Search This Blog

Friday 4 July 2014

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

మంచు దొంతరలు విడిపోక మునుపే.. ముద్దులొలికే లోగిళ్లలో ముచ్చటైన గొబ్బెమ్మలు ఒదిగేందుకు సిద్ధం.. కన్నె పిల్లలంతా కలిసి తమ కోర్కెలను తీర్చమంటూ చిట్టాను పాటకట్టే సమయం.. తమ కుటుంబాన్ని చల్లగా చూడమంటూ ఇంతులంతా వేడుకునే తరుణం… మురికి వాడలు సైతం అందంగా ముస్తాబయి ఆహ్వానం పలుకుతున్న శుభోదయాలు.. ఈ మాసం మొత్తం అందంగా..ఆనందంగా..శుభాలు ఇవ్వాలని కోరుతూ..
ragoli-muggu
గోవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం మనది. అందుకే ఆవు పేడను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. కేవలం పవిత్రం మాత్రమే కాదు.. ప్రకృతికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఇందులో వున్నాయి. అందుకే ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ముగ్గుల మధ్యలో పెట్టి పూజిస్తారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించే యువతులు సందె గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియాలతో పాటలను పాడి ఆడుతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, త్వరగా పెళ్ళి అవుతుందని వారి నమ్మకం. ఈ ఆట వివాహ వ్యవస్థపై మన యువతులకున్న నమ్మకాన్ని రుజువు చేస్తుందంటారు.
గొబ్బెమ్మలు..
పెద్ద వయసు స్ర్తీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బి ళ్ళను ముగ్గుల మధ్యలో పెడతారు. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ముతె్తైదువులకు సంకేతం.గోపీ+బొమ్మలు=గొబ్బెమ్మలు అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మ డి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా వుంటుంది.
గొబ్బిళ్ళ పాటలు..

sankranti
గొబ్బి పాటలకు జానపద వాజ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు అని ముందుగానే చెప్పుకున్నాం.. ‘కొలని దోసరికి గొబ్బిళ్ళో యదు కుల సామికి గొబ్బిళ్ళో’ అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. ఈ ధనుర్మాసం రోజుల్లో ఊరూరా ఆడవారు తెల్ల వారకముంద లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పేడతో చేసిన ముద్దలను గొబ్బె మ్మ లుగా భావించి ఆ ము గ్గుల మధ్య భాగంలో పెట్టి వాటికి అలంకా రంగా పువ్వులు పెడతా రు. సాయంత్రమ య్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉం చుతారు.
కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు. పాడటం పూర్తయ్యాక మధ్యలో ఉన్న అమ్మాయి గొబ్బెమ్మను పట్టుకుంటే మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చేరి ఒకరి భుజాల మీద ఇంకొకరు చేతులు వేసుకుని గొంతులు కలిపి పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబ్బుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
whoman
గొబ్బెమ్మలకు తెలంగాణా ప్రాంతంలోని బతుకమ్మలకు పోలికలున్నా, కొన్ని విషయాల్లో స్వల్ప బేధాలున్నాయి. బతు కమ్మపాటలు ఒక నిర్ణీత ప్రదేశంలో పాడితే గొబ్బి పాటలు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందూ పాడుతారు. గొబ్బి పాటలు నిటారుగా నిలబడి తిరుగుతూ పాడతారు. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు నడుం దగ్గర వంగి తిరుగుతారు. బతుకమ్మపాటు పాడేవారి కదలికల్లో అందం ఉంటే గొబ్బిపాటలు పాడేవారిలో హుందాతనం ఉంటుంది. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు చప్పట్లు వేగంగా తడితే గొబ్బి పాటలు పాడేవాళ్ళు నిదానంగా తడతారు.
దేవుని నైవేద్యం కోసం..
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
                                                                                          - హైమ సింగతల
                                                                                           Surya Telugu Daily 

No comments:

Post a Comment