Search This Blog

Monday 8 October 2012

ఐన్ స్టీన్ అవుట్!




ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్నే వెనక్కి నెట్టేసింది ఓ చిన్నారి. పదునైన బుర్రతో ఆయన కన్నా రెండు పాయింట్స్ ఎక్కువే కొట్టేసింది. పనిలో పనిగా ప్రపంచ మేధావులన్దరికన్నా టాప్ అయిపోయింది.
ఉదయం చెప్పిన పాఠాలే సాయంత్రానికి గుర్తు ఉండవు. అలాంటిది మిగిలిన విషయాలన్నీ ఏం గురుతు పెట్టుకునేది అంటూ సతమతమై పోతున్నారా? ఐతే ఓ సారి మీరు ఒలివియా మ్యన్నింగ్ గురుంచి తెలుసుకోవాల్సిందే. లండన్ లోని liverpoor అకాడమీలో చదువుకుంటున్న ఓ 12  ఏళ్ళ అమ్మాయి కేవలం చదువులోనే కాదు.. ప్రపంచంలో ఏ విషయం ఐన సరే ఒక్కసారి చదివితే చాలు ఇట్టే గురుతు పెట్టుకుంటుంది. కొన్ని వందల పేర్లు ఐన సరే క్రమం తప్పకుండ అప్పజేప్పేస్తుంది. ఎటువంటి గణిత ప్రశ్నలకైన సులువుగా పరిష్కారం చెప్పేస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు ప్రపంచ మేధావుల సంగం మెన్స చెబుతోంది. ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ గురిన్మ్చి తెలుసుగా ప్రపంచ ప్రఖ్యాత మేధావులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళను మించిన్న మేదస్సు ఒలివియాకు ఉందని ఆ సంగం చెబుతోంది.
ఓ కొత్త సెలెబ్రిటి...
మేన్సాలో చేరిపోవడంతో ఇప్పుడు ఒలివియా వాళ్ళ స్కూల్ లో సెలెబ్రిటి అయిపోయింది. అంతేనా ఇందుకు తను చాలానే కష్ట పడిందంట. 'చాల మంది నన్ను వాళ్ళ హోం వర్క్ చేసి ఇవ్వమని అడుగుతుంటారు. పైగా నాకు కూడా వాళ్ళకు చెప్పడం అంటే చాల ఇష్టం. దానితో పాటుగా ఎవరైనా దీన్ని చేసి చూపించు అంటే ఇక వదిలి పెట్టన్ను. అలా నెమ్మదిగా నా మెదడుకు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టడం మొదలు పెట్టాను' అని ఆనందంగా చెబుతోంది.
మీరు చేరొచ్చు...
మేన్సాను 1946 లో ఇంగ్లండ్కు చెందినా రోలండి బెర్రిఎల్, లాన్స్ వేర్ అనే వాళ్ళు ప్రారంభించారు. వీళ్ళు తెలివైన వాళ్ళను ఒక చోట చేర్చడం కోసం దిన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సంస్థకు 100  దేసక్కి సబ్యులున్నారు. 40 దేశాల్లో మెన్సా తన సేవలను ప్రత్యక్షంగా అందిస్తోంది. ఇందులో చేరాలంటే స్తానికంగా ఉన్న మెన్సా కేంద్రాన్ని సంప్రదించాలి. వాళ్ళు పెట్టె టెస్ట్లు పాసయ్యరంటే మీరు కూడా ప్రపంచ మేధావులు అయిపోవచ్చు. ఇంకేడుకలస్యం మీ మెదడుకు పదును పెట్టడం ఇప్పటి నుండే ప్రారంభించండి మరి.

No comments:

Post a Comment