినడకన తిరగాలనిపించింది'' అని చెప్పింది. ఇప్పటికే ఆమె ిహిమాలయాలు మొద లుకుని అండమాన్‌ దీవులవరకూ తిరిగివచ్చింది. దివ్య గనుక ప్రయాణం చేయాలనిపి స్తే చాలు ఎవరికోసం ఆగదు. సంచీ భుజానేసుకుని బయల్దేరడమే తరువాయి. ''ప్రయా ణం ఆహ్లాదకరంగా ఉండాలంటే వెంట కొందరుండాలన్నది భ్రాంతి. వెళ్ళే చోట ఏం ఆశిస్తున్నామో ముందుగానే నిర్ణయించుకుని అన్వేషణ ప్రారంభిస్తే అనుకున్నది సాధిం చామన్న తృిప్తి కలుగుతుంది. సాటి మహిళల్లో ఈ గుణమంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది'' అంది. 

ఇంకా ఏం చెబుతుందంటే...
''మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు. మనగురించి మనం ఎక్కు వగా భావించనూ కూడదు. ఎలక్ట్రిక్‌ పరికరాలు వెంటతీసుకెళ్ళొద్దు. పాత బట్టలు చెప్పులు మాత్రమే ఉంటే చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. వెళ్ళిన చోట స్థానిక ప్రజలతో కలిసిపోవాలి. మనం దిగిన హోటల్‌ వివరాలు, టాక్సీ నంబర్లు, ముందు ప్రయాణం వివరాలు ఇంట్లో వాళ్ళకు తెలియజేయాలి. 

రితికా మిట్టల్‌ సాహసాలు...
indian-woman-wearing''నాకు భయం అంటూ లేనేలేదు. పర్వతాల్లో ప్రాణాలు వదలాలని వుంది అని నేను గర్వంగా చెబుతున్నాను'' అంటోంది రితికా మిట్టల్‌. బట్టల డిజైనర్‌ రితికా మిట్టల్‌ అందమైన దుస్తుల షాప్‌ ''మొర్‌''నడుపుతోంది. ఇటీవలే కాలా ఘోడా ఆర్ట్స్‌ ఫెిస్టివల్‌లో తన బట్టల ప్రదర్శన నిర్వహించింది.తన కొత్త దుస్తుల తయారీ డిజైన్‌ కోసం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని ఆమె ఉవ్విళ్ళూరుతోంది.''మూడునెలల వ్యవధిలో నాలుగు భాషలు మాట్లాడే నాలుగు రాష్ట్రాల్లో 22 ప్రాంతాలను సందర్శించాలి. ఈశాన్య ప్రాం తం ప్రకృతి సౌందర్యం, సంస్కృతి, వైవిధ్యం అక్కడి ప్రజలు ఆమెను పలవరింపచేస్తు న్నాయి. ఒక బృందంలో ఉంటూ మరో బృందంతో మైత్రి చేయడం వీలవ్వదు. 

ప్రతి బృందంతో ప్రతి జాతితో మమేకమవ్వాలి. నాగా, మిజో, బొడొ, కచరి, దిమిస జాతు ల, తెగల వారిని అర్థంచేసుకుని వారి వస్తధ్రారణ రీతులు సంస్కృతి ఆచార వ్యవహారా లు ఆకళింపు చేసుకోవాలంటే ప్రతి ఒక్క జాతి జనులలో ఒకరై జీవించాలి. వారి ఇళ్ళ లో ఉన్నాను, వారు తినే ఆహారం తిన్నాను.వారు నాకెంతో ప్రేమతో ఇచ్చిన వారి దుస్తు లు వేసుకున్నాను, వారిలో లీనమైపోయేదానిని వారిలో ఒక సభ్యురాలినైపోయానం'' టోంది రితిక.

రితికా ఆణిముత్యాల్లాంటి తన అనుభవాలను కూడా వివరిస్తోంది. ''ఒక కత్తి, ఒక టార్చిలైటు, పెప్పర్‌ స్ప్రే, వగైరా వెంట తీసుకువెళ్లండి. మీ స్వభావాన్ని బట్టే ముందుకు సాగండి. బాగా రాత్రి అయ్యాక ప్రయాణం చేయవద్దు. స్థానిక మహిళలతో స్నేహం కల్పించుకోండి. విశ్రాంతి తీసుకునేప్పుడు ఒక గుంపుతో కలిసి వుండడం క్షేమదాయకం. వెంటవున్న డబ్బును ఎక్కడైనా దాచివుంచండి'' అని సలహాలిస్తోంది. 

సోనాల్‌ సింగ్‌ విశ్రాంతి ప్రయాణం...
''తల్లిగా, భార్యగా, గృహిణిగా పాటుపడడంలో జీవితం చితికిపోకుండా అప్పుడప్పుడూ జీవన మాధుర్యాన్ని చవిచూడాలనుంది. సాహస కృత్యాలు చేయాలనుంది'' అంటోంది సోనల్‌ సింగ్‌. ఎంతో ఉత్సాహంతో ఉరకలేసే సోనల్‌ సింగ్‌కు నాలుగేళ్ళ పాప వుంది. వుండేందుకు ఒక్కపాపే అయినా గంపె డు సంతానంతో సమానం అంటోందామె. మంచి చదువరి, ఆహారం పై మక్కు వ షాపింగ్‌ పిచ్చి. నిత్యం పనులు, బాధ్యతలు చాలా కాలం విశ్రాంతి అన్న పదానికి పూర్తిగా దూరమైంది. తనలోని తల్లి ఆమెను బానిసగా మార్చేసింది. ఇలా వుంటే తనూ ఓ యంత్రంలా మారిపోతానేమో అన్న ఆలోచేనే ఆమెను కొంచెం మార్చింది. ఇంట్లో అందరినీ ఒప్పించి ఒంటరిగా పర్వతాల వైపు పయనమైంది. సిమ్లా, మస్సూరీ, డె్రహాడూన్‌లలో సంచరించి వచ్చింది. 

''ఒంట రిగా ప్రయాణం చేస్తే ఇబ్బందులే వుండవు. దారిలో స్నేహితులేర్పడతారు. సావకాశంగా కాలం గడపవచ్చు. అందమైన గిరిశిఖరాల్ని, లోయల్ని, పువ్వుల్ని చూస్తూ ఇంటి జీవితం మరిచిపోయేంతగా తన్మయత్వం చెందుతాను. చివరికి నా పాప ఏం చేస్తున్నాడో అన్న చింత సైతం ఈ ప్రయాణాల్లో నా నుండి సెలవు తీసుకుంటుంది'' అంది. ఇంకా ''ఎల్లప్పుడూ మంచి బట్టలువేసుకోండి వెళ్ళిన ప్రదేశంలోని ప్రజల సాంస్కృతిక సూక్ష్మానుభూతుల్ని గుర్తించండి. వాతావర ణం, ప్రజలు, ఆచారా వ్యవహారాలు, అత్యవసర ఫోన్‌ నంబర్ల గురించి సమా చారం సేకరించండి. స్థానిక భాషలోని ముఖ్యమైన పదాలను పట్టుకోండి. మం దులు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ వెంటతీసుకెళ్ళండి ఒక వేళ దగ్గరలోనే ఉన్నట్లయితే స్నేహితుడికో పరిచయస్తుడికో ఓ కార్డు ముక్క రాసిపారేయండి'' అని చెబుతోంది. 

శిఖా త్రిపాటి ప్రయాణాలు...
26ఏళ్ల ఈ యువతికి ప్రయాణాలంటే ప్రాణం. చిన్నతనం నుండి సెలవుల్లో తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేయడం వల్లే తనకు ప్రయాణాల మీద ఇష్టం కలిగింది. అప్పటి నుండి ప్రయాణాలు చేయడం నేర్చుకుంది.ఒం టరిగా ఎన్నో దేశాలు చుట్టి వచ్చింది. ఇంకా ఈజిప్ట్‌ వంటివి ఎన్నో తాను చూ డాలనుకుంటున్న ప్రాంతాల జాబితాలో మిగిలేవున్నాయి. ''జీవితం ఓ ప్రయాణం లాంటిది. అందులో ఒకచోటే ఆగిపోవడం అంటే ఎలా చెప్పండి. కాస్త మార్పు కావాలి. ప్రయాణం చేయాలి. సాహసాలు చేయాలి. అప్పుడే జీవితంలో వుండే ఆనందం తెలుస్తుంది'' అంటోంది.
-హైమ సింగతల 
surya telugu daily

No comments:

Post a Comment