
‘సరే అయితే నేను నీ ఇంటిని పడగొట్టేస్తాను చూడు’ అంటూ..
నోటితో గట్టిగా గాలిని వూదడం ప్రారంభించింది. అలా కొద్ది సేపటికే రాబీ ఇళ్లు పడిపోయింది. నక్క లోపలికి వెళ్లి రాబీని తినేసింది.
హనీ కూడా రాబీ వెళ్లిన వైపుగా నడుచుకుంటూ వచ్చింది. ఆ దారిలో దానికి ఒక మనిషి కర్రలను తీసుకెళ్తూ కనిపించాడు. హనీ అతని దగ్గరికి వెళ్ళి తనకు ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేయగలరా? అని అడిగింది.
అందుకు అతను ‘దానిదేముంది. నీకు కావలసినన్ని కర్రలు తీ సుకో’ అని ఒక పెద్ద కర్రల మోపును ఇచ్చాడు. వెంటనే హనీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని తీసుకెళ్లి ఇళ్ల్లు కట్టేసుకుంది.
తరువాతి రోజు సాయంత్రం చెడ్డ నక్క మళ్లీ వచ్చింది.

ఆ చెడ్డ నక్క బిల్లు ఇంటిని కూడా చూసేసింది. బిల్లు ఇంటి ముందుకు వెళ్ళి ‘నన్ను మీ ఇంట్లోకి రానివ్వు ఒక సారి చూస్తా ను. చాలా అందంగా వుంది మీ ఇళ్లు’ అని అడిగింది. అందుకు బిల్లు ‘నా ఇల్లు చాలా చిన్నది నువ్వు ఇందులో పట్టవు. ముందు వెళ్లిపో’ అంది.
నక్కకు కోపం వచ్చి ‘నేను నీ ఇల్లు పడగొట్టి నిన్ను చంపి తిం టాను చూడు’ అని వూదడం ప్రారంభించింది. ఎంత సేపు అలా చేసినా కూడా ఫలితం లేదు. బిల్లు ఇంటికి ఏం కాలేదు. ఇటు కలతో కట్టడం వల్ల అది గట్టిగా వుంది. విసుగొచ్చిన నక్క ఏం చేయాలో తెలియక వెళ్లిపోయింది. ఒక మంచి ప్లాన్ వేసుకుని బిల్లు ఇంటి దగ్గరికి వెళ్లింది. కిటికీ దగ్గర నించోని ‘ఇక్కడికి దగ్గరలో ఒక పొలం వుంది. అక్కడ ఎంతో మంచి రుచిగల దుంపలు దొరుకుతాయి. నువ్వు వస్తానంటే రేపు ఉదయం 6 గంటలకు వెళ్లి తెచ్చుకుందాం’ అంది. బిల్లుకు దుంపలు అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా వాటిని రుచి చూడా లని అనుకుంది. వెంటనే నక్క చెప్పిన సమయం కంటే ముం దుగానే లేచింది. ఆరు గంటలు అంటే ఐదు గంటలకే వెళ్ళి దుంపలన్నీ తెచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంది.
నక్క వచ్చి వెళ్దామా అని అడిగితే ‘నేను తెచ్చేసుకున్నాను. మీరు వెళ్లి తెచ్చుకోండి’ అని ఇంట్లో నుండే సమాధానం చెప్పింది.
నక్కకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా బిల్లును తినాలనే ఆశ తో మరుసటి రోజు మళ్లీ బిల్లు ఇంటి ముందు నుంచోని ‘రేపు ఐదు గంటలకు యాపిల్ తోటకు వెళ్దాం. పండ్లు చాలా రుచిగా వుంటాయి’ అని అరిచి వెళ్లిపోయింది.
బిల్లు మూడు గంటలకే లేచి బయల్దేరి వెళ్లింది. యాపిల్ చెట్టు ఎక్కి పండ్లు కోయడం ప్రారంభించింది. నక్క ముందుగానే అక్కడికి చేరి బిల్లు కోసం ఎదురు చూస్తోంది. చెట్టు కింద నుంచోని ఇక తెంచింది చాలు కిందికి రా ఇంటికి వెళ్దాం అంది. వెంటనే బిల్లు కొన్ని యాపిల్స్ తీసుకుని నక్క మీద వేయడం మొదలు పెట్టింది. నక్క దెబ్బ తగిలి బాధ పడుతుంటే అదను చూసుకుని పరిగెత్తింది. ఒక్క ఉదుటున ఇంటికి వెళ్లి గడియ పెట్టేసుకుంది. నక్క కూడా దాన్ని వెంబ డించుకుంటూ వెళ్లింది. ఇక ఎలాగైనా బిల్లును తినేయాలనే ఆశతో ఇంటిమీదికెక్కి అక్కడ వున్న పొగ గొట్టం ద్వారా ఇం ట్లోకి దూకింది. అప్పటికే బిల్లు ఆ గొట్టం కింది భాగంలో పెద్ద గిన్నెలో వేడినీళ్లు మరగబెట్టింది. నక్క అందులో పడగానే వెం టనే మూత పెట్టేసింది. నక్క పీడ వదిలిపోయింది. బిల్లు ఆ ఇం ట్లో హాయిగా గడిపేసింది.
-ధరణి(హైమ సింగతల)
Surya telugu daily March 20, 2011
No comments:
Post a Comment