బెన్‌టెన్, డ్రాగన్‌ల్యాండ్, పవర్‌పాప్ గర్ల్స్, కార్టూన్‌లను చూసి ఆనందిస్తూనే తన తండ్రి సాయంతో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది సింధుజ. అతి తక్కువ సమయంలో యానిమేషన్ చిత్రాన్ని రూపొందించి మహామహులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెద్ద పెద్ద కంపెలు ఉన్నత స్థానాల్లోకి రమ్మంటూ ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించింది. పద్నాలుగేళ్ల వయసులో ఓ కంపెనీని స్థాపించి ప్రపంచంలోనే అతి చిన్న వయసు సిఇఓగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కింది.జాయ్‌అలుకాస్ వంటి ప్రముఖ సంస్థల వ్యాపార ప్రకటనల అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

మిగిలిన సమయాన్ని తన చదువు కోసం వినియోగించుకుంటోంది.కలల కంపెనీకి సిఇఓ ప్రైవేటు సెక్టర్‌లో పనిచేసే వారి కల ఓ కంపెనీకి సిఇఓ కావడం. దానికి సంబంధించి సరైన విద్యార్హతలు, అనుభవం వుంటేనే సాధ్యం అవు తుంది. అన్నీ వున్నా ఒక్కో సారి అది చేరువవ్వక బాధ పడేవారు అనేక మంది.కానీ సింధుజ పట్టుదల లక్ష్యం వీటన్నిటినీ అధిగమించింది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండానే అతి తక్కువ సమయంలో యానిమేషన్ చిత్రా లను రూపొందించింది.
చదువుతోపాటే లక్ష్య నిర్దేశం..
ప్రస్తుతం సింధుజ సిటీ స్కూల్‌లో తొమ్మిదవ త రగతి చదువుతోంది. కేవలం ఇప్పటికిప్పుడు ఆమె యానిమేటర్‌గా తయారవ్వలేదు. ఐదేళ్ల క్రి తం నుండే ఆమె దీనికి సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది.2డి, 3డి యానిమేషన్‌లో నే షనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (ఎన్‌ఎఎస్ ఎస్‌సిఓఎం) గేమింగ్‌లో కోర్సును చేయడం ప్రారంభించింది. అనంతరం గత ఏడాది హైదరాబా దులో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలోనూ పాల్గొంది.

క్యారికేచర్ ఆర్టిస్టు...
దీనితోపాటే ప్రపంచంలో అతి చిన్న క్యారి కేచర్ ఆర్టిస్టుగా కూడా ఆమెను కోరల్ కార్పొరేషన్ ఆమెను కొనియాడింది. పట్టుద లతో తనలాంటి వారికి మున్ముందు ఆద ర్శంగా నిలిచేందుకు అడుగు జాడలను సింధుజ ఏర్పాటు చేసింది అని ప్రముఖ యా మిమేటర్లు అంటున్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆ శాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అండగా నిలిచిన ఎఫ్‌పిటి...

తండ్రి ప్రోత్సాహం...
సింధుజా తండ్రి రాజారామన్ రామనాథాపురం జిల్లా వాసి. ఆయన ఒక కార్టునిస్టు. సింధుజలోని ప్రతిభను చిన్న తనంలోనే గుర్తించి ఆమె కు సరైన ప్రోత్సాహాన్ని అందించారు. తప్పకుండా ఉన్నతస్థానానికి ఎదు గుతుందనే ఆశతో అన్ని విధాలుగా ఆమెకు మద్దతునిచ్చారు. చిన్నతనం లోనే యానిమేషన్ కోర్సులో చేర్పించారు.
కొత్త ప్రాజెక్టులు..
ఇప్పుడు సింధుజా 2డి ఫిల్మ్‌ను టేకప్ చేసింది ‘విర్చువల్ టి నగర్’ చెనై్నలోని వ్యాపార ప్రాంతంపై చేస్తున్న యానిమేషన్ ఫిల్మ్ అది. దీనితోపాటు జాయ్ అలుకాస్‌కు సంబంధించి 40 సెకండ్లపాటు సాగే వ్యాపార ప్రటనను కూడా సింధుజా రూపొందిస్తోంది.మరికొన్ని కార్పొరేట్ కంపెనీలకు కూడా ఆమె ప్రకటనలను రూపొందిస్తోంది.
-హైమ సింగతల, సూర్య దినపత్రిక
No comments:
Post a Comment