Search This Blog

Thursday 5 June 2014

పుస్తకాలే ఆమె చిరునామా...!

బహుముఖ ప్రజ్ఞాశాలి, సమకాలీన రచయిత్రి, యువ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌.. కవయిత్రి చిత్రాలీలె.అరుదైన రికార్డులను సృష్టిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఇప్పటి వరకు తన పుస్తకాలు, కళలు వంటి వాటి ద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న ఆమె ‘ఆర్గనైజేషనల్‌ డెమెక్రసీ :కొలాబరేటివ్‌ టీమ్‌ కల్చర్‌ : కీ టు కార్పొరేట్‌ గ్రోత్‌’ అనే పుస్తకం ద్వారా మరోసారి రికార్డును సృష్టించారు. ప్రపంచంలోని బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాల రచయితలుగా వున్న 100 మందిలో స్థానం దక్కించుకున్నారు. కేవలం 18 నెలల కాలంలో తొమ్మిది పుస్తకాలను రచించి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నారు.

chitra-leelaమేనేజ్‌మెంట్‌ కన్సల్‌టెంట్‌, రచయిత, కవ యిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్న చిత్రాలీలె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ పట్ట భద్రురాలు. ఆమె వ్యాసాలు, ఉత్పత్తులు, ఉప న్యాసాల ద్వారా ఎంతో మంది జీవితాలను మార్చేశారు.ఎంతో సులువుగా విషయాన్ని చెప్ప గలగడం, ఎదుటి వారిని ఆకట్టుకునేలా విపు లీకరించడం ఆమె రచనల్లోని ప్రత్యేకత. దీని ద్వారానే ఆమె ఎంతో మంది పుస్తకాభిమానులను సంపాదించుకున్నారు. 

మేనేజ్‌మెంట్‌ రంగంలో వున్నవారికి చిత్ర పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్‌గా ఆమె అందించిన అందిస్తు న్న పుస్తకాలు ఎంతోమంది యువ వ్యాపారవేత్తలను తీర్చిదిద్దుతున్నాయి. సరైన మార్గాన్ని నిర్దేశించడంలో ముందుంటున్నాయి. ఇటీ వల ఆమె రచించిన ‘ఆర్గనైజేషనల్‌ డెమెక్రసీ: కొలాబరేటివ్‌ టీమ్‌ కల్చర్‌ : కీటు కార్పొరేట్‌ గ్రోత్‌’ పుస్తకం ఢిల్లీ నుండి దుబాయ్‌ వరకు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తోంది. ప్రపంచంలో ఎక్కువగా పుస్తకాలు అమ్ము డుపోయే వందమంది రచయితల విభాగంలో ఆమెకు స్థానం కల్పిం చింది. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’గా చిత్రకు రికార్డును అందేలా చేసింది. 

అరుదైన పుస్తక రచనలు : 
చిత్రా లీలె సెప్టెంబర్‌ 2008 నుండి ఫిబ్రవరి 2010 వరకు కేవలం 18 నెలల కాలంలో 9 పుస్తకా లను పూర్తి చేశారు. అవి కూడా విభిన్న రంగాలకు చెందినవి.ఆమె రాసిన వాటిలో మేనేజ్‌మెంట్‌, సెల్ఫ్‌హెల్ప్‌, కవితలు, కంప్యూటర్‌ సైన్స్‌, ఫాంటసీ వంటి వాటిలో గొప్ప రచనలుగా పేరు పొందాయి. ఈ పుస్తకాలన్నిటిలో ఆమె మొత్తంగా 3,33,000 పదాలను వుపయోగించారు. 

chitra-leela1ఆమె కొత్తగా రాసిన ఆర్గనైజేషనల్‌ డెమోక్రసీ పుస్తకం సమాజంలో, వ్యక్తులకు సంబంధించి అనుకూల భావాలను రేకెత్తించేలా రచనను చేసింది. ఆమె చేసిన ఈ రచన బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ గురువులైన మార్క్‌ సోబాల్‌, మార్షల్‌ గోల్డ్‌ స్మిత్‌ వంటి పుస్తకాలతో పోటీ పడింది. మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రపంచ ప్రఖ్యాత రచయిత జాక్‌ జి గాన్‌ మాట్లాడుతూ ‘చిత్రాలీలె పుస్తకాలలో చెప్పే విధానం బాగుంటుంది.అంశాన్ని ఒక నవలలా ఎంతో వివరణాత్మ కంగా వివరిస్తారు. ఒక టీమ్‌ ఏర్పాటు నుండి, అందులోని వ్యక్తులు, కలుపుకుపోవాల్సిన విధా నాలు, అన్నిటినీ సమతూకం చేసుకునే విధానం వంటి అంశాలను బాగా ప్రజెంట్‌ చేశారు. ఉపయోగకరమైన ప్రమాణాలను వివరించారు. వాటికి సరైన ఉదాహరణలను కూడా జత చేశారు. వీటన్ని టివల్లే ఆ మె పుస్తకాలు ఆదరణ పొందగలుగుతు న్నాయి’ అని చెబుతున్నారు. 

తనదైన ప్రతిభ : 
chitraleela2ఒక పద్ధతి ప్రకారం అంశాలను వివరించడం అనేది అందరికీ వీలయ్యే విషయం కాదు. అందులోనూ వ్యా పార సంబంధిత అంశాలలో మరింత క్లిష్టం గా వుంటుంది. ఇక మేనేజ్‌మెంట్‌కు సంబం దించి ఎన్ని అంశాలను చెప్పినా ఇంకా అం దులో కొన్ని విభాగాలు మిగిలిపోతూనే వుం టాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుం టూ చిత్ర చేసే రచనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి. ప్రపంచ గొప్ప గొప్ప రచయితల పుస్తకాలతో పాటు చిత్రాలీలే పుస్తకాలు కూడా ఎక్కువగా వినియోగంలో వుంటున్నాయి అని ప్రముఖ రచయితలు చెబుతున్నారు. నేడు ఆమె పుస్త కాలు ప్రపంచం నలుమూలలకూ వ్యాపిస్తున్నాయి.వలం వ్యాపార దృక్పథం, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి మాత్రమే కాదు ఒక సామాన్యుడికి కూడా అన్వయిం చుకునేలా ఆమె అంశాలను తన పుస్తకాలలో వివ రించారు. అభివృద్ధి, పురోగమనం, ఉన్నత ప్రమా ణాలను పాటిచండం వంటి అంశాలను ఆమె ఎం తో వివరణా త్మకంగా తెలియజేస్తున్నారు.

కళారంగ ప్రతిభ : 
కళా రంగంలోనూ చిత్రది అరుదైన ప్రతిభ. సాంస్కృతిక, కళారంగాలు, సాహి త్యం, విద్య వంటి అనేక రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను ‘ప్రత్యేకమైన లీడర్‌షిప్‌ అవార్డ్‌ - 2011’ను కూడా అందుకున్నారు.విద్యా, కళా రంగాల్లో ఆమె చేసిన కృషికి దీన్ని అందుకున్నారు. ఆమె రాసిన పుస్తకం ‘ది 6 స్పేర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ : అన్‌లా కింగ్‌ ది డోర్‌ టు సక్సెస్‌ అండ్‌ హ్యాపీనెస్‌’కు ఆమె లిమ్కాబుక్‌ ఆప్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. 

2011 సంవత్సరానికి గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు - 2011 ఎడిషన్‌ అవార్డును అందుకున్నారు.లీటరసీ, పీస్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, సోషల్‌ విభాగాల్లో ఎన్నో వందల కొద్దీ అవార్డులు ఆమె సొంతం చేసు కున్నారు. పెయింటింగ్స్‌, అరు దైన కళా కండాలను రూపొందించడం వంటి వాటిలోనూ చిత్ర ముందే వుం టారు. ఎన్నో ఎగ్జిబి షన్లను కూడా నిర్వ హించారు.ఆమె సొంతంగా డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు.చిత్రా లీలె.కామ్‌ పేరుతో ఆమె ఓ సైట్‌ను కూ డా నిర్వహిస్తు న్నారు.
-హైమ సింగతల
surya telugu daily, March 22, 2011

No comments:

Post a Comment