Search This Blog

Thursday 17 March 2011

అనాగరిక సంప్రదాయంపై పోరాడి గెలిచిన సాహసి...

మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి.. అక్కడి అనాగరిక సంప్రదాయాలను సవాలు చేసిన సాహసి సునీత.. తల్లిదండ్రులు నోరు నొక్కుతున్నా.. తోటి వారు తోడు రాకున్నా..తనపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇదేం శిక్ష అంటూ గ్రామ పంచాయితీ పెద్దలను నిలదీసింది.తనపై అత్యాచారానికి తెగబడ్డ మృగాలకు శిక్షపడే వరకు పోరాడింది. సాహసబాలికగా అవార్డులందుకుంది. ఇంత దూరం ప్రయాణించి తిరిగి తన సాధారణ జీవితానికి వెళ్ళలేనని చెబుతోంది. తన తెలివి తేటలతో తన చుట్టూ వుండే సమాజానికి మంచి చేస్తానని అంటోంది.

SUNITAసాహస బాలలకు ప్రతి ఏడాది ఇచ్చే అవార్డుల కార్యక్రమం లో వెలిగిన గిరిజన అమ్మాయి సునీత. అక్కడ ఉన్న వా రందరికీ ప్రత్యేకమైంది ఆమె సాహసం. జీవి తంలో ఎదురైన చేదు సంఘటనను గుప్పిట పెట్టుకుని పోరాడి విజయం సాధించి అక్కడి అవార్డును అందుకుంది. 

అనాగరిక సంప్రదాయాన్ని ఎదిరించి.. 
పదహారు సంవత్సరాల సునీత ముర్ము పశ్చి మబెంగాల్‌లోని వెనుకబడిన జిల్లాలో ఒక్క టైన బిర్బంలోని బుర్తోలా గ్రామానికి చెందిన యువతి. చదువు నామ మాత్రమే. కుటుంబ పరిస్థితుల వల్ల రోజు వారి కూలీగా మారి త న తల్లిదండ్రులను పోషించడం కోసం కష్టా లను తలకెత్తుకుంది. పనిచేసే చోట పరిచ యం అయిన పక్క గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి వారి తెగ కాదు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలి సి సునీతపై పంచాయితీ పెట్టారు. 

sunithaవందల మంది ముందు ఆమెను నగ్నంగా చేసి గ్రామం చుట్టూ తిప్పారు. గ్రామంలోని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వచ్చి సునీ తను కాపాడేందుకు ప్రయత్నించలేదు. గ్రా మంలో మొత్తం ఎనిమిది కిలోమీటర్లు నడి పించి అక్కడే వదిలేశారు. పైగా ఆ స్థితిలో వు న్న సునీతపై వీడియో చిత్రీకరించి చుట్టు పక్కల అందరికీ ఎంఎంఎస్‌ద్వారా పంపా రు. అలా చేసిన వారు కూడా సునీతకు చా లా దగ్గరి వారే. బాగా పరిచయం వున్నవారే.మిగిలిన వారికి ఇదొక హెచ్చరిగా ఆ గ్రామ పెద్దలు జారీ చేశారు. ఇంకెవరైనా ఇలాంటి పనులు చేస్తే ఇదే శిక్ష అన్న సంకేతాన్ని పం పారు. ఆ రోజును ఒక పండుగ దినంగా వా ళ్లు ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు.

రెండు నెలల పాటు సునీత ఇంటికే పరిమి తం అయిపోయింది. చుట్టు పక్కల వారందరూ ఆ సంఘటనను మర్చిపోయి మామూ లుగా వుండమని సలహాలు ఇచ్చారు. తల్లి దండ్రులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ రెండు నెలల్లో సునీత ఆ సంఘటనను తలచుకోని రోజంటూ లేదు. రెండు నెలల తరువాత ఆ సంఘటనకు సంబంధించి వి చారించేందుకు పోలీసులు ఆమె దగ్గరికి వచ్చారు.తల్లిదండ్రులు అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులకు వాంగ్మూలం ఇస్తే.. సునీత ధై ర్యంగా వచ్చి జరిగిన దంతా వారికి తెలియ జేసింది. రెండు రోజుల తరువాత కేసు న మోదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారందరినీ గుర్తించింది. ఆమె నిర్ణయాన్ని మార్చేందుకు సునీత తల్లిదండ్రులు ఎంతగా నో ప్రయత్నించారు.

కానీ సునీత మాత్రం వారి మాటలకు లొంగలేదు. జీవితాంతం ఆ సంఘటను తలచుకుంటూ బాధపడేకన్నా త న స్థితికి కారణమైన వాళ్లను చట్టానికి అప్ప గించాలని నిర్ణయించుకుంది. ‘నాకు ఎంతో ఆశ్చర్యంగా వుంది. జరిగిన విషయాన్ని మ ర్చిపోవాలని అంటున్నారు. అంటే నేను అదే బాధతో జీవితాంతం బతకాలా? సంప్రదా యం పేరుతో ఒక అమ్మాయిని ఇలా చేస్తే ఏ ఒక్కరు ముందుకు రాకపోగా.. నేను ఎదిరి స్తుంటే ఇలా వెనుకకు లాగడం మంచిదా..?’ అని సునీత ప్రశ్నిస్తోంది. కానీ ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

Sunita-Murmuకానీ సునీత మాత్రం ఆగలే దు. ఈకేసును పరిశోధించిన సబ్‌ డివిజనల్‌ అధికారి రామ్‌ పుర్హత్‌కు వివరాలను అందిం చింది. తనపై చిత్రీకరించిన ఎంఎంఎస్‌లన కూడా చూపింది. ఒక అమ్మాయి తనకు జరి గిన అన్యాయంపై అంత ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్‌ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘ఆమె ఎంతో బాధలో కూరు కుపోయి వుంటుందని అనుకున్నాం. కానీ ఎంతో ధైర్యంగా వుంది. మాతో సహకరించ దు అని కూడా అనుకున్నాం. కానీ మా కన్నా ఎక్కువగా ఆమె దీనిపై పట్టుదలతో వ్యవహ రించింది’ అన్నారు. చివరిగా సునీత పోరా టానికి అన్ని వైపుల నుండి మద్దతు లభించింది.

నిందితుల అరెస్టు... 
రెండు రోజుల తరువాత ఆరుగురు వ్యక్తుల ను అరెస్టు చేశారు. వారందరినీ అరెస్టు చేసి నందుకు గ్రామంలో పెద్ద గోడవ మొదలైంది కానీ చివరికి ప్రశాంతంగా ముగిసింది. చు ట్టు పక్కల వారి నుండి సునీతకు ప్రమాదం పొంచి వుండటంతో అక్కడి నండి సునీతను పుష్పరాగ్‌ రామ్‌పుర్హత్‌లోని హోమ్‌కు తర లించారు.ఇప్పటికీ ఆ అమ్మాయి అక్కడే వుంటోంది. అక్కడే కుట్లు, అల్లికలు నేర్చు కుంది. హోమ్‌ అధికారులు ఆమె పేరు మీద ఒక బ్యాంకు ఖాతాను కూడా ఇప్పించారు. 

అధికారులు అండగా... 
బీర్బమ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ సుమిత్రా మోహన్‌ సునీకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. రాష్టప్రతి సా హస అవార్డుకు ఆమె పేరును పంపారు. ‘ఆ మె ఇప్పుడు తన జీవితాన్ని తీర్చి దిద్దుకుంది. మిగిలిన వారికన్నా ఎంతో తొందరగా వి షయాలను గ్రహించగలదు. అన్నిటినీ అ ర్థం చేసుకోగల నేర్పు వుంది’ అని అన్నారు.‘కానీ కుటుంబ సభ్యులు మాత్రం సునీత విషయంపై మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. చుట్టు పక్కల నుండి దాడులు జరుగు తాయేమోనని వారు భయపడుతున్నారు. పై గా ఇక్కడున్నదంతా గిరిజనతెగ.వారి కట్టు బాట్లు.. శిక్షలు అనాగరికంగా వుంటాయి. సునీత తిరిగి అక్కడికి వెళ్ళేందుకు ఇష్టపడ టం లేదు. కానీ వారి తల్లిదండ్రులతో మా త్రం కలిపేందుకు ప్రయత్నిస్తాం’ అని సత్య భారత బెనర్జీ వెల్‌ఫేర్‌ హోం సూపరిండెంట్‌ చెబుతోంది. 

నాకంటూ ఓ ఆశయం ఉంది..
‘నేను ఏ తప్పూ చేయలేదు. అలా అని సిగ్గు పడటం లేదు. రోజు వారి కూలి చేసి దాంతో కుటుంబాన్ని పోషించడం నాకు ఇష్టం లేదు. నేను చదువు కుంటాను. నా జీవితాన్ని నేనే నిలబెట్టుకుంటాన’ అని సునీత ధైర్యంగా చె బుతోంది. తమ తెగలో వుండే ఇటువంటి అ నాగరిక చర్యల పట్ల పోరాడేందుకు సిద్ధం అ వుతోంది. బుర్తోలా గ్రామంలోని సునీత స్నే హితురాలు మాట్లాడుతూ ‘నాకు చాలా సం తోషంగా వుంది. సునీత చాలా మంచి నిర్ణ యం తీసుకుంది. ఇంటి నుండి వెళ్ళిపోయి మరీ పోరాటం చేసింది.తను బాగుండాలని కోరుకుంటున్నాను. మిగిలిన అమ్మాయిలం దరూ కూడా సునీతను ఎంతో పొగుడుతు న్నారు. బాగా బుద్ధి చెప్పింది’ అని అంటున్నారు.
-హైమ సింగతల
March 17, 2011

No comments:

Post a Comment