Search This Blog

Thursday 18 October 2012

అగ్ని పర్వతం పేలింది.. బురద చిందింది...!







అగ్ని పర్వతం పేలింది. అందులో నుండి వేడి వేడి బురద బయటికి చిమ్మింది.. అదేంటి లవ కదా రావాల్సింది? అనుకుంటున్నారా కానీ ఇది నిజమే.. ఎందుకంటె అది బురద అగ్నిపర్వతం కాబట్టి..!
ఇండోనేషియలోని సెంట్రల్ జావా ప్రదేశంలోని చిన్న గ్రామం కువు. ఇందులోనే బ్లేడుక్ కువు అనే బురద అగ్ని పర్వతం ఉంది. అక్కడికి వెళ్లి చుస్తే పర్వతం కానీ.. పెలేందుకు రంద్రం కానీ ఏమి కనబడవు. కనిపించేది అంత ఓ బురద చెరువు అంతే. దాని నిండా బురద. మరి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది అంటే.. ఆ బురదే ఆ అగ్ని పర్వతం. అందులో నుండే ప్రతి రెండు మూడు నివిశాలకు ఓ సరి పేలుడు జరిగి బురద లావలాగా బైటికి చిమ్ముతుంది. కానీ దేని వాళ్ళ ఎటువంటి ప్రమాదం ఎప్పటి వరకు జరగలేదట.
ఓ చిన్న బుడగ....
ప్రతి రెండు మూడు నిమిషాలకు ఓ చిన్న బుడగ బురధలోనుంది బైటికి వస్తుంది.. అది క్రమంగా పెద్దగ అవ్తుంది. అమాంతం పేలి పోతుంది. దాని నుండి టన్నుల కొద్ది వేడి బురద బైటికి వస్తుంది. దీనితో పతే తెల్లటి నీటి ఆవిరి కూడా పోగల కమ్ముకు పోతుంది. దీని చూసేందుకు వెళ్ళిన వాళ్ళు కనీసం ౧౦ నుండి 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఎందుకంటె ఎప్పుడు ఎక్కడనుండి బురద చిన్డుతుందో చెప్పలేరు మరి.
పూర్వీకుల పని..
ఈ బురద పర్వతాన్ని స్తనికులు ఏంటో భక్తీతో కొలుస్తారు. పైగా దీన్ని వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకం అని కూడా చెప్తారు. ఈ బురదలో రెండు చోట్ల ఎప్పుడు పేలుడు జరుగుతూనే ఉంటుంది వాటికీ అవ్వ, తాతా అని పేర్లు కూడా పెట్టుకున్నారు.
ఇదొక జీవనాధారం...
ఈ బురద నుండి వచ్చే అవక్షేపంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. బురద నుండి ఉప్పును వేరు చేసి అమ్ముకుని స్తనికులు జీవిస్తున్నారు. వాళ్ళకు ఇంకా వేరే జీవనాధారం అంటూ ఏమి ఉండదు.
శాస్త్ర వేత్తలు ఏమంటున్నారంటే...
లౌత్ సుల్తాన్ లేదా హిందూ మహా సముద్రనికు సంబంధించి ఎక్కడికి సొరంగ మార్గం ఉంది ఉంటుంది. దాని వల్లే ఎలా అవుతోంది అంటున్నారు. కానీ దీనికి వాళ్ళు ఆధారాలేమీ చుపలేకున్నారు. దీని వాళ్ళ చాల సమస్యలు కూడా ఎదురవుతాయని హెచ్చరిస్తున్న.. స్తనికులు మాత్రం ఏమి పట్టిందుకోవడం లేదు.. ఎన్నో వందల ఏళ్ళుగా ఇక్కడే ఉన్న ఏమి కాలేదు అని చెబుతున్నారు.

No comments:

Post a Comment