ప్రపంచంలో 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకోవడం హర్షణీయం. ‘ది గార్డియన్’ పత్రిక ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో రచయిత్రి అరుంధతీరాయ్, పౌర హక్కుల కార్యకర్త జయశ్రీ, పర్యావరణ ప్రేమికురాలు వందనాశివ, వైట్ రిబ్బన్ అలయన్స్ కో ఆర్డినేటర్ అపరాజిత గగోయ్, గులాబీ దళం నాయకురాలు సంపత్‌పాల్ దేవిలకు అరుదైన స్థానాలు దక్కాయి.

ప్రపంచం మొత్తంగా రోల్ మోడల్‌గా వున్నవారికి వీరిలో స్థానం కల్పించారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేసిన మహిళల చరిత్రలు కూడా ఎంతో పరిశీలించారు. ఈ ఎంపికలో 3వేల మంది పాఠకుల సలహాలను, సూచనలను కూడా వారు తీసుకున్నారు. అనంతరం ఎంపికకోసం ప్రత్యే కంగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో సారా బ్రౌన్, ఎమ్మా ఫ్రూయిడ్, వైట్ రిబ్బన్ అలయన్స్ నుండి బ్రిగిడ్ మెక్‌కేన్‌విల్లె, ఆర్ట్స్ కౌన్సిల్ ఛైర్మెన్ లిజ్ ఫార్గాన్, ఛానల్ 4 న్యూస్ రిపోర్టర్ షామీరా అహ్మద్, క్లారా మార్గెట్‌సన్, నటాలి హన్మాన్, ఎమినే సానెర్, కాథరీన్ వినెర్‌లు నిర్ణే తలుగా వ్యవహరించారు.
మొదట తయారు చేసిన లిస్టును క్యాటగిరీస్‌గా విభజించి ఆయా రంగాల్లో వారి విజయాలు, వారు అనుసరించిన మార్గాలను ప్రత్యేకంగా పరిశీలించాలి. విజయాల కోసం ఎక్కువగా కష్టపడిన వారి ఆధారంగా వారికి నెంబర్లను ఇచ్చారు. అందులోనూ ఎక్కువ మందికి మార్గనిర్దేశకంగా నిలిచిన మహిళలను ఎంపిక చేశారు. ఇందులో డబ్బు లేదా,అధికారం వంటి వాటిని ఏ మాత్రం పరిగణ లోకి తీసుకోలేదని గార్డియన్ పత్రిక ఎడిటర్ చెబుతు న్నారు. ఇది కేవలం స్ఫూర్తిదాయక మహిళలకు సం బంధించనదే అని తెలిపారు.ఇందులో కొన్ని నిర్ణయాలు, కొందరి ఎంపిక వివా దాస్పదం అయినా, వారి వారి స్థాయిల్లో వాటిని పరిశీ లించిన తరువాత తీసుకున్న నిర్ణయంగా ప్రకటించారు.

ఫౌండేషన్: ముందుగా ఫౌండేషన్‌ని చిన్న చిన్న చుక్కలుగా ముఖం మీద పెట్టిన తరువాత.. దాన్ని నెమ్మదిగా పూర్తిగా పరుచుకునేలా రాసుకోవాలి. ముదురు రంగుని బ్లషర్‌తో చెంపలమీద పూర్తిగా బేస్‌లా రాసుకోవాలి.కళ్లకు: సహజ సిద్ధంగా వుండే రంగులను వుప యోగించాలి. వాటివెంట బ్రౌన్ ఐ లైనర్‌ని వేయాలి. కనురెప్పలను మస్కారాతో చక్కగా దిద్దు కోవాలి.
చెంపలపై: శరీర ఛాయ కంటే కాస్త ముదు రుగా వుండే రంగును చెంపలమీద షేడ్ వేసు కోవాలి.చెంపలకు కాస్త పైన వుండే ఎముక భాగం లో మినరల్ మేకప్ వేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మేకప్ వేసుకుంటే మరింత బాగుంటుంది. పెదవులపై: ముదురు పీచ్ రంగులను పెద వులపై వేసుకుంటే ఎంతో అందంగా మెరుస్తాయి. లిప్‌స్టిక్ వేసిన తరువాత దానిపై షైనింగ్ వుండా లంటే లిప్ గ్లాస్‌ను కూడా అప్లై చేయాలి.
-హైమ సింగతల
surya telugu daily, March 11, 2011
No comments:
Post a Comment