Search This Blog

Wednesday 27 October 2010

చిన్నారుల దీపావళి కానుక ''చిరాగ్‌''

దీపావళి అంటేనే ఎక్కడ లేని ఉత్సాహం. ఎక్కడ చూసినా దీపాలు.. చుట్టూ వెలు గులు... బాణా సంచా, కొత్త బట్టలు, మిఠాయిలు.. సంతోషం... సందడి.. మన కు తెలిసిన దీపావళి ఇది. ఓ సేవా సంస్థకు మాత్రం ఈ రోజు చాలా ప్రత్యేకం.. దీపాలతో వెలుగును తేవడం కాదు.. ప్రత్యేకంగా ఈ రోజున పేద చిన్నారుల జీవితాల్లో దివ్వెను వెలిగిస్తోంది. వారి పెదవులపై చిరునవ్వులను పూయిస్తోంది.భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు విద్యను కానుకగా అందిస్తోంది.


diwaliచెనై్నకి చెందిన ఎన్‌జిఓ సంస్థ చిరాగ్‌. చెడు నిర్మూలనకు, మంచి పనుల ప్రారంభానికి మంచి రోజైన దీపావళిని నిజమైన దీపావళిగా జరుపుతోంది. ప్రతి సంవత్సరం దీపావళి కాను కలుగా ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆ సంస్థ స్థాపకురాలు శ్రీమతి. ఏటా కొందరు పేద చిన్నారులను దత్తత తీసుకుని వారికి విద్యనందిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులనూ ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దీపా వళి కానుకగా వీలైనంత ఎక్కువ మంది చిన్నారులకు విద్యనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ఏర్పాటు వెనుక గల విషయాలను శ్రీమతిని అడిగితే...

�నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం సంస్థ తరపున క్రిస్టమస్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంస్థ తరపున కొంతమంది పేద చిన్నారులు కోరిన బహుమతులను అందజేస్తా రు.ఇందుకు ఉద్యోగి వంద డార్ల వరకు వెచ్చించొచ్చు. అలా ఆ కార్యక్రమంలో నేను ఓ అమ్మా యిని బయటికి తీసుకెళ్లి తనకు కావలసిన వస్తువులు తీసుకోమని చెప్పాను. ఆ షాపు అంతా తిరిగి ఆ అమ్మాయి తనకు కావలసిన బట్టలు, బొమ్మలు తీసుకుంది. అలా ఆ అమ్మాయి తీసు కుంటుంటే ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేను. తరువాత ఒక జత షూష్‌ తీసుకుంది. కానీ అప్పటికే బడ్జెట్‌ వంద డాలర్లు దాటిపోయింది. దీంతో అది చూసి ఆ అమ్మాయి వాటిని అక్కడే పెట్టేసింది. అది చూసిన నాకు ఎంతో బాధగా అనిపించింది. వెంటనే వాటిని తీసుకోమని చెప్పాను. 

తను చాలా ఆశ్యర్యంగా నా వైపు చూసింది. నేను నిజంగానే చెప్తు న్నాను... తీసుకో అని చెప్పాను.మీరు నిజంగా చెప్తున్నారా...? అని ఆశ్చర్యకరంగా అడిగింది. తీసుకో అన్న వెంటనే వాటిని తీసుకుని హత్తుకుంది. తరువాత ఇందుకు ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పిందో గుర్తే లేదు. కొన్ని రోజుల తరువాత నాకు ఆ చిన్నారి తల్లి నుండి ఓ లేఖ వచ్చింది. అం దులో ఆ తల్లి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలిపింది. తన కూతురి జీవితంలో ఈ క్రిస్టమస్‌ ను మర్చిపోలేని విధంగా చేసినందుకు ఆనందపడింది. అప్పుడే నిర్ణయించుకున్నాను భారత దేశానికి వచ్చిన తరువాత తప్పకుండా పేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలని. అందుకు నాకు చాలా కాలమే పట్టింది� అని శ్రీమతి చెప్పింది. 

ఏర్పాటులో స్నేహితుల తోడ్పాటు...
2005లో తను తీసుకున్న నిర్ణయాన్ని తన స్నేహితులు పుష్ప, జయశ్రీ, స్వర్ణల ముందు వుంచింది శ్రీమతి. ఇందుకు వారు ఎంతో సంతోషించారు. అందులో తమవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందరూ కలిసి ఎంతో ఆలోచించి ఒక నిర్ణ యం తీసుకున్నారు. దీపావళి నాడు �చిరాగ్‌�కు జన్మనిచ్చారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీపావళి కానుకగా స్థానిక పాఠ శాలలకు వాలెంటీర్లను పంపి అక్కడి పేద చిన్నారులకు ఒక విష్‌ కార్డును ఇస్తారు. దానిపై వారి కోరికను రాయమని చెప్తారు.అనం తరం ఆ కార్డులను తీసుకుని వాటిని పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యో గాలు చేసే వారికి అందజేసి విషయాన్ని తెలియజేస్తారు. ఒకవేళ వారు ఆ కార్డులో వున్న దాన్ని అందించేందుకు ముందుకు వస్తే వారి నుండి వాటిని సేకరించి తిరిగి ఆ పాఠశాలల్లోని చిన్నారుల కు దీపావళి రోజున కానుకగా అందిస్తారు. 

విద్యనందించే ఉద్దేశంతో...
సంస్థ కేవలం చిన్నారులకు బహుమతులను ఇవ్వడం ద్వారానే వారి జీవితాల్లో వెలుగు నింపలేమన్న ఉద్దేశంతో వారికి చదువు చెప్పించాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది. 2008లో తొలి సారిగా పది మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి చదువు కావాల్సిన మొత్తాన్ని అందించింది. అదే సంవత్సరం గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. అందులో పైతరగతులకు ఉపాధ్యాయులను కూడా నియమించిం ది. ఈ సంస్థ తన సేవలను మరింతగా పెంచేందుకు కోగ్నిజెంట్‌ ట ెక్నాలజీస్‌, దాని అనుబంధ సేవా సంస్థల ద్వారా కూడా సేవలం దిస్తున్నారు.

పాఠశాలల దత్తత...
ఈ సంస్థ ఇటీవల వెల్లూరుకు దగ్గరలోని ఓ గ్రామ పాఠశాలను కూడా దత్తత తీసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుల నియా మకం, వసతులు వంటివి ఏర్పాటు చేసింది. అలాగే తొమ్మిదవ తరగతి చదువుతున్న 20 మంది చిన్నారులకి ఈ సంస్థ ద్వారా కోచింగ్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఇది వారి ఉన్నత విద్యా భ్యాసం కోసం ఉపయోగపడేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. 

ఈ ఏడాది...
ఈ ఏడాది కూడా ఆ పనిలోనే వున్నారు చిరాగ్‌ నిర్వాహకులంతా. ఇప్పటికే వాలెంటీర్ల ద్వారా గ్రామీణ, పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో కార్డుల ద్వారా వారి కోరికలను సేకరించారు. వాటిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందించేవారికి అందజేస్తున్నారు. వారిచ్చే వాటిని త్వరలోనే రాబోతున్న దీపావళికి వీటన్నిటినీ చిన్నా రులకు కానుకలుగా అందిజేయనున్నారు. 

మీరు కూడా చేయొచ్చు...
సంస్థ ఇప్పుడు కొద్ది మంది సాయంతోనే తన కార్యక్రమాలు నిర్వ హిస్తోంది. భవిష్యత్తులో వాటిని మరింతగా విస్తరించాలని చూ స్తోంది. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి విద్యార్థులకు స్పా న్సరర్‌గా వుండాలని కోరుతోంది. ఒకవేళ వాలెంటీర్‌గా సంస్థ తరపున పనిచేయడానికైనా సరే ముందుకు వెళ్ళొచ్చు. స్పాన్సర ర్‌గా అయితే ప్రతి సంవత్సరం ఓ పేద విద్యార్థికి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు మొత్తం రూ.5000 రూపాయలు అందజేయాల్సి వుంటుంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాల నుకునే వారు... లేదా సాయం చేయాలనుకునే వారు ఠీఠీఠీ.ఛిజిజీట్చజీఛీజ్చీ.ౌటలో వివరాలన్నీ చూడొచ్చని శ్రీమతి, ఆమె స్నేహితురాళ్ళు చెబుతున్నారు.
-హైమ సింగతల
Surya telugu daily

No comments:

Post a Comment