Search This Blog

Tuesday 15 January 2013

భా... రీ... బాగర్..!






ఎత్తు 311 అడుగులు, 705 అడుగుల వెడల్పు, 45,500 టన్నులు బరువు.. ఇవన్నీ దేనికి సంబంధించనవి అనుకుంటున్నారు... భూమి మీదున్న అతి పెద్ద వాహనం బాగర్-288 గురించి. 
ట్రాన్స్‌ఫార్మర్ సిరీస్ సినిమాలో రోబోట్ ఎన్ని విన్యాసాలు చేస్తుందో కదా..! అవసరం వున్నప్పుడు రోబోట్‌లాగా, తరువాత కార్‌లాగా, రేసింగ్ బైక్‌లా ఇలా ఎన్ని రకాలు కావాలి అంటే అన్ని రకాలుగా మారుతుంది. కానీ అది సినిమాలో కాబట్టి ఒకే. కానీ నిజంగా కూడా అటువంటి వాహనం ఒకటుంది. రోబోట్‌లాగా, డిగ్గర్‌లాగా, వాహనంలాగా ఇలా దాని రూపాన్ని ఎలా అయినా మార్చుకోగలదు. అంతేనా అది ప్రపంచంలోనే అతి పెద్ద వాహనం కూడా. దాని పేరే బాగర్-288.

జర్మనీ దేశం తయారు చేసిన వాహనం ఇది. వాహనం అంటే వాహనం కాదు మల్టీ టాస్కర్. దీని పుట్టిళ్లు జర్మనీ. మైనింగ్ రంగానికి చెందిన క్రుప్ అనే కంపెనీ దీన్ని 1978లో తయారు చేసింది. బాగర్ ప్రత్యేకతలను చూసి మొదట నాసా వాళ్లు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే అప్పటి వరకు స్పేష్ షటిల్స్‌ని తీసుకెళ్లేందుకు వాళ్లు ఉపయోగించిన ఛ్రవ్లెర్-ట్రన్స్పోర్తెర్ ప్రపంచంలో అతి పెద్దదిగా వుండేది. ఇక బాగర్ రాకతో రాకతో అది రెండో స్థానానికి చేరుకుంది. దాని స్థానంలో అంతరీక్ష నౌకలను మోస్తోంది. ఇక ఆ పని లేనప్పుడు ఖాళీగా ఏమీ వుండదు లెండి. ప్రస్తుతం బాగర్ గనుల తవ్వకాలలో బిజీగా వుంది. వంద మంది ఒక రోజంతా చేసే పనిని కేవలం ఒక గంటలోనే చేసి పారేస్తోంది. ఇంతకీ రోజుకు ఇది ఎంత బొగ్గును వెలికి తీస్తుందో తెలుసా 2,40,000 టన్నులు. దీన్ని వెలికి తీసి 24,000 లారీలను నింపుతుంది. ఇక దీని నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు కేవలం ఐదుగురు వుంటే చాలు. బాగర్ రెచ్చిపోతుంది. రోజంతా పని చేస్తూనే వుంటుంది. కొసమెరుపు ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద వాహనంగా గొప్పలు పోయే బాగర్ నిమిషానికి కేవలం రెండు మీటర్లు అంతకన్నా తక్కువ దూరం మాత్రమే నడవగలుగుతుంది.

No comments:

Post a Comment