Search This Blog

Friday, 2 May 2014

భలే దుంప..!

b-kathaఅనగనగా కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక తాత వుండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం దుంపలను పండించేవాడు. అవి ఎంతో లావుగా చాలా రుచిగా వుండేవి. ఎప్పటిలాగానే ఆ ఏడాది కూడా దుంపల విత్తనాలను చల్లి వాటిని జాగ్రత్తగా పెంచడం ప్రారంభించాడు. ఆ ఏడాది మాత్రం ముసలాయన చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఓ ఈ సారి మాత్రం ఓ పెద్ద దుంప తయారైంది. దాన్ని ఇంకా పెంచాలని ఆ తాత అలాగే వదిలేశాడు. ఇంకా పెద్దగా అయ్యే వరకు వుంచేశాడు. ఆ దుంప రోజు రోజుకీ ఇంకా ఇంకా పెద్దగా పెరిగి పెద్దదయిపోతోంది. అది ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే దాన్ని చూసి అందరూ చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. కొంత కాలం తరువాత ఆ దుంప పెరగడం ఆగిపోయింది. అప్పుడు తాత ఆ దుంపను తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు ఆకులను పట్టుకుని లాగడం ప్రారంభించాడు. ఎంత సేపు లాగినా అది కొంచెం కూడా కదలేదు. అలా పాపం లాగుతూనే వున్నాడు. ఊహూ.. ఆ దుంప మాత్రం కదల్లేదు.

ఇక విసుగొచ్చిన తాత వాళ్ళ అవ్వను పిలిచి కాస్త సాయం చేయమని అడిగాడు. తాత ఆ చెట్టును పట్టుకుని లాగుతుంటే అవ్వ ఆయన్ను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి అలా ఎంత సేపు లాగినా కూడా అది రాలేదు. కొంచెం కూడా కదల్లేదు. ఇక అవ్వ కూడా చేసేదేమీ లేక తన మనవరాలిని సాయం చేసేందుకు పిలి చింది. మనవరాలు పరిగె త్తు కుంటూ వచ్చింది. వాళ్ల అవ్వను పట్టుకుని లాగడం మొదలు పెట్టింది. అవ్వేమో తాతను పట్టుకుని లాగుతోంది. తాతేమో ఆకుల్ని పట్టుకుని లాగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ దుంప బయటికి రానే లేదు.

మనవరాలేమో తన పెంపుడు కుక్కను సాయం చేయమని పిలిచింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని, అవ్వ తాతని, తాతేమో దుంప ఆకుల్ని పట్టుకుని లాగడం మొదలు పెట్టారు. ఊహూఁ అయినా కూడా దుంప బయటికి రాలేదు. ఎంత సేపు ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు.

వెంటనే కుక్క తన స్నేహితురాలు పిల్లిని సాయం చేయమని బతిమాలింది. తన స్నేహితుడి బాధ చూడలేక పిల్లి కూడా వచ్చి వాళ్ళకు సాయం చేయడానికి కుక్కను పట్టుకుని వెనక్కు లాగడం ప్రారంభించింది. ఇలా ఒకర్ని ఒకరు పట్టుకుని ఎంత ప్రయత్నించినా దుంప మాత్రం బయటికి రాలేదు.
చివరికి పిల్లికి కూడా విసుగొచ్చింది. వెంటనే ఆలోచించి తన స్నేహితురాలు ఎలుకను సాయం కోరింది. ఎలుక కూడా పరిగెడుతూ వచ్చేసింది. ఎలుక పిల్లి చేయి పట్టుకుని లాగింది. పిల్లి కుక్కను పట్టుకుని లాగింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని పట్టుకుని గట్టిగా లాగాయి. అవ్వ తాతను గట్టిగా లాగింది. తాత చెట్టు ఆకులను పట్టుకుని చాలా కష్టపడి లాగి లాగి... చివరికి చాలా సేపటి తరువాత దుంప బయటికి వచ్చేసింది. అంతా ఒకరి మీద ఒకరు పడిపోయారు. తరువాత అందరూ కలిసి దుంపను పంచుకున్నారు. 
-ధరణి(హైమ సింగతల)
budugu, surya telugu daily, March 6, 2011

Thursday, 1 May 2014

భారతీయ మహిళలు... స్ఫూర్తిదాయక నాయికలు..

ప్రపంచంలో 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకోవడం హర్షణీయం. ‘ది గార్డియన్‌’ పత్రిక ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో రచయిత్రి అరుంధతీరాయ్‌, పౌర హక్కుల కార్యకర్త జయశ్రీ, పర్యావరణ ప్రేమికురాలు వందనాశివ, వైట్‌ రిబ్బన్‌ అలయన్స్‌ కో ఆర్డినేటర్‌ అపరాజిత గగోయ్‌, గులాబీ దళం నాయకురాలు సంపత్‌పాల్‌ దేవిలకు అరుదైన స్థానాలు దక్కాయి.

Jayshreeఈ జాబితాలో మరికొందరు భారతీయ సంతతికి చెందిన సిఇఓ ఇంద్రానూయి, దర్శకురాలు మీనా నాయర్‌, సౌత్‌ ఆల్‌ బ్లాక్‌ సిస్టర్స్‌ వ్యవస్థాపకురాలు ప్రజ్ఞాపటేల్‌, కర్మ నిర్వాణ సంస్థ స్థాపకురాలు జస్వీందర్‌ సంఘేరా కూడా స్ఫూర్తిదాయక మహిళల్లో స్థానం సంపాదించుకుని భారతీయ మహిళల పేరును ఖం డాంతరాలకు వ్యాపించేలా చేశారు. ఈ 100 మంది మహిళలను ఎంపికలో పరిగణ లోకి తీసుకున్న అంశాలు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, వారి ప్రతిభ వంటివాటిని ప్రా మాణికంగా తీసుకున్నారు. 

ప్రపంచం మొత్తంగా రోల్‌ మోడల్‌గా వున్నవారికి వీరిలో స్థానం కల్పించారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేసిన మహిళల చరిత్రలు కూడా ఎంతో పరిశీలించారు. ఈ ఎంపికలో 3వేల మంది పాఠకుల సలహాలను, సూచనలను కూడా వారు తీసుకున్నారు. అనంతరం ఎంపికకోసం ప్రత్యే కంగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో సారా బ్రౌన్‌, ఎమ్మా ఫ్రూయిడ్‌, వైట్‌ రిబ్బన్‌ అలయన్స్‌ నుండి బ్రిగిడ్‌ మెక్‌కేన్‌విల్లె, ఆర్ట్స్‌ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ లిజ్‌ ఫార్గాన్‌, ఛానల్‌ 4 న్యూస్‌ రిపోర్టర్‌ షామీరా అహ్మద్‌, క్లారా మార్గెట్‌సన్‌, నటాలి హన్మాన్‌, ఎమినే సానెర్‌, కాథరీన్‌ వినెర్‌లు నిర్ణే తలుగా వ్యవహరించారు.

మొదట తయారు చేసిన లిస్టును క్యాటగిరీస్‌గా విభజించి ఆయా రంగాల్లో వారి విజయాలు, వారు అనుసరించిన మార్గాలను ప్రత్యేకంగా పరిశీలించాలి. విజయాల కోసం ఎక్కువగా కష్టపడిన వారి ఆధారంగా వారికి నెంబర్లను ఇచ్చారు. అందులోనూ ఎక్కువ మందికి మార్గనిర్దేశకంగా నిలిచిన మహిళలను ఎంపిక చేశారు. ఇందులో డబ్బు లేదా,అధికారం వంటి వాటిని ఏ మాత్రం పరిగణ లోకి తీసుకోలేదని గార్డియన్‌ పత్రిక ఎడిటర్‌ చెబుతు న్నారు. ఇది కేవలం స్ఫూర్తిదాయక మహిళలకు సం బంధించనదే అని తెలిపారు.ఇందులో కొన్ని నిర్ణయాలు, కొందరి ఎంపిక వివా దాస్పదం అయినా, వారి వారి స్థాయిల్లో వాటిని పరిశీ లించిన తరువాత తీసుకున్న నిర్ణయంగా ప్రకటించారు. 

womensవిధుల్లోనూ అందంగా...కొన్ని రకాల విధుల్లో ముఖ్య పాత్ర పోషించే మహిళలకు రూపం.. మాట తీరు..చాలా అవసరం.రిసెప్షనిస్టు వంటి ఉద్యోగాలకు ఇవి మరింత ముఖ్యం. చూడ చక్కని రూపంతో..పాజిటివ్‌ దృక్పథంతో వీరు పని చేయాల్సి వుంటుంది.అందుకు కొన్ని కొన్ని చిట్కాలను కూడా పాటించాల్సి వుంటుంది. ఆఫీసుకు వెళ్ళేప్పుడు మరీ ఎక్కువగా హం గులతో కాకుండా సహజ సిద్ధంగా వుండేం దుకు ప్రయత్నించాలి. కంటి రెప్పలకు మరీ ఎక్కు వగా కాకుండా లైట్‌గా మస్కారా వుపయోగించాలి.చెంపలమీద ముదురు రంగులను మరచి లేత రంగుల్లో వుండే షేడ్స్‌ వేయాలి. పెదవులపై పీచ్‌ షేడ్స్‌ని వేసుకుంటే మంచి ఆకర్షణ వస్తుంది పెద వులు కూడా అందంగా మెరుస్తాయి. 

ఫౌండేషన్‌: ముందుగా ఫౌండేషన్‌ని చిన్న చిన్న చుక్కలుగా ముఖం మీద పెట్టిన తరువాత.. దాన్ని నెమ్మదిగా పూర్తిగా పరుచుకునేలా రాసుకోవాలి. ముదురు రంగుని బ్లషర్‌తో చెంపలమీద పూర్తిగా బేస్‌లా రాసుకోవాలి.కళ్లకు: సహజ సిద్ధంగా వుండే రంగులను వుప యోగించాలి. వాటివెంట బ్రౌన్‌ ఐ లైనర్‌ని వేయాలి. కనురెప్పలను మస్కారాతో చక్కగా దిద్దు కోవాలి.

చెంపలపై: శరీర ఛాయ కంటే కాస్త ముదు రుగా వుండే రంగును చెంపలమీద షేడ్‌ వేసు కోవాలి.చెంపలకు కాస్త పైన వుండే ఎముక భాగం లో మినరల్‌ మేకప్‌ వేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ వేసుకుంటే మరింత బాగుంటుంది. పెదవులపై: ముదురు పీచ్‌ రంగులను పెద వులపై వేసుకుంటే ఎంతో అందంగా మెరుస్తాయి. లిప్‌స్టిక్‌ వేసిన తరువాత దానిపై షైనింగ్‌ వుండా లంటే లిప్‌ గ్లాస్‌ను కూడా అప్లై చేయాలి.
-హైమ సింగతల
surya telugu daily,  March 11, 2011

Thursday, 17 January 2013

సైన్సు జీనియస్!




ఏడేళ్ల సైన్స్ జీనియస్ పృథ్విక్. జంతు శాస్త్రానికి సంబంధించి రెండు పుస్తకాలను రాసేశాడు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం 'వెన్ డైనోసార్స్ రోమ్డ్ ది ఎర్త్'తో సైన్స్ ప్రపంచంలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాడు. 


నాలుగో తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీనియర్స్‌కు సైన్స్ పాఠాలు చెప్తున్నాడు. 'డైనోసార్లు మిలియన్ సంవత్సరాల కిత్రం భూమి మీద జీవించాయి. అందులో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా కనుక్కోవాల్సినవి చాలానే వున్నాయి' అని చెబుతూ తన తరువాతి పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమవుతున్నాడు ఏడేళ్ల పృధ్విక్. 165 ఐక్యూతో మేధావులను కూడా వెనక వరుసకి నెట్టేశాడు దుబాయ్‌లో బ్రిటీష్ సైన్స్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ భారతీయ చిన్నారి. అతని గది నిండా డైనోసార్ల బొమ్మలే. జంతువులపై పుస్తకాలు, సీడీలు, సినిమాలకు కొదవే వుండదు. ఎక్కడ చూసినా అవే. అలా అని వాటితో ఆడుకునేందుకు కాదు. పరిశోధనల కోసమే వాటిని సేకరించాడు. అందులో ఏ రకమైన డైనోసార్ బొమ్మ చూపించినా వాటి లక్షణాలు, పేరు, వివరాలు ఇలా అన్నీ ఠక్కున చెప్తేస్తాడు. భూమి పుట్టుకకు సంబంధించిన అంశాలు, జీవం ఏర్పడటానికి ముందు ప్రపంచం, డైనోసార్లు, సైన్స్, మ్యాథ్స్ ఇలా దేని గురించి అడిగినా చక్కగా వివరించేస్తాడు. ఇందుకు వాళ్ల అమ్మ ఇందిర, నాన్న అశోకే కారణం అని చెప్తున్నాడు. 
ఆరు నెలల వయసులోనే మాటలు నేర్చిన ఈ చిన్నోడు అప్పటి నుంచే భూమి గురించి వాళ్ల తాతను ప్రశ్నలు అడిగే వాడట. జంతువులు, వాటి పుట్టుక, మనిషి పుట్టుక ఇలా ప్రతి దాని గురించి ప్రశ్నించేవాడట. తెలిసినంత వరకు చెప్పేవారట. ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చేసరికి పృథ్విక్ సందేహాలు తీర్చేందుకు వాళ్ల తాతయ్య పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వచ్చేదట! అలా మొదలైన ఆసక్తి భూమి పుట్టుక, శిలాజ శాస్త్రం, ఫిజిక్స్, జీవం ఆవిర్భావం వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాల అధ్యయనానికి చేరుకుంది. తెలుసుకోవడమే కాదు సందేహాల నివృత్తి కోసం పరిశోధన, ప్రయోగాలు కూడా మొదలు పెట్టాడు. ఫలితంగానే 2010 బ్రిటీష్ సైన్స్ అసోసియేషన్ అందించే మెగాస్టార్ సైన్స్ క్రెస్ట్ అవార్డును అందుకున్నాడు. బ్రిటీష్ కౌన్సిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారాడు. అన్నిటికన్నా పృథ్విక్‌కి అమితాసక్తి కలిగించేది డైనోసార్లు. వాటిపై పరిశోధనలు మొదలు పెట్టాడు. 
మూడవ తరగతిలో వుండగా పాఠశాలలో ఓ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయిన వాళ్ల టీచర్ వీటన్నిటినీ ఓ పుస్తకంగా రాయమని ప్రోత్సహించింది. సంవత్సర కాలం పాటు అనేక పుస్తకాలను అధ్యయనం చేసి, సందేహాలను తొలగించుకుని ఇటీవలే వాటిపై పుస్తకాన్ని విడుదల చేశాడు. రెండవ పుస్తకం కూడా పూర్తి చేశాడు. కేవలం డైనోసార్ల గురించే కాదు లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో కూడా జీనియస్ అయిన ఈ అబ్బాయి పెద్దగైన తరువాత ఓ పెద్ద శిలాజ అధ్యయన శాస్త్రవేత్త కావాలని కలలుగంటున్నాడు. మరి తన కల నెరవేరాలని లిటిల్స్ తరపున పృిథ్విక్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం...

Tuesday, 15 January 2013

ఐస్ పండగ









పండుగ పేరు చెప్తే ఎంత హాయిగా అనిపిస్తుందో.. కానీ చైనాలో జరుపుకునే ఓ పండుగ పేరు చెప్తే చలేస్తుంది.. కాదు కాదు వణికిస్తుంది.. ఆ చిత్రమైన పండుగ కబుర్లేంటో తెలుసుకుందాం పదండి..!
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చైనాలోని హార్బిన్ అద్భుతంగా ముస్తాబయ్యింది. వేలాది మందికి స్వాగతం పలుకుతోంది. అక్కడి వెళ్లిన వారంతా అబ్బో ఎన్ని వింతలో అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారట. పగలు ధవళ వర్ణంలో, రాత్రికి రంగుల్లో కనిపించే ఈ వింతల కోసం ఎన్నో దేశాల నుండి కూడా అతిధులు వస్తున్నారని వినికిడి. ఇంతకీ అక్కడ జరుగుతోంది ఏంటంటే ఐస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అంటే చైనాలోని పిల్లలకు చాలా ఇష్టమట.
ఏముంటాయంటే..
పెద్ద పెద్ద కోటలు, రాజభవనాలు, ప్రముఖ పట్టణాలు ఇవన్నీ నమూనాలే లెండి. పైగా ఇవన్నీ చేసింది దేనితో అనుకుంటున్నారు.. మంచుతో. ఇంకా పెద్ద పెద్ద కళాకృతులు కూడా ప్రతి ఏడాదిలాగానే కొలువుతీరాయి. ఈ సారి మరో ప్రత్యేకత ఇందులోకి వచ్చి చేరింది. అదే ప్రపంచాన్ని ఊపేసిన స్టెప్స్ గ్యాంగనమ్. దీనికి కూడా ఈ సారి ఐస్ ఫెస్టివల్‌లో చోటు దక్కింది. 
పెద్ద వింత..
ప్రపంచంలో జరిగే ఐదు అతి పెద్ద ఐస్ ఫెస్టివల్‌లో ఈ హార్బిన్ ఫెస్టివల్ కూడా ఒకటి. కేవలం శిల్పాలు తయారు చేసి పండుగ చేసుకోవడం కాదు.. ప్రతి సారి గతేడాది కన్నా ఎక్కువ ఎత్తు లేదా పెద్దగా ఇక్కడ శిల్పాలను పోటీ పడి మరీ తయారు చేస్తారు. ఇతర దేశాల్లో నమోదైన మంచు శిల్పాల గిన్నీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు దీన్ని వేదికగా చేసుకుంటారు.
ఐస్ కరిగిపోదా...
ఎందుకు కరిగిపోదు.. కానీ అక్కడ మనకున్నంత ఉష్ణోగ్రత వుండదు. జనవరి మాసంలో వారికి -17 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వుంటుంది. ఈ ఉష్ణోగ్రతకు మంచు కరగడం పక్కన పెట్టండి.. నదులు, సముద్రాలు కూడా గడ్డకట్టుకుని వుంటాయి. చైనా వాళ్లు అక్కడ కూడా ఐస్ స్కేటింగ్, డాగ్ రేసింగ్ వంటి క్రీడలు కొనసాగిస్తారు. కాబట్టి వాతావరణం మారే వరకు ఈ పండుగకు ఏ సమస్యా లేదు. ఉష్ణోగ్రతలు మారే కొద్దీ శిల్పాలు వాటంతట అవే కరిగిపోతాయి. అప్పటి వరకు ఎంచక్కా ఎంజాయ్ చేసేయోచ్చు.

భా... రీ... బాగర్..!






ఎత్తు 311 అడుగులు, 705 అడుగుల వెడల్పు, 45,500 టన్నులు బరువు.. ఇవన్నీ దేనికి సంబంధించనవి అనుకుంటున్నారు... భూమి మీదున్న అతి పెద్ద వాహనం బాగర్-288 గురించి. 
ట్రాన్స్‌ఫార్మర్ సిరీస్ సినిమాలో రోబోట్ ఎన్ని విన్యాసాలు చేస్తుందో కదా..! అవసరం వున్నప్పుడు రోబోట్‌లాగా, తరువాత కార్‌లాగా, రేసింగ్ బైక్‌లా ఇలా ఎన్ని రకాలు కావాలి అంటే అన్ని రకాలుగా మారుతుంది. కానీ అది సినిమాలో కాబట్టి ఒకే. కానీ నిజంగా కూడా అటువంటి వాహనం ఒకటుంది. రోబోట్‌లాగా, డిగ్గర్‌లాగా, వాహనంలాగా ఇలా దాని రూపాన్ని ఎలా అయినా మార్చుకోగలదు. అంతేనా అది ప్రపంచంలోనే అతి పెద్ద వాహనం కూడా. దాని పేరే బాగర్-288.

జర్మనీ దేశం తయారు చేసిన వాహనం ఇది. వాహనం అంటే వాహనం కాదు మల్టీ టాస్కర్. దీని పుట్టిళ్లు జర్మనీ. మైనింగ్ రంగానికి చెందిన క్రుప్ అనే కంపెనీ దీన్ని 1978లో తయారు చేసింది. బాగర్ ప్రత్యేకతలను చూసి మొదట నాసా వాళ్లు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే అప్పటి వరకు స్పేష్ షటిల్స్‌ని తీసుకెళ్లేందుకు వాళ్లు ఉపయోగించిన ఛ్రవ్లెర్-ట్రన్స్పోర్తెర్ ప్రపంచంలో అతి పెద్దదిగా వుండేది. ఇక బాగర్ రాకతో రాకతో అది రెండో స్థానానికి చేరుకుంది. దాని స్థానంలో అంతరీక్ష నౌకలను మోస్తోంది. ఇక ఆ పని లేనప్పుడు ఖాళీగా ఏమీ వుండదు లెండి. ప్రస్తుతం బాగర్ గనుల తవ్వకాలలో బిజీగా వుంది. వంద మంది ఒక రోజంతా చేసే పనిని కేవలం ఒక గంటలోనే చేసి పారేస్తోంది. ఇంతకీ రోజుకు ఇది ఎంత బొగ్గును వెలికి తీస్తుందో తెలుసా 2,40,000 టన్నులు. దీన్ని వెలికి తీసి 24,000 లారీలను నింపుతుంది. ఇక దీని నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు కేవలం ఐదుగురు వుంటే చాలు. బాగర్ రెచ్చిపోతుంది. రోజంతా పని చేస్తూనే వుంటుంది. కొసమెరుపు ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద వాహనంగా గొప్పలు పోయే బాగర్ నిమిషానికి కేవలం రెండు మీటర్లు అంతకన్నా తక్కువ దూరం మాత్రమే నడవగలుగుతుంది.

Friday, 11 January 2013

అరాచకాలపై విరుచుకుపడ్డ గళం...!

కాంగోలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలపై విరుచుకుపడ్డ గళం చౌచౌ నమెగాబె. రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ ద్వారా మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలను వెలికి తీసింది.తన మైక్రోఫోనునే ఆయుధంగా మలచుకుని అంతర్జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్లింది.కాంగోలో రోజుకి 36 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వాస్తవాలను తెలియజేసింది. ప్రపంచ ప్రభావశీల మహిళలో స్థానం సంపాదించుకుంది.

girlదక్షిణ కివు రాష్ట్రంలోని బుకావులో చౌచౌ నమెగాబె పుట్టింది. చిన్నతనం నుండే ఎంతో ధైర్యంగా మాట్లాడేది. బెరుకు ఏ మాత్రం కనిపించని మాటలు ఆమెవి.ఏదో సాధించాలనే తపన, కసితో వుండేది. ఇందుకు ఆమె మాట తీరే నిదర్శనం. ఆ లక్షణాలే ఆమెను నేడు ప్రపంచ ప్రభావశీల మహిళల సరసన నిలబెట్టాయి. ఏం చెప్పినా ఆధారాలతో సహా నిరూపించగల ధీరత్వం... కాంగోలో పరిస్థితుల్ని, ప్రజల స్థితి గతుల్ని అం చనా వేయగలిగిన చౌచౌ అట్టడుగు ప్రజల్ని చేరుకునేందుకు వున్న ఏకైక మార్గంగా రేడియోను ఎన్నుకుంది. 1997లో రేడియో మండెలియోలో ప్రజెంటర్‌గా ఆమె తన ెరీర్‌ను ప్రారంభించింది. 

స్థానికంగా ఎంతో పేరున్న రేడియో స్టేషన్‌. 1990లలో ఎంతో ఉద్రిక్తతలకు గురవుతున్న పశ్చిమ కాంగో వైపు చౌచౌ తన దృష్టి సారించింది. మైక్రోఫోన్‌ను ఒక ఆయుధంగా మలచుకుని రహస్యంగా అక్కడి కార్య కలాపాలను డాక్యుమెంటరీగా రూపొందించింది. అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెలికి తీసేందుకు ఎంతో కష్టాలను ఎదుర్కొంది. మానవ హక్కులు అక్కడి వారి పాదాలకింద నలిగి పోవడం చూసి కన్నీళ్లు కార్చింది. తమ జాతి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించింది. మానవహక్కుల వాది గా, జర్నలిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. అక్కడి అధికారుల స్థాయి, పాలనా విధానాల్లో చోటు చేసుకున్న అవినీతిని కూడా వెలికి తీసి చూపింది.

woman12003లో చౌచౌ దక్షిణ కివు మహిళా మీడియా అసోసి యేషన్‌ను(ఏఎఫ్‌ఇఎం)ను ప్రారంభించింది. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిం చింది. దీనితోపాటే మహిళా జర్నలిస్టులకు కూడా శిక్షణ అందించింది. ఏఎఫ్‌ఇఎం, రేడియో బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా చౌచౌ ఎంతో వెలుగులోకి వచ్చింది. మహిళా సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సమస్యలపై ఆమె పనిచేసింది. ఆమె కాంగో లోని మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.డిసెంబర్‌ 2007న హా గ్యూ కు ప్రయాణం చేసింది. అంతర్జాతీయ న్యాయ స్థానంలో కివు మహిళా న్యాయంపై పోరాడింది. 2009లో ఆమె ఆక్టర్‌, డైరెక్టర్‌ బెన్‌ అఫ్లెక్‌ రూ పొందించిన డాక్యుమెంటరీ ద్వారా ఆమె గ్లోబ ల్‌ లీడర్‌ షిప్‌ అవార్డు, దాని ద్వారా వచ్చిన లా భాలను పొందింది. వాషింగ్‌టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో ఆమె ఈ బహుమతిని అందుకుంది.
-హైమ సింగతల
surya telugu daily May 1, 2011

Saturday, 10 November 2012

మాటల ది"గ్గజం"




మొన్నటికి మొన్న ఒకటే పెయింటింగ్స్ వేసేసింది. నిన్న మరొకటి కార్లు కడెగె బిజినెస్ పెట్టేసింది. ఎ రోజు ఏకంగా హాయ్ హలో అంటూ పలకరించేస్తోంది మరొకటి.. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు ఏనుగుల గురించి..

ఇన్ని రోజులు మనుషులు ఒక్కటే మాట్లాడతారు అనుకున్నే వాళ్ళం.. అక్కడక్కడ  చిలకలు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లె అనుకున్నాం. తరవాత ఓ ఎలుక ముద్దుగా తన ప్రియురాలిని మురిపించేదుకు పాట పాడితే అది గొప్ప సింగర్ ఐపోతుందని చెప్పం.. ఇప్పుడు ఓ ఏనుగు నేనేమైన తక్కువ అని హాయ్ హలో కూర్చో అని మనకే చెబుతోంది.. మావటి చెప్పిన మాటల్ని వల్లెవేస్తోంది.  
ఇది వరకే కొరియాలోని ఓ ఏనుగు గొప్ప పేరు తెచ్చుకుని వార్తలకేక్కింది. మరొకటి తొండంతో నిల్లు చిమ్ముతూ కార్లు కడిగే జాబు చేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఏనుగులు చేసే వింతలూ చాలానే ఉన్నాయ్. ఇప్పుడు 22 ఏళ్ళ ఆడ ఏనుగు కోసిక్వంతు వచ్చింది. ఐదేళ్ళ వయసున్నపుడు సౌత్ కొరియా జుకి చేరింది. అప్పటి నుండి అక్కడే ఉంటోంది. 2004 నుండి అంటే కోసిక్కి 14 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి మాట్లాడటం మొదలు పెట్టింది. కానీ మొద మావటి దాని మాటల్ని పట్టించుకోలేదు. క్రమంగా మనుసుల్లనే ఏంటో చక్కగా మాటలాడటం చూసి అదికారులకి చెప్పాడు. ఇంకేముంది కాలిఫోర్నియా పరిసోదకుడు ఏంజెలా స్తోగేర్ సౌత్ కొరియా చేరుకొని కోసిక్ని పరిసిలించాడు. అది మాట్లాడిన మాటల్ని రికార్డు చేసాడు అది మాట్లాడిన ఐదు మాటలు అనయోంగ్, అంజా, అనియ,  నువో, చావ వీటి అర్థాలు వరుసగా హలో, కూర్చో, వద్దు పడుకో, మంచిది అని.
అసలు ఎనుగుకు పై పెదవి ఉండదు. కింది పెదవి మాత్రమే ఉంటుంది. అందులోని మాట్లాడేందుకు కావలసిన అవయవ నిర్మాణం కూడా  సరిగా ఉండదు.అలాంటిది ఎలా మాట్లాడగాలుగుతుంది అన్నది పెద్ద విచిత్రంగా ఉంది. అందుకే దీనిపై పరిశోదనలు చేస్తున్నారు వారి పరిశోదనాల్లో దీనికి సంబందించిన విషయాలు బైట పడితే ఇంకేముంది ఎంచక్కా మన కుక్క పిల్లి అన్నిటికి మాటలు నేర్పించుకోవచ్చు.